iDreamPost
android-app
ios-app

కంటికి కనిపించని బూతంతో పోలీసుల యుద్ధం.. ఈ సిరీస్కు చెమటొచ్చేస్తాయి..

  • Published Jun 12, 2024 | 3:47 PM Updated Updated Jun 12, 2024 | 3:47 PM

OTT Suggestions- The Best Horror Series Them: హారర్ సినిమాలు, సిరీస్లు ఇష్టపడే వారికోసం ఒక బెస్ట్ హారర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ నుంచి ఆఖరి ఎపిసోడ్ వరకు ఆపకుండా చూసేస్తారు.

OTT Suggestions- The Best Horror Series Them: హారర్ సినిమాలు, సిరీస్లు ఇష్టపడే వారికోసం ఒక బెస్ట్ హారర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ నుంచి ఆఖరి ఎపిసోడ్ వరకు ఆపకుండా చూసేస్తారు.

  • Published Jun 12, 2024 | 3:47 PMUpdated Jun 12, 2024 | 3:47 PM
కంటికి కనిపించని బూతంతో పోలీసుల యుద్ధం.. ఈ సిరీస్కు చెమటొచ్చేస్తాయి..

ఎన్ని చెప్పుకున్నా.. ఎన్ని సినిమాలు, సిరీస్లు చూసినా.. ఒక్క హారర్ సినిమా చూస్తే వచ్చే కిక్కు వేరేగా ఉంటుంది. అందుకే చాలామంది వారంలో ఒక్కటంటే ఒక్కటైనా హారర్ సినిమా చూస్తూ ఉంటారు. అయితే వారం మొత్తానికి సరిపోయేలా ఒక మంచి హారర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస్ చూస్తుంటే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అంతేకాకుండా.. ఈ సిరీస్ కి అడిక్ట్ అయిపోతారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ కథలో వేగం పెరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అనే విషయం పోలీసులకు కూడా అర్థం కాదు. వాళ్లు అంతా దానిని ఒక హత్యగానే భావిస్తారు.

సాధారణంగా హారర్ సినిమా అంటే ఎవరో ఒక వ్యక్తి అతీత శక్తులను ఎదిరించి పోరాడుతూ ఉంటాడు. కానీ, ఇక్కడ మాత్రం ఆ బూతానికి ఎదురుగా ఒక పోలీసు డిపార్టుమెంట్ పోరాడుతూ ఉంటుంది. అయితే తాము పోరాడుతోంది.. యుద్ధం చేస్తోంది ఒక అతీత శక్తి మీద అనే విషయం వారికి తెలీదు. ఆ సిటీలో వరుస హత్యలతో అంతా దిగ్భ్రాంతికి గురవుతారు. అసలు చనిపోతోంది ఎవరు? వారిని చంపుతోంది ఎవరు? ఎందుకు చంపుతున్నారు? ఎందుకోసం చంపుతున్నారు? ఇలాంటి చాలానే చిక్కు ప్రశ్నలు వారి ముందు ఉంటాయి. ఈ కేసును టేకప్ చేసిన డిటెక్టివ్ కి అసలు ఏమీ అర్థం కాదు. మొదట ఒక ఫాస్టర్ హోమ్ చూసుకునే మహిళతో హత్యలు స్టార్ట్ అవుతాయి. ఆమె గదిలో ఎన్నో టీవీలు పెట్టి ఉంటాయి.

మొదటి హత్య మాత్రమే కాదు.. తర్వాత జరిగిన వాటిలో కూడా టీవీలు, ఏవో వీడియోలు ఉంటాయి. కానీ, అవి అక్కడ ఎందుకు ఉన్నాయి అనే విషయం తెలీదు. వాళ్లు ఏం చూస్తున్నారు? అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు అవి హత్యలా? ఆత్మహత్యలా అనే మరో ప్రశ్న ఎదురవుతుంది. ఎప్పుడైతే ఈ కేసు తీసుకుంటుందో అప్పటి నుంచి ఆ డిటెక్టివ్ జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఇదంతా చేస్తోంది కంటికి కనిపించని శక్తి అనే విషయం వారికి కాస్త తొందరగానే అర్థమవుతుంది. అయితే బూతాలు ఉంటాయి అనే పాయింట్ ని ఆమె అంగీకరించలేకపోతుంది. కానీ, ఒకసారి స్వయంగా అనుభవం అయ్యాక బాగా నమ్ముతుంది.

ఈ వెబ్ సిరీస్లో చనిపోయిన వారి మృతదేహాలు చూసిన వైద్యులు కూడా షాకవుతూ ఉంటారు. ఎందుకంటే ట్రైన్ కింద పడితే ఎలా అయితే బోన్స్ ఫ్యాక్చర్ అవుతాయో.. నుజ్జు నుజ్జు అవుతాయో అలా చనిపోయిన వాళ్ల బాడీల్లో ఎముకులు నుజ్జు అయి ఉంటాయి. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఈ హారర్ సిరీస్ పేరు ‘ధెమ్’. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ని స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఆపడం కష్టం. హారర్ సిరీస్లు చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కూడా అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş