iDreamPost
android-app
ios-app

అవెంజర్స్ హీరో క్రేజీ యాక్షన్ సిరీస్.. యాక్షన్ లోకి దిగాక వరసలు చూడడు..

  • Published Jun 07, 2024 | 5:20 PM Updated Updated Jun 07, 2024 | 5:20 PM

OTT Suggestions- Jeremy Renner Web Series: మీకు యాక్షన్ వెబ్ సిరీస్లు అంటే ఇష్టమా? అయితే మీకోసం ఒక ఫుల్ ఆఫ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని ఒకటి తీసుకొచ్చాం. ఇందులో ఒక్కో సీన్ కి మీకు పిచ్చెక్కిపోతుంది.

OTT Suggestions- Jeremy Renner Web Series: మీకు యాక్షన్ వెబ్ సిరీస్లు అంటే ఇష్టమా? అయితే మీకోసం ఒక ఫుల్ ఆఫ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని ఒకటి తీసుకొచ్చాం. ఇందులో ఒక్కో సీన్ కి మీకు పిచ్చెక్కిపోతుంది.

  • Published Jun 07, 2024 | 5:20 PMUpdated Jun 07, 2024 | 5:20 PM
అవెంజర్స్ హీరో క్రేజీ యాక్షన్ సిరీస్.. యాక్షన్ లోకి దిగాక వరసలు చూడడు..

అవెంజర్స్ ఫ్రాంచైజ్ సినిమలా అంటే తెలియని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ యూనివర్స్ లో అవెంజర్స్ సినిమాలు అంటే పడి చచ్చిపోతారు. ఆ సినిమాల్లో ఒకరు కాదు.. లెక్కకు మించిన సూపర్ హీరోలు ఉంటారు. ఆ సూపర్ హీరోలకు ఒక్కొక్కరికి ఒక సూపర్ పవర్ ఉంటుంది. వాటిని వాడుతూ.. ఏలియన్స్, సూపర్ విలన్స్ ఆట కట్టిస్తూ ఉంటారు. ఆ లిస్టులో ఉండే హాక్ ఐ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఒక విల్లు, అడ్వాన్స్డ్ బాణాలను చేత పట్టుకుని సూపర్ విలన్స్ ఆట కట్టిస్తూ ఉంటారు. అయితే ఈ సూపర్ హీరో సాధారణంగా కూడా చాలానే సినిమాలు చేశాడు. వాటిలో ఈ యాక్షన్ సిరీస్ కూడా ఒకటి.

అవెంజర్స్ లో హాక్ ఐగా చేసే ‘జెర్మీ రెన్నర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతను కేవలం సూపర్ హీరోగానే కాదండోయ్.. యాక్షన్ హీరోగా కూడా ఇరగదీస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఇరగదీస్తాడు. అలాంటి జెర్మీ రెన్నర్ ఒక యాక్షన్ సిరీస్ చేశాడు. అది 2021 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ఉంది. కొత్త సీజన్ కూడా వస్తోంది. అయితే ఈ సిరీస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే సిరీస్ మాత్రం యాక్షన్ విషయంలో అస్సలు తగ్గదు. గ్యాంగ్ స్టర్స్, గ్యాంగ్ వార్స్ అంటూ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అలాంటి సిరీస్ ఇంక మన అవెంజర్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సిరీస్ లో జెర్నీ రెన్నర్ ఆ సిటీకి మేయర్ గా ఉంటాడు. అయితే పేరుకు మాత్రమే మేయర్. కానీ, యాక్షన్ లోకి దిగితే మాత్రం పెద్ద గ్యాంగ్ స్టర్. ఆ సిటీలో ఉన్న గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ మేయర్ ని చూస్తే వణికిపోవాల్సిందే. సిటీని జాగ్రత్తగా ఉంచేందుకు.. ఏ మేయర్ అని లా అండ్ ఆర్డర్ ని జాగ్రత్తగా ఉంచాలి అని చూస్తారు. ఈ మేయర్ కూడా అలాగే అనుకుంటాడు. కానీ, కాస్త భిన్నంగా గన్ తీసుకుని దానిని కంట్రోల్ లో పెడుతూ ఉంటాడు. ఆ సిటీ మొత్తం గన్నుల కనుసన్నల్లో ఉంటే.. ఇతను మాత్రం ఆ గన్నులను తన వైపునకు తిప్పుకుని ప్రజలను మాత్రం సురక్షితంగా ఉంచేలా చూస్తాడు.

2021లో ఈ యాక్షన్ సిరీస్ తొలి సీజన్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు మొత్తం సీజన్స్ అయ్యాయి. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ పేరు మరేదో కాదు.. ‘మేయర్ ఆఫ్ కింగ్ స్టన్’. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే తొలి సీజన్ మాత్రమే మన దేశంలో చూసేందుకు వీలుంది. మిగిలిన సీజన్స్ కి మన లొకేషన్ లో చూసేందుకు యాక్సెస్స లేదు. మరి.. జెర్మీ రెన్నర్ ఫుల్ ఆఫ్ యాక్షన్ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio