iDreamPost
android-app
ios-app

ది లాస్ట్ వోయెజ్ ఆఫ్ ది డిమీటర్.. OTT లో భయంకరమైన హర్రర్ మూవీ..

  • Published Aug 08, 2024 | 3:00 AM Updated Updated Aug 08, 2024 | 3:00 AM

OTT Horror Fantasy Thriller : హర్రర్ సినిమాలను చాలా మంది ఎటువంటి భయం లేకుండా చూస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం భయపడని వారు కూడా కచ్చితంగా భయపడతారు. మరి ఈ మూవీ ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

OTT Horror Fantasy Thriller : హర్రర్ సినిమాలను చాలా మంది ఎటువంటి భయం లేకుండా చూస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం భయపడని వారు కూడా కచ్చితంగా భయపడతారు. మరి ఈ మూవీ ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

  • Published Aug 08, 2024 | 3:00 AMUpdated Aug 08, 2024 | 3:00 AM
ది లాస్ట్ వోయెజ్ ఆఫ్ ది డిమీటర్.. OTT లో భయంకరమైన హర్రర్ మూవీ..

ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ ఇలాంటి హర్రర్ సినిమాను మాత్రం చూసి ఉండరు. హర్రర్ అంటే కేవలం దెయ్యం తో మాత్రమే భయపెట్టడమే కాకుండా.. విచిత్రమైన జంతువులు , రకరకాల ఆకారాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య హర్రర్ సినిమాలను చాలా మంది ఎటువంటి భయం లేకుండా చూసేస్తున్నారు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం భయం లేని వారు కూడా కచ్చితంగా భయపడతారు. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్టార్టింగ్ లో చారిత్రిక సంఘటనల గురించి చెప్తూ ఉంటారు. 1897 లో రష్యన్ ఓడ రోమానియా నుంచి ఇంగ్లాండ్ కు బయల్దేరుతుంది. ఆ ఓడలో ప్రైవేట్ కార్గో 50 ఉడెన్ బాక్స్ లను ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంగ్లాండ్ కు చేరుకున్న తరువాత ఈ ఓడ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. అక్కడ ఓ విలేజ్ కు వచ్చిన ఈ ఓడ అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లను ఆలోచనలో పడేస్తుంది. ఆ ఓడలో వారికి ఓ డైరీ కనిపిస్తుంది అందులో ఒక వార్నింగ్ మెసేజ్ ఉంటుంది. కట్ చేస్తే సీన్ ఐదు వారల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. రోమానియా లాబెర్స్ ఉడెన్ బాక్సాస్ ను ఓడలో చేరుస్తు ఉంటారు. దానిలో ఎదో పురాతన వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఆ షిప్ కెప్టెన్ ను చూపిస్తారు. ఆ షిప్ లో ఎక్కువ లోడ్ ఉండడంతో కొంతమనై లేబర్స్ కావాలని ఎదురుచూస్తారు. అలాగే అక్కడ ఓపెద్దయానతో డీల్ కుదుర్చుకుని షిప్ లో బయల్దేరతారు. కానీ కింద ఉన్న వాళ్లంతా ఆ షిప్ లో ఉన్న వారికి ఎదో ప్రమాదం జరగబోతుందని భయపడుతూ ఉంటారు.

The Last Voyage of the Demeter movie

ఇక జర్నీ స్టార్ట్ అయినా తర్వాత.. కెప్టెన్ తన డైరీలో ప్రతిదీ రాస్తూ ఉంటాడు. సముద్రంపై ఇదే తన ఆఖరి ప్రయాణం అని చెప్తాడు. ఆ నెక్ట్ డే ఉదయాన్నే ఓ పెద్ద అలా ఓడను ఢీకొడుతుంది. షిప్ అయితే ఏమి కాదు కానీ.. ఆ షిప్ లో ఓ పెద్ద బాక్స్ వచ్చి పడుతుంది.ఆ బాక్స్ లో ఓ అమ్మాయి ఉంటుంది. వారు ఆ అమ్మాయిని చూసి భయపడి సముద్రంలో పడేద్దాం అనుకుంటారు. కానీ ఆ షిప్ లో ఓ డాక్టర్ ఉండడంతో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తారు. మరో వైపు ఆ ఉడెన్ బాక్స్ ల నుంచి విచిత్రమైన జీవులు బయటకు వస్తాయి. అవి కేవలం ఆ పెద్దాయనకు మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఆ షిప్ లోని కొన్ని జంతవులు అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మాయి వలెనే జరుగుతున్నాయని వారంతా అనుకుంటారు. అసలు ఆ షిప్ లో ఏమి జరుగుతుంది? వారితో ఉన్నది ఎవరు ? ఆ అమ్మాయిని అక్కడకు పంపింది ఎవరు ? ఆ ఉడెన్ బాక్స్ లలో ఏమున్నాయి ? అక్కడ ఆ పెద్దాయనకు కనిపిస్తున్న వింత జీవులు ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే.. “ది లాస్ట్ వోయెజ్ ఆఫ్ ది డిమీటర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.