iDreamPost
android-app
ios-app

మీకు గజిని మూవీ నచ్చింది కదా? OTTలో ‘మెమెంటో’ చూస్తే ఇంకా థ్రిల్ అవుతారు!

  • Published Aug 11, 2024 | 7:10 AM Updated Updated Aug 11, 2024 | 7:10 AM

OTT Best Suspense Thriller : కొన్ని సినిమాలు చూడాలంటే.. కచ్చితంగా కొన్ని థంబ్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.. అందులో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ముందుంటుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ చూడాలో .. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Suspense Thriller : కొన్ని సినిమాలు చూడాలంటే.. కచ్చితంగా కొన్ని థంబ్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.. అందులో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ముందుంటుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ చూడాలో .. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 11, 2024 | 7:10 AMUpdated Aug 11, 2024 | 7:10 AM
మీకు గజిని మూవీ నచ్చింది కదా? OTTలో ‘మెమెంటో’ చూస్తే ఇంకా థ్రిల్ అవుతారు!

స్ట్రెయిట్ గా సస్పెన్స్ ఎలిమెంట్స్ తో వచ్చే సినిమాల కోసం పెద్దగా బ్రెయిన్ యూస్ చేయక్కర్లేదు. కానీ కొన్ని సినిమాలలో ఒక్కో ప్లాట్ ను కనెక్ట్ చేసుకోవడానికి.. ఆ సినిమాను అర్ధం చేసుకోవడానికి కంఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ పజిల్ ను సాల్వ్ చేస్తూ మూవీని అర్ధం చేసుకుంటూ చూస్తే మాత్రం.. కచ్చితంగా ఆ మూవీ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. అలాంటి సినిమాలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ముందుంటుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు.. ఇలాంటి సినిమాను చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది .. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. లేనర్డ్ అనే వ్యక్తి టెడ్డి అనే అతనిని చంపే సీన్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు వీరిద్దరూ ఎవరో చూసేద్దాం.. లేనర్డ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్టిగేటర్.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ను వెరిఫై చేయడం అతని పని.. ఈ క్రమంలో తన జాబ్ లో భాగంగా.. సామీ అనే ఒక పేషంట్ ను కలుస్తాడు. వీరిద్దరికి కూడా షార్ట్ టైమ్ మెమరీ లాస్ ఉంటుంది. కట్ చేస్తే ఓ ఇద్దరు దొంగలు లేనర్డ్ వైఫ్ పై అత్యాచారం చేసి చంపేస్తారు. వారిలో ఒకరిని లేనర్డ్ చంపేస్తాడు. ఇంకొకడు అతని తలకు గాయం చేసి పారిపోతాడు. తనకు తలకు తగిలిన దెబ్బ వలన .. అతనికి ఏమి గుర్తుండదు. ఒక ఇన్సిడెంట్ కేవలం 15 రోజులు మాత్రమే గుర్తుంటుంది. దీనితో తన వైఫ్ ను చంపింది జాన్ జీ అని చేతిపై టాటూ వేసుకుంటాడు. ఈ క్రమంలో టెడ్డి అనే ఓ పోలీస్.. ఆ క్రిమినల్ ను పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అయితే అతనికి ఎలాగూ గుర్తుండదు కాబట్టి.. ఇతనిని వాడుకుని.. వేరే డ్రగ్ డీలర్స్ ను చంపిస్తూ.. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు.

కట్ చేస్తే అలా మర్డర్స్ చేస్తూనే.. టెడ్డీని కూడా మర్చిపోతాడు. అక్కడ ఓ హత్య చేసిన తర్వాత.. టెడ్డి లేనర్డ్ అసలు ఏం జరిగిందో చెప్తాడు. అతను చెప్పిన కథ ప్రకారం అయితే.. లేనర్డ్ అప్పటికే తన వైఫ్ ను చంపిన జాన్ జీ ని చంపేస్తాడు. అతని వైఫ్ ను చంపింది కూడా లెనార్డ్ ఏ. అంతే కాదు ఆ మెమరీ లాస్ పేషంట్ సామి మరెవరో కాదు ఇతనే. ఇది టెడ్డి లేనర్డ్ కు చెప్పిన కథ. పైగా అతని పేరు కూడా జాన్ జీ అనే చెప్తాడు. ఈ ఒక్క సీన్ సినిమా మొత్తం అర్థంచేసుకోడానికి పెద్ద హింట్. అసలు లెనార్డ్ కు టెడ్డి చెప్పింది నిజమేనా ! చివరికి ఏమైంది ! కాస్త అర్ధం చేసుకుంటూ చూస్తే కానీ ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం స్ట్రీమింగ్ అవ్వట్లేదు. కానీ ఫ్లిక్సర్ లో ఈ సినిమాను చూసేయొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.