iDreamPost
android-app
ios-app

OTT లో వణికించే హర్రర్ మూవీ ‘ది ఘోస్ట్ స్టేషన్’.. ఒంటరిగా అసలు చూడొద్దు

  • Published Aug 22, 2024 | 1:35 PM Updated Updated Aug 27, 2024 | 5:38 PM

OTT Best Horror Movie The Ghost Station: హర్రర్ సినిమాలను ఎన్ని విధాలుగా తీసినా కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ మూవీని కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Horror Movie The Ghost Station: హర్రర్ సినిమాలను ఎన్ని విధాలుగా తీసినా కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ మూవీని కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 22, 2024 | 1:35 PMUpdated Aug 27, 2024 | 5:38 PM
OTT లో వణికించే హర్రర్ మూవీ ‘ది ఘోస్ట్ స్టేషన్’.. ఒంటరిగా అసలు చూడొద్దు

ఓటీటీ లో ప్రతి వారం చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు వచ్చే సినిమాలనైతే ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తూనే ఉన్నారు. కానీ ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని సినిమాలను మాత్రం మిస్ చేస్తూ ఉంటారు. వారి కోసమే ఈ మూవీ సజెషన్ ఇక వీటిలో హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలను తీసినా కూడా.. అసలు మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక అతను లాస్ట్ ట్రైన్ కోసం స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అతనికి కొంచెం దూరంలోనే ఆ అమ్మాయి తాగినట్టు తూగుతూ ఉంటుంది. తన గురించి మెసేజెస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్తూ ఉంటాడు. ఈలోపే ఆ అమ్మాయి మాయమైపోతుంది. ఆమె కోసం వెతికే ప్రాసెస్ లో తనకు తెలీకుండానే సడెన్ గా చనిపోతాడు. నెక్ట్ సీన్ లో ఒక జర్నలిస్ట్ మీద ఒక లాయర్ కేసు వేసినట్లు చూపిస్తారు. అతనికి కంపెన్షన్ వేస్తారు. ఆమె పని చేసే ఛానెల్ వాళ్ళు చేతులు ఎత్తేయడంతో.. ఆమె ఫ్రెండ్స్ తో ఈ విషయాన్నీ చెప్తుంది. అలాగే ఓ మంచి న్యూస్ కూడా తనకు కావాలని అడుగుతుంది. దీనితో తన ఫ్రెండ్ తానూ సీసీ టీవీ లో ఎవరు ఒక అతను ట్రాక్ మీద నడవడం చూశానని.. కానీ తనతో పాటు ఒక బాబు కూడా ఉన్నాడని..వారిద్దరిని కాపాడడం అనుకునే లోపే.. ట్రైన్ డాష్ ఇవ్వడంతో వారిద్దరూ చనిపోయారని చెప్తాడు. తనతో పాటు ఒక బాబు కూడా దీనిని చూశాడని చెప్తాడు. దీనితో తనకు దానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కూడా కావాలని అడుగుతుంది.

కట్ చేస్తే.. ఆ ఇన్సిడెంట్ ను లైవ్ లో చూసినా అతనికి మాత్రం అప్పటినుంచి ఏవో వింత సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. అలాగే తన ఫ్రెండ్ కోసం సీక్రెట్ గా సీసీ టీవీ ఫుటేజ్ ను కాపీ చేసుకుంటాడు. తాను అక్కడ నుంచి బయటకు రాగానే ట్రైన్ డ్రైవర్ ఒకే నెంబర్ ను గట్టిగా అరుస్తూ కనిపిస్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఆ ఫుటేజ్ కోసం అక్కడికి వెళ్తుంది. డ్రైవర్ పదే పదే అరుస్తూ కనిపిస్తాడు. ఎందుకలా అరుస్తున్నావ్ అని అడిగితే.. అద్దంలో దెయ్యాన్ని చూపిస్తూ అందుకే అని చెప్తాడు..కానీ కారణం చెప్పడు. అతని ముఖంపై కూడా నెయిల్ మార్క్స్ ఉంటాయి. దీనితో ఆమె ఇవన్నీ రికార్డ్ చేసుకుని.. తన ఛానెల్ లో టెలికాస్ట్ చేస్తుంది. కానీ ఈలోపే ఆ స్టేషన్ డ్రైవర్ చనిపోతాడని తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఎందుకు ఆ స్టేషన్ లో వాళ్ళు చనిపోతారు? స్టార్టింగ్ సీన్ లో కనిపించి మాయమైపోయిన అమ్మాయి ఎవరు ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ‘ది ఘోస్ట్ స్టేషన్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉన్నా కూడా ఇక్కడ అందుబాటులో లేదు. కానీ యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet