iDreamPost
android-app
ios-app

OTT లో నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఇన్ఫినిటీ’.. క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు

  • Published Aug 25, 2024 | 11:49 AM Updated Updated Aug 27, 2024 | 5:31 PM

OTT Suggestions- Best Investigation Thriller Infinity: ఓటీటీ లో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. దీనితో అప్పుడపుడు కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ను మిస్ అవుతూ ఉంటారు.. ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ మూవీని కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Suggestions- Best Investigation Thriller Infinity: ఓటీటీ లో లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి. దీనితో అప్పుడపుడు కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ను మిస్ అవుతూ ఉంటారు.. ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ మూవీని కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 25, 2024 | 11:49 AMUpdated Aug 27, 2024 | 5:31 PM
OTT లో  నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఇన్ఫినిటీ’.. క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్.. ఏదైనా ఓ హత్య జరగడం.. దానిని ఎవరు చేసారని పోలీసులు సాల్వ్ చేయడం. మూవీలోని కథ అంతా కూడా ఈ రెండు పాయింట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. పోలీసులు ఆ కేసులను ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు అనే ప్లాట్ మాత్రమే ప్రేక్షకులకు ఆయా సినిమాలు చూడాలా వద్దా అనే ఇంట్రెస్ట్ ను కలిగిస్తూ ఉంటాయి. ఆ విషయంలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ.. అసలు నిరాశ పరచదు. మరి ఈ మూవీ ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా .. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఓ అమ్మాయిని దారుణంగా చంపి.. ఎవరు లేని ప్రదేశానికి వచ్చి.. ఆమె కొన ఊపిరితో ఉండగానే ఆమెను తగలపెట్టేస్తాడు. మరో వైపు ఓ బార్ లో బార్ టైమింగ్ అయినా తరువాత టేబుల్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి టేబుల్ మీద పడి చనిపోయి ఉంటాడు. అదే సమయంలో తులసి రాజన్ , హేమ అనే భార్య భర్తలు పోలిస్ స్టేషన్ కు వచ్చి.. తమ కూతురు కనిపించడం లేదనే కంప్లైంట్ ఇస్తారు. దీనితో ఓ పోలిస్ ఆఫీసర్ సుందర్ ఆ అమ్మాయి డీటెయిల్స్ అడుగుతారు. ఆ తల్లిదండ్రులు విషయాన్నీ చెప్తారు. అప్పటికే ఆమె మిస్ అయ్యి రెండు రోజులు అవుతుంది. ఎందుకు రెండు రోజులు అయినా కంప్లైంట్ చేయలేదని ఇన్స్పెక్టర్ వారిని అరుస్తాడు.

కట్ చేస్తే.. ఆ బార్ లో ఒక కుర్రాడు.. చనిపోయిన వ్యక్తి గురించి కంప్లైంట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ సుందర్ అక్కడికి వెళ్తాడు. ఇతను ఆ హత్య గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి బయల్దేరతాడు. అతను అక్కడికి వెళ్లిన వెంటనే ఎవరో ఒక వ్యక్తి అతనికి కాల్ చేసి.. ఓ న్యూస్ పేపర్ రైటర్ చనిపోయాడని.. అతను హత్య చేయబడ్డాడని చెప్తాడు. దీనితో అతను ఆ రైటర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ మర్డర్ ను ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మరొక ఇన్స్పెక్టర్ సుందర్ కూడా ఆ నెక్స్ట్ డే హత్యకు గురౌతాడు. దీనితో ఓ పోలీస్ ఆఫీసర్ చనిపోవడంతో.. ఈ కేసు సిబిఐ కు ఫార్వార్డ్ చేస్తారు. సుందర్ చనిపోయి రెండు రోజూ అయినా సరే.. కేసు ముందుకు కదలదు. అసలు వారిని హత్యలు చేస్తుంది ఎవరు ? బార్ లో చనిపోయిన వ్యక్తి , రైటర్ , పోలిస్ ఆఫీసర్ వీరందరిని చంపింది ఒకరేనా ? తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ‘ఇన్ఫినిటీ’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.