iDreamPost
android-app
ios-app

ఆ అక్కాచెల్లెళ్లు చెప్పే కథలకు మైండ్ పోతుంది.. OTT లో బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Jul 23, 2024 | 1:40 AM Updated Updated Jul 23, 2024 | 1:40 AM

OTT Best Horror Suspense Thriller : సస్పెన్స్ థ్రిల్లర్స్ లో చాలా రకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అయితే సైకలాజికల్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Suspense Thriller : సస్పెన్స్ థ్రిల్లర్స్ లో చాలా రకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అయితే సైకలాజికల్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 23, 2024 | 1:40 AMUpdated Jul 23, 2024 | 1:40 AM
ఆ అక్కాచెల్లెళ్లు చెప్పే కథలకు మైండ్ పోతుంది.. OTT లో బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

హర్రర్ మూవీస్, మర్డర్ మిస్టరీస్ తర్వాత ప్రేక్షకులు చూసే ఇంట్రెస్టింగ్ జోనర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ . వీటిలో కూడా రకరకాలా ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి. వాటిలో ఓ మంచి సైకలాజికల్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ.. బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. ఈ మూవీ అంతా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందించారు మేకర్స్. చివరిలో రివీల్ అయ్యే ట్విస్ట్ చూస్తే.. ఈ మూవీ వారం రోజులు మైండ్ లో నుంచి పోదు. అసలు ఈ మూవీ ఏంటి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అతను కాస్త మిస్ బెహేవ్ చేస్తూ ఉండడంతో ఆమె ఈ విషయాన్నీ తన అక్కకు చెప్పి.. అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు దారిలో మూడు సంచులు కనిపిస్తాయి. వాటిలో డెడ్ బాడీస్ ఉంటాయి. ఇక మరో వైపు హీరోయిన్ వాళ్ళ అమ్మను చూపిస్తూ ఉంటారు. ఆమె అనారోగ్యం కారణంగా .. బెడ్ కే అంకితం అవుతుంది. ఆమె చేతికి ఓ గంట కూడా కట్టి ఉంటుంది. ఆ తర్వాత.. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ డోర్ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఈ షాక్ లో ఉండగా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటున్న ఇల్లు పేలిపోతుంది. దీనితో ఆమె చనిపోవడంతో.. హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆమెకు అప్పటినుంచి పది సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇస్తారు. పదేళ్ల తర్వాత మళ్ళీ ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన అక్కను పిలిస్తుంది కానీ ఆమె పలకదు. అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న మరొక పెళ్ళి చేసుకుంటాడు.

ఇక కొద్దిసేపటికి హీరోయిన్ , తన అక్క కలుసుకుని.. వాళ్ళ నాన్న ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నాడని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొద్దీ రోజుల తర్వాత ఆ సవితి తల్లే వాళ్ళ అమ్మను చంపేసిందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తారు.. అక్కాచెల్లెళ్లు. ఎందుకంటే వాళ్ళ అమ్మకు బాలేనప్పుడు ఈమె ఆమెకు కేర్ టేకర్ గా ఉండేది. అయితే ఇక్కడ హీరో ఎంటర్ అవుతాడు. అతను ఒక డెలివరీ బాయ్. వీరిద్దరి సంగతి తెలిసిన సవతి తల్లి.. అతనిని తన ఇంటికి రావొద్దని చెప్తుంది. ఆ నెక్ట్ డే హీరో హీరోయిన్ కలుద్దాం అనుకునే లోపు హీరో చనిపోతాడు. అతనిని కూడా సవతి తల్లే చంపేసిందని అనుకుంటారు. కానీ ఈ విషయాన్నీ ఎవరికీ చెప్పినా కూడా నమ్మరు. పైగా హీరోయిన్ ను వాళ్ళ నాన్న అసహ్యించుకుంటాడు. అసలు ఎక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మను చంపింది తన సవతి తల్లేనా ? ఆ తర్వాత ఏం జరిగింది? హీరో ను చంపింది ఎవరు ? ఆమె సవతి తల్లికి ఏదైనా గతం ఉందా ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “ది అన్ ఇన్వైటెడ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. కిల్లర్ తో క్రిమినల్ లాయర్ ప్రేమ.. OTTలో అదిరిపోయే థ్రిల్లర్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ