Swetha
OTT Best Psychological Suspense thriller: సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేందుకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.
OTT Best Psychological Suspense thriller: సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేందుకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.
Swetha
సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటె కనుక.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకంటే కూడా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్.. మూవీ లవర్స్ కు ఇంకాస్త కిక్ ఇస్తాయి. ఎప్పుడైనా మన ఆత్మ మనకే కాల్ చేసి సైకలాజికల్ గా.. డీవియేట్ చేసే కథ గురించి విన్నారా.. ఈ సినిమా కాన్సెప్ట్ అదే. అసలు ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కార్తీక్ చిన్నప్పుడు చేసిన తప్పు ఇప్పటికి వేధిస్తూనే ఉంటుంది. కార్తిక్ ఎవరితోనే గట్టిగా మాట్లాడలేకపోవడం వలన తన ఫ్రెండ్స్ అదునుగా తీసుకుని.. అతనిని ఏడిపిస్తూ ఉంటారు. కార్తీక్ హౌస్ ఓనర్ అతని దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలని చూస్తూ ఉంటాడు. ఇక ఆఫీస్ లో కూడా అతనిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇక మొత్తం మీద అతనికి నచ్చే విషయం ఏదైనా ఉంది అంటే.. అది ఆఫీస్ లో ఉండే సోనాలి అనే అమ్మాయి. కానీ కార్తీక్ ది వన్ సైడ్ లవ్. ఏమి మాట్లాడలేక కార్తీక్ తన ప్రేమను తనలోనే ఉంచుకుంటాడు. అసలు చిన్నప్పుడు కార్తీక్ చేసిన తప్పేంటంటే.. చిన్నప్పుడు కార్తీక్, తన అన్న వినోద్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు. వినోద్ ఎప్పుడూ కార్తీక్ ను ఏడిపిస్తునే ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు వినోద్ కార్తీక్ ను బావిలో పడేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ ప్రమాదంలో వినోద్ బావిలో పడిపోతాడు. దీనితో అప్పటినుంచి అతను డిప్రెషన్ లోనే ఉంటాడు.
అందుకోసం అతను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు కూడా వెళ్తూ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతని జాబ్ కూడా పోతుంది. దీనితో ఓ రోజు అతను ఈ డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో స్లీపింగ్ పిల్స్ వేసుకుందాం అనుకుంటుండగా.. కార్తీక్ కు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు కార్తీక్ ఏ. తానే కార్తీక్ అని నమ్మించడానికి అతని డీటెయిల్స్ అన్ని చెప్తాడు. వెంటనే కార్తీక్ కు భయం వేసి కాల్ కట్ చేస్తాడు. నెక్ట్ డే మార్నింగ్ మళ్ళీ అతనికి కాల్ వస్తుంది. ఆ కాల్ లో కార్తీక్ ని మాట్లాడుతున్నానంటూ ఎవరో వ్యక్తి మళ్ళీ అవే మాటలు చెప్తాడు. ఇలా ప్రతి రోజు ఉదయం 5 గంటలకు కాల్ వస్తుంది. అసలు ఆ కాల్ చేస్తుంది ఎవరు ? ఆ తర్వాత ఏమైంది ? నిజంగానే కార్తీక్ తన అన్నను చంపేశాడా? అతని ప్రేమ కథ ఏమౌతుంది ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “కార్తీక్ కాలింగ్ కార్తీక్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.