Swetha
OTT Best Documentary Series : వెబ్ సిరీస్ లను ప్రతి ఒక్కరు అందరూ ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకుని రూపొందించిన వెబ్ సిరీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ కూడా అలాంటిదే. మరి ఈ సిరీస్ ను చూశారా లేదో ఓ సారి చెక్ చేయండి.
OTT Best Documentary Series : వెబ్ సిరీస్ లను ప్రతి ఒక్కరు అందరూ ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకుని రూపొందించిన వెబ్ సిరీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ కూడా అలాంటిదే. మరి ఈ సిరీస్ ను చూశారా లేదో ఓ సారి చెక్ చేయండి.
Swetha
కొన్ని సిరీస్ లను , సినిమాలను నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తారు. ఇప్పటికే ఇలాంటి సినిమాలు , సిరీస్ లు చాలానే వచ్చాయి. వచ్చిన ప్రతి కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఏం జరిగింది అనే తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా ఇలాంటిదే. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను 2018 లో ఢిల్లీలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తీశారు. డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ , ఇరుగు పొరుగు వారు చెప్పిన వార్తలు, పోలీసుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అసలు 2018 లో ఢిల్లీ లోని బురారీ ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. బురారీ ప్రాంతంలోని భాటియా అనే కుటుంబం ప్రతి రోజు షాప్ తెరిసే .. యధావిధిగా పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ 2018 జూలై 1 న మాత్రం షాప్ తీయరు. ఏమైందా అని ఇరుగు పొరుగు వారు భాటియా ఇంటికి వెళ్లి చూస్తే .. అక్కడ వారు చున్నీలకు వేలాడుతూ కనిపిస్తారు. వెంటనే ఈ విషయాన్నీ వెంటనే పోలీసులకు చెప్తారు. ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉంటారు. అందులో 10 మంది చున్నీలతో ఉరి వేసుకుని చేతులకు , కళ్ళకు , కాళ్లకు కట్లు కట్టుకుని ఉంటారు. ఆ కుటుంబ పెద్ద మాత్రం నేల మీద పడి ఉంటుంది. దీనితో ఎవరికీ ఏమి అర్ధం కాదు.
పోలీసులు , చుట్టూ పక్కల ప్రజలు , మీడియా .. ఇలా లోకమంతా ఈ కుటుంబం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. భాటియా కుటుంబం అంతా చాలా హ్యాపీ ఫ్యామిలీ అని.. వారికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి అక్కడికి ఫారిన్సీక్ వాళ్ళు వస్తారు. అది మర్డర్ ఆ లేక సూసైడ్ అనేది అర్థంకాక. పోలీసులు సూసైడ్ అని తేల్చేస్తారు. కానీ చుట్టూ పక్కల వాళ్ళు మాత్రం అది సూసైడ్ కాదని.. దాని గురించి విచారించాలని పట్టుబడతారు. దీనితో పోలీసులు ఆ డెడ్ బాడీస్ ను పోస్టుమార్టంకు తీసుకుని వెళ్తారు. అసలు అక్కడ ఏం జరిగింది ? వారిని ఎవరైనా చంపారా లేదా సూసైడ్ చేసుకున్నారా ? అసలు ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకేసారి చనిపోవాల్సిన అవసరం ఏం ఉంది ?
పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు ? ఈ కేసును సాల్వ్ చేస్తున్న క్రమంలో పోలీసులకు ఎదురైన సమస్యలు ఏంటి ? చివరికి ఏమైంది ? చూడాల్సిందే.. పైగా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులుల్ కేసును సాల్వ్ చేస్తున్న కొద్దీ .. ప్రతిదీ 11 అనే నెంబర్ కు లింక్ అయ్యి ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. “హౌస్ ఆఫ్ సీక్రెట్స్ : ది బురారీ డెత్స్” అనే ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. ఆ అక్కాచెల్లెళ్లు చెప్పే కథలకు మైండ్ పోతుంది.. OTT లో బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్