నవీన్ పొలిశెట్టి కెరీర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్.. OTTలో ఉంది చూశారా?

OTT Suggestions- Naveen Polishetty Career Best Movie Chhichhore: నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ప్రమాదం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. అయితే నవీన్ పొలిశెట్టి ప్రెజెన్స్ ని మిస్ అవుతున్నాం అనుకుంటే మాత్రం మీరు ఓటీటీలో ఉన్న ఆయన కెరీర్ బెస్ట్ మూవీని ఓసారి చూసేయండి.

OTT Suggestions- Naveen Polishetty Career Best Movie Chhichhore: నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ప్రమాదం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. అయితే నవీన్ పొలిశెట్టి ప్రెజెన్స్ ని మిస్ అవుతున్నాం అనుకుంటే మాత్రం మీరు ఓటీటీలో ఉన్న ఆయన కెరీర్ బెస్ట్ మూవీని ఓసారి చూసేయండి.

నవీన్ పొలిశెట్టి టాలెంట్ గురించి కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్ వాళ్లకు, నెటిజన్స్ కు కూడా బాగా తెలుసు. ఆయన హిందీ మాట్లాడితే నార్త్ వాళ్లు కూడా కనిపెట్టలేరు తెలుగు వాడంటే. నవీన్ హిందీలో చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ లో ఇంగ్లీష్ చదువుకోవడం గురించి హిందీలో చెప్పే సీన్ ఇప్పటికీ మర్చిపోలేం. అలాంటి నవీన్ పొలిశెట్టి హిందీలో చేసిన ఒక అద్భుతమైన సినిమా గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఈ సినిమా గురించి చాలామందికి తెలిసే ఉండచ్చు. కానీ, తెలియని వాళ్లు మాత్రం కచ్చితంగా ఈ మూవీ గురించి, నవీన్ పొలిశెట్టి టాలెంట్ గురించి తెలుసుకోవాల్సిందే. మరి.. ఆ మూవీ ఏది? ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

నవీన్ పొలిశెట్టి మాత్రమే కాదు.. ఈ మూవీ ఇంకో స్పెషల్ స్టార్ కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన మధ్య లేడు. అతనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్. వీళ్లంతా కాలేజ్ స్టూడెంట్స్ గా కనిపించిన మూవీ ఇది. ఒక వ్యక్తి జీవితంలో కాలేజ్ లైఫ్ అంటే ఎంత ఇంపార్టెంటో ఈ మూవీ చూస్తే తెలిసిపోతుంది. మీకు జీవితాన్ని నేర్పేది అక్కడే, మీకు బతకడం నేర్చుకునేది అక్కడే, అలాగే మీకు లైఫ్ లాంగ్ దోస్తులు దొరికేది కూడా అక్కడే. అలాంటి వాళ్లు మీక ఇబ్బంది వస్తే అడ్డంగా నిలబడిపోతారు. ఇదే పాయింట్ మీద ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాలో అందరికంటే కూడా నవీన్ పొలిశెట్టి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పాలి అంటే మ్యాడ్ సినిమాలో సంగీత్ శోభన్ చేసిన పాత్ర మాదిరిగా అనమాట.

సినిమా పేరు చిచోరే. అంటే ఫ్రెండ్స్ లో ఉండే వాళ్లు ఎంత అల్లరిగా ఉంటారు? ఏదైనా అవసరం వస్తే ఎంత దూరం వస్తారు? కాలేజ్ లైఫ్ లో ఉండే మజా ఏంటి అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా కథను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్టార్ట్ చేస్తాడు. తాను పెద్దవాడు అయ్యాక.. అతనికి ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని చెప్తూ.. తన కాలేజ్ లైఫ్, తన ఫ్రెండ్స్ గురించి చెప్తూ వస్తాడు. అలా ఈ సినిమా కథని స్టార్ట్ చేస్తారు. తమ ఫ్రెండ్ కి వచ్చిన కష్టం ఏంటి? ఆ కష్టాన్ని ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎలా తీర్చారు? అసలు వాళ్ల రీయూనియన్ ఎలా జరిగింది? వాళ్ల కాలేజ్ లో అంత గొప్పగా ఏం జరిగింది? అనే విషయాలు మీరు ఈ చిచోరే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments