Tirupathi Rao
OTT Suggestions- Kota Factory Best Series: ఓటీటీలో ఈ సిరీస్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది ఎంటర్ టైన్మెంట్ కోసం తీసుకొచ్చిన సిరీస్ కాదు. ఇది సమాజంలో ఆలోచన రేకెత్తించడానికి తీసుకొచ్చారు.
OTT Suggestions- Kota Factory Best Series: ఓటీటీలో ఈ సిరీస్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది ఎంటర్ టైన్మెంట్ కోసం తీసుకొచ్చిన సిరీస్ కాదు. ఇది సమాజంలో ఆలోచన రేకెత్తించడానికి తీసుకొచ్చారు.
Tirupathi Rao
ప్రతి ఒక్కరు ఎక్కువ ఆలోచించేది.. ఎక్కువ శ్రద్ధ పెట్టేది రెండో విషయాల మీద. ఒకటి ఆరోగ్యం, రెండు విద్య. తమ పిల్లలు ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎక్కడ చదవాలి అని తల్లిదండ్రులు నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. తమ పిల్లాడు పదో తరగతికి కూడా రాకముందే.. వాళ్ల ఫ్యూచర్ ని డిసైడ్ చేసేస్తారు. ఎంపీసీ చేయించి.. ఇంజినీర్ ని చేయాలి. ఐఐటీలో వేయాలి. పెద్దయ్యాక ఒక పెద్ద ఉద్యోగం చేయాలి అని కలలు కంటూ ఉంటారు. ఆ పిల్లాడి ఇష్టాఇష్టాలు, కోరికలు, కలలు అనేవి అస్సలు పట్టించుకోరు. ఇదంతా ఒకరకం. ఇంకో రకం ఉంటారు. అది పిల్లల సైడ్ నుంచి. తాము ఒకటి అనుకుంటే దానిని సాధించాల్సిందే. అందుకోసం ఎంత కష్టమైన పడతారు. ఇలాంటి రెండు కోణాలు కలిసిన ఒక బెస్ట్ సిరీస్ ఓటీటీలో ఉంది.
సాధారణంగా మీరు వెబ్ సిరీస్ అనగానే కామెడీ, యాక్షన్, డ్రామా కోరుకుంటారు. కానీ, కొన్ని మాత్రం మిమ్మల్ని ఆలోచింపజేసేవి ఉన్నాయి. వాటిలో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ ని ప్రతి తల్లిదండ్రులు చూస్తే వారి పిల్లల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ ఐఐటీ జేఈఈ కోసం ప్రిపేర్ అయ్యే అందరు విద్యార్థులు, తల్లిదండ్రులకు అసలు ర్యాంకుల చట్రంలో విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో ఒక అవగాహన వస్తుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం రాజస్థాన్ లో ఉండే కోటా ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఎడ్ టెక్ సిటీ అంటారు.
ఈ కోట అనేది జేఈఈ- నీట్ పరీక్షలకు విద్యార్థులను తయారు చేసేందుకు పెట్టింది పేరు. ఈ సిటీలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల జీవితాలు ఎలా ఉంటాయి? ర్యాంకుల కోసం విద్యార్థులు పడే నరకం ఎలా ఉంటుంది? అనే విషయాలను టచ్ చేస్తూ చూపించారు. అయితే ఇదంతా నిజంగా జరుగుతుంది అని కాకుండా.. అలాంటి అవకాశాలు ఉన్నాయి అనే కోణంలో తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ సిరీస్లో 3 సీజన్స్ వచ్చేశాయి. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
తొలి రెండు సీజన్స్ కు మాదిరిగానే మూడో సీజన్ కి కూడా అదే తరహా స్పందన లభించింది. ఈ సిరీస్ ని ఇప్పుడు విద్యార్థుల కోణం నుంచే కాకుండా.. ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ సైడ్ నుంచి కూడా చూపించడం స్టార్ట్ చేశారు. అసలు విద్యార్థులకు ఎలా చెప్పాలి? ఎలా చెప్తే వాళ్లకి అర్థమవుతుంది. ర్యాంకుల కోసం విద్యార్థులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా కోటా ఎలా మారింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ సీజన్ 3లో చూపించారు. ఈ సిరీస్ పేరు కోటా ఫ్యాక్టరీ. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.