OTT Suggestions-Best Scary Movie : OTT లో 'సిక్సా నేరక' హర్రర్ మూవీ చూస్తే.. చెమటలు పట్టాల్సిందే

OTT లో ‘సిక్సా నేరక’ హర్రర్ మూవీ చూస్తే.. చెమటలు పట్టాల్సిందే

OTT Best Scary Movie : ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చూసి ఉంటారు కానీ ఇలాంటి భయంకరమైన సినిమాను మాత్రం చూసి ఉండరు. ఈ సినిమా ఒంటరిగా మాత్రం చూడొద్దు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Scary Movie : ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చూసి ఉంటారు కానీ ఇలాంటి భయంకరమైన సినిమాను మాత్రం చూసి ఉండరు. ఈ సినిమా ఒంటరిగా మాత్రం చూడొద్దు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారా.. స్వర్గానికి వెళ్తారా అనే డిస్కషన్స్ ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటాము. అలాగే కొన్ని సార్లు ఏదైనా తప్పు చేస్తే నరకానికి వెళ్తారు అని అనే మాటలు కూడా వినే ఉంటారు. అసలు నరకం ఉందో లేదో.. ఆ మాటల్లో ఎంత నిజం ఉందొ కూడా ఎవరికి తెలీదు. ఒకవేళ నరకం అనేది ఉంటే కనుక అది ఎలా ఉంటుందనేదే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ . నిజముగా నరకానికి వెళ్లొచ్చిన ఫీలింగ్ ను తెప్పిస్తుంది. ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చూసి ఉంటారు కానీ ఇలాంటి భయంకరమైన సినిమాను మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే .. సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు దంపతులను చూపిస్తారు. ఎక్కడ చావు జరిగినా కూడా అక్కడకు వెళ్లి ఆ కార్యక్రమాలు చేస్తారు. ఈ క్రమంలో ఒక ఆవిడ చనిపోతే అక్కడకు వెళ్లారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు , ఇద్దరు మగపిల్లలు ఉంటారు. అయితే చిన్నపటినుంచి వారి ఎవరైనా చనిపోతే స్వర్గం , నరకం వీటికే వెళ్తారంటూ పేరెంట్స్ చెప్పి పెంచుతారు. దీనితో అక్కడ ఒక ఆవిడ చనిపోయిన తరువాత ఆ పిల్లలు ఇదే టాపిక్ మాట్లాడుకుంటారు. కట్ చేస్తే.. ఆ పిల్లలో ఒక అమ్మాయికి ఆ డెడ్ బాడీని ఎవరో కట్టి పడేసినట్లు కనిపిస్తుంది. దీనితో ఆమె నరకంలో ఉంది అంటూ.. అరుస్తుంది. దీనితో వాళ్ళ అమ్మ ఆమెను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ప్రతి రోజు వీరు నమాజ్ కచ్చితంగా నమాజ్ చేస్తారు. ఓ రోజు పేరెంట్స్ వీరిని వదిలేసి మరో చావు ఇంటికి వెళ్తారు.

పిల్లలు ఇంట్లో ఉన్నపుడు సడెన్ గా కరెంట్ పోవడంతో.. చిన్న పాపను మిగిలిన ముగ్గురు కలిసి దెయ్యం దెయ్యం అంటూ.. భయపెడుతూ ఉంటారు. అలా ఆమెను తరచు భయపెడుతూనే ఉండేవారు. కట్ చేస్తే కథను 10 ఏళ్ళ తరువాత చూపిస్తారు. ఆ పిల్లలంతా కూడా ఎవరి ప్రొఫెషన్ లో వారు సెటిల్ అవుతారు. అయితే వారిలో చిన్న కూతురు మాత్రం చదువులో కాకుండా.. పాటల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఇది పేరెంట్స్ కు నచ్చదు. ఈ క్రమంలో వారు పేరెంట్స్ కు తెలీకుండా సింగింగ్ కామపిటేషన్ వెళ్తున్నపుడు వీరికి కొన్ని.. అనుకోని సంఘటనలు ఎదురౌతాయి. సరిగ్గా అప్పుడే డెత్ సెర్మనీ దగ్గర ఉన్న వారి పేరెంట్స్ ను డెడ్ బాడీ సడెన్ గా లేచి అరుస్తుంది. అసలు అక్కడ ఏమైంది ? వారికి ఎదురైన సంఘటనలు ఏంటి ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియలన్నా మంచి హర్రర్ సీన్స్ చూడాలన్నా.. ‘సిక్సా నేరక’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments