iDreamPost
android-app
ios-app

సిటీలో సైకో కిల్లర్.. OTTలో ది బెస్ట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్!

OTT Suggestions- Best K Drama Flower Of Evil: ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకు బాగా ఆదరణ పెరిగింది. కే డ్రామాల్లో ఏ సినిమా, సిరీస్ వదలకుండా చూసేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ కొరియన్ సిరీస్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best K Drama Flower Of Evil: ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకు బాగా ఆదరణ పెరిగింది. కే డ్రామాల్లో ఏ సినిమా, సిరీస్ వదలకుండా చూసేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ కొరియన్ సిరీస్ తీసుకొచ్చాం.

సిటీలో సైకో కిల్లర్.. OTTలో ది బెస్ట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్!

ఓటీటీలు వచ్చిన తర్వాత వరల్డ్ సినిమా మొత్తం మన ముంగిట్లోకి వచ్చినట్లు అయ్యింది. అందరూ అన్నీ సినిమాలు చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది వారికి రాని భాష సినిమాలను కూడా వదలడం లేదు. ఇంకొందరు అయితే సినిమాలు చూసి కొత్త భాష నేర్చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా కొరియన్ సినిమాలు, సిరీస్లు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటోది కూడా కొరియన్ సిరీస్ గురించే. అయితే కొరియన్ అనగానే లవ్ స్టోరీ అనకునేరు. కే డ్రామాల్లో చాలానే బెస్ట్ థ్రిల్లర్స్ ఉన్నాయి. అందులో ది బెస్ట్ థ్రిల్లర్ ని మీకోసం సజీషన్ గా తీసుకొచ్చాం. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇండియాలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది అమ్మాయిలు కొరియన్ డ్రామాలు చూసేసి కొరియన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడేస్తున్నారు. సబ్ టైటిల్స్ తో సంబంధం లేకుండా కొరియాలోనే సినిమాలు చూస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి.. వాటి ప్రభావం ఏ రేంజ్ లో ఉంది అనేది. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటి కోవకు చెందిందే. ప్రతి సీన్, ప్రతి ఎపిసోడ్ మీకు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్, సైకో థ్రిల్లర్స్ చూసే అభిమానులు అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా మొత్తం హత్యలు, వాటి ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

Flowers of vil

ఈ సినిమాలో కథకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక సిటీలో హత్యలు జరుగుతూ ఉంటాయి. మొదటి ఇవి ర్యాండమ్ గా జరుగుతున్నాయి అనుకుంటారు. కానీ, వాటిని ఒక్కడే చేస్తున్నాడు అనే విషయాన్ని తర్వాత డిటెక్టివ్స్ కనుగొంటారు. ఎలా అంటే అన్ని హత్యలు ఒకే పేట్రన్ లో జరుగుతూ ఉండటంతో వైద్యులు నిర్ధారిస్తారు. ఇది సైకి కిల్లింగి అని. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు మీద మరింత దృష్టి పెడతారు. అయితే కిల్లర్ ఎవరు అని ప్రేక్షకులకు తెలుసు. కానీ, పోలీసులకు ఎలా తెలిసింది అనేదే ఇక్కడ పాయింట్. కిల్లర్ ని పట్టుకోవడం కోసం వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు ఎలా పట్టుకున్నారు? అసలు పట్టుకోగలిగారా లేదా? అనేదే ఇక్కడ ప్రధానంగా ఆసక్తిని రేకెత్తించే అంశం. అలాగే దొరికినట్లే దొరికి చేజారిపోయవడం అతని స్పెషాలిటీ. ఈ కొరియా సిరీస్ పేరు ఫ్లవర్ ఆఫ్ ఈవిల్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 38 ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి.. ఈ కొరియన్ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.