iDreamPost
android-app
ios-app

OTT లో సాయి పల్లవి నటించిన ‘పావ కథైగల్’ ఆంథాలజీ సిరీస్..

  • Published Aug 09, 2024 | 1:00 AM Updated Updated Aug 09, 2024 | 1:00 AM

OTT Anthology Series In Telugu: ఆంథాలజీ కథలకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తుంది. ఒకటే సినిమాలను నాలుగైదు కథలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూపించే తీరు అందరిని మెప్పించేస్తుంది. ఇప్పుడు చెప్పుకునే సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ సిరీస్ ఏంటో చూసేయండి.

OTT Anthology Series In Telugu: ఆంథాలజీ కథలకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తుంది. ఒకటే సినిమాలను నాలుగైదు కథలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూపించే తీరు అందరిని మెప్పించేస్తుంది. ఇప్పుడు చెప్పుకునే సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ సిరీస్ ఏంటో చూసేయండి.

  • Published Aug 09, 2024 | 1:00 AMUpdated Aug 09, 2024 | 1:00 AM
OTT లో సాయి పల్లవి నటించిన ‘పావ కథైగల్’ ఆంథాలజీ సిరీస్..

ఓటీటీ లో రెగ్యులర్ సినిమాలతో పాటు ఆంథాలజీ కథలను ఇష్టపడే వారు కూడా బాగానే ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్కో కథ ఒక్కో జోనర్ లో ఉంటూ.. చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచుతుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్న ఆంథాలజీ సిరీస్ కూడా అదే. ఈ సిరీస్ లో సాయిపల్లవి, అంజలి, కల్కి, సిమ్రాన్, గౌతమ్ మీనన్ , ప్రకాష్ రాజ్ లాంటి ఎంతో మంది నటీ నటులు నటించారు. ఈ ఆంథాలజీ సిరీస్ లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఈ కథలన్నీ కూడా కుటుంబం , పరువు నేపథ్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ను మీరు చూశారా లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సిరీస్ లోని మొదటి కథ విషయానికొస్తే.. ‘నా బంగారం’.. పల్లెటూరిలో ఉంటున్న ఒక అబ్బాయి.. తనలో తనకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గుర్తించి సిటీకి వెళ్లి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిలా మారి.. ఊరికి తిరిగి వస్తాడు . తానూ ప్రేమిస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకోగా.. అక్కడ అతనికి అనుకోని పరిస్థితులు ఎదురౌతాయి. అవేంటి ? అమ్మాయికి మారిన అతనిని అతని కుటుంబం యాక్సెప్ట్ చేసిందా లేదా ? అనేది కథ. ఇక రెండో కథ.. ‘వాళ్ళను ప్రేమించుకోనీ’.. ఆదిలక్ష్మి, జ్యోతి లక్ష్మి అనే ట్విన్స్.. తన తండ్రికి భయపడి వారి ప్రేమ విషయాన్ని దాచేస్తారు. ఆదిలక్ష్మి దైర్యం చేసి చెప్పగా కులం పేరుతో ఆమెను చంపేస్తారు. దీనితో జ్యోతి లక్ష్మి తన ప్రేమ విషయాన్నీ చెప్పకుండా దాచేసి తానొక లెస్బియన్ అని అబద్దం చెప్తుంది. ఆ తర్వాత ఏమౌతుంది అనేది తెరపై చూడాల్సిన కథ.

పై రెండు కథలకంటే కూడా ఇప్పుడు చెప్పుకోబోయే కథలు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. మూడో కథ విషయానికొస్తే.. ‘దివి కుమార్తె’ .. మది, సత్య అనే దంపతులు 20 ఏళ్లుగా వారి జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉంటారు. సొంత ఇల్లు, ముగ్గురు పిల్లలు, సమాజంలో మంచి గౌరవం.. ఇలా అంతా బాగానే ఉందనుకునే క్రమంలో వారి చిన్న కూతురిపై కొందరు అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని పరిస్థితులు ఎలా మారాయి అనేది మిగిలిన కథ . ఇక నాలోగో కథ విషయానికొస్తే.. ‘ఆ రాత్రి’.. ఈ కథలో సాయి పల్లవి , ప్రకాష్ రాజ్ తండ్రి కూతుళ్లుగా నటించారు. ఇది నిజంగా జరిగిన ఓ కథ. సుమతి (సాయి పల్లవి) తన తండ్రికి చెప్పకుండా పెళ్లిలో చేసుకుని భర్తతో కలిసి జీవిస్తూ ఉంటుంది. అప్పటికి ప్రెగ్నెంట్ అయ్యి ఉండి మరో మూడు నెలల్లో డెలివెరి ఉందనగా తన తండ్రి కూతురుని వెతుక్కుంటూ వస్తాడు. అంతా బాగుంది అనుకునే సమయానికి పాత పగను, పరువును మనసులో ఉంచుకుని.. కన్న కూతురిని చంపేందుకు కూడా వెనుకాడడు.. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. ఈ సిరీస్ అన్నిటిలో ఇదే బెస్ట్ కథ. ఈ ఆంథాలజీ సిరీస్ పేరు “పావ కథైగల్” . ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే చూడండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.