iDreamPost
android-app
ios-app

చనిపోయిన కూతురు వేరే ఇంట్లో పుడితే! OTT లో ఫీల్ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Jul 24, 2024 | 11:00 PM Updated Updated Jul 24, 2024 | 11:00 PM

OTT Suspense Thriller : అసలు పునర్జన్మలు ఉన్నాయా.. ఈ సందేహం చాలా మందికి ఎప్పుడో ఓసారి వచ్చి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ మీదే ఓ సినిమా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Suspense Thriller : అసలు పునర్జన్మలు ఉన్నాయా.. ఈ సందేహం చాలా మందికి ఎప్పుడో ఓసారి వచ్చి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ మీదే ఓ సినిమా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

  • Published Jul 24, 2024 | 11:00 PMUpdated Jul 24, 2024 | 11:00 PM
చనిపోయిన కూతురు వేరే ఇంట్లో పుడితే! OTT లో ఫీల్ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్

ఈ మధ్య ఎక్కువ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉండే సినిమాలు , క్షణం క్షణం సస్పెన్స్ కు థ్రిల్ చేసే కథలు ఇలాంటి కాన్సెప్ట్ లోనే సినిమాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసి.. మరి ఎక్కువ లాగ్ లేకుండా చిన్న చిన్న సస్పెన్స్ , ట్విస్ట్ లతో ఉండే సినిమాల కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఓ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. అయితే అసలు పునర్జన్మలు ఉన్నాయా.. ఈ సందేహం చాలా మందికి ఎప్పుడో ఓసారి వచ్చి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ మీదే ఓ సినిమా ఉంది సినిమా చూస్తున్నంతసేపు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు అది పునర్జన్మ అయ్యి ఉంటుందా పొరపాటు అయి ఉంటుందా.. అసలు ఈ మూవీ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ ఓ చిన్న జాబ్ చేసుకుంటూ.. తన కొడుకును పెంచుకుంటూ ప్రశాంతంగా బ్రతికేస్తూ ఉంటుంది. అయితే ఏడు సంవత్సరాల క్రితం ఓ ఫైర్ యాక్సిడెంట్ లో ఆమె కూతురు చనిపోతుంది . దీనితో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యి.. వారిద్దరికీ విడాకులు అవుతాయి. దీనితో హీరోయిన్ బాబును తీసుకుని వచ్చేస్తుంది. అప్పటినుంచి తన కూతురు జ్ఞాపకాలలో నుంచి బయటకు రాడానికి ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఆమె వలన కాదు. అయితే ఈ క్రమంలో ఓ రోజు తన కొడుకు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్ డే పార్టీ ఉందని చెప్పి.. ఆమెను కూడా తీసుకుని వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అచ్చం తన కూతురు లాంటి మరొక అమ్మాయి కనిపిస్తుంది.

కట్ చేస్తే.. హీరోయిన్ ఆ పాప గురించి ఆరా తీస్తూ ఉంటుంది. ఓ రోజు ఆ పాప వాళ్ళ అమ్మతో కూడా మాటలు కలపడానికి ట్రై చేస్తూ.. ఆ పాపా ను చూస్తూ ఉంటుంది. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఆ హీరోయిన్ వాళ్ళ పాపా చనిపోయినప్పుడే.. ఈ పాపా కూడా పుడుతుందని ఆమెకు అర్ధమౌతుంది. మెల్లగా ఆ ఫ్యామిలీతో మెర్జ్ అయ్యి.. ఆ పాపకు దగ్గరవుతుంది. ఈ క్రమంలో ఓ రోజు తన కొడుకు తనని సరిగ్గా పట్టించుకోవడంలేదని.. ఆమెను తిడతాడు. దీనితో ఆమె కాస్త బాధపడుతుంది. అయితే ఓ రోజు ఆ రెండు ఫ్యామిలీస్ బయటకు వెళ్ళినప్పుడు హీరోయిన్ వలన ఆ పాపకు దెబ్బ తగుల్తుంది. ఆ పాప పేరు లోల. అయితే లోల పైన హీరోయిన్ చూపిస్తున్న కేర్ చూసి లోల వాళ్ళ అమ్మకు డౌట్ మొదలవుతుంది. అసలు ఆ పాప ఎవరు ? ఆ తర్వాత ఏం జరిగింది ? నిజంగా ఆ పాప మళ్ళీ పుట్టిందా లేదా చనిపోయిందనే భ్రమలో హీరోయిన్ ఉందా ? చివరికి కథ ఎలా ముగిసింది. ఇవన్నీ తెలియాలంటే “ఏంజెల్ ఆఫ్ మైన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss