Swetha
OTT Feel Good Web Series: ప్రస్తుతం అందరు వెబ్ సిరీస్ లను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం ఎదో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంది. మరి ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ ఫీల్ గుడ్ సిరీస్ ను కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.
OTT Feel Good Web Series: ప్రస్తుతం అందరు వెబ్ సిరీస్ లను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం ఎదో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంది. మరి ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ ఫీల్ గుడ్ సిరీస్ ను కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.
Swetha
వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక సినిమా మొత్తంలో ఎన్ని ట్విస్ట్స్ ఉంటాయో.. అవన్నీ కూడా ఒకే ఎపిసోడ్ లో చూపిస్తూ ఉంటారు. దీనితో వెబ్ సిరీస్ లను చూసేందుకు.. మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా ప్రేక్షకుల ముందుకు కొత్త కథలను తీసుకుని వస్తున్నారు. ఇక గత కొన్ని వారాలుగా ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. ఇంకా కొన్ని రిలీజ్ కు రెడీగా కూడా ఉన్నాయి. మరి ఇవి కాకుండా ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ను మీరు కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే… ఈ సిరీస్ కథ అంతా కూడా డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డాక్టరు అవ్వడం వెనుక ఎంత కష్టం ఉంటుందో కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది. ఓ మంచి సక్సెస్ ఫుల్ డాక్టర్ అవ్వాలంటే వారు ఎన్నో ట్రైనింగ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది . ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొందరు ట్రైనీ డాక్టర్స్ చుట్టూనే ఈ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. ఆ ట్రైనీ డాక్టర్స్ రియల్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటారు అనేది ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే ఆ ట్రైనీ డాక్టర్స్ అంతా కూడా ఒకే రోజు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. మొదటి రోజు కాబట్టి ఆరోజంతా కూడా వారికి కాస్త కంఫ్యూజింగ్ గా నడుస్తూ ఉంటుంది. అయితే ఆ హాస్పిటల్ లో ఏవో కొన్ని జరగకూడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ తెర వెనుక జరుగుతున్న కథ ఏంటి ? ఈ డాక్టర్స్ దానిని ఎలా సాల్వ్ చేస్తారు? అక్కడ జరిగే అన్యాయాలను ఎదుర్కొన్నారా లేదా అనేది తెరపైన చూడాల్సిన కథ.
ఈ సిరీస్ పేరు .. “హార్ట్ బీట్”. ఈ సిరీస్ లో మొదటి నాలుగు ఎపిసోడ్స్ మంచి ఫీల్ ను ఇస్తాయి. కాగా ఈ సిరీస్ లో అనుమోలు, యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, గిరి ద్వారకేష్, జయరావు, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఇది గ్రేస్ అనాటమీ అనాటమీ అనే ఓ మెడికల్ డ్రామా లోని ఓ సీజన్. 2005 లో ఈ సిరీస్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 19 సీజన్స్ పూర్తి చేసుకుని.. ఇంకా కొనసాగడం విశేషం. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఓ మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ సిరీస్ ను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం.. వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.