OTT Suggestion : గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ చూడండి.. OTT బెస్ట్ సర్వైవల్ డ్రామా!

OTT Best Survival Drama : భయం అందరికి ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం , కొందరికి ఒంటరిగా ఉండడం అంటే భయం. మరికొంతమందికి హైట్స్ అంటే భయం. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Survival Drama : భయం అందరికి ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం , కొందరికి ఒంటరిగా ఉండడం అంటే భయం. మరికొంతమందికి హైట్స్ అంటే భయం. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

థ్రిల్లర్ మూవీస్ అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుంది. అసలు అక్కడ పరిస్థితులకు కారణం ఏంటి ఇలా అన్ని ప్రశ్నలతో కూడిన మూవీస్.. చివరి వరకు ప్రేక్షకులను కదలనివ్వకుండా.. మూవీ చూసేలా చేస్తాయి. ఇక థ్రిల్లర్ మూవీస్ ప్లాట్ లో చాలానే వచ్చాయి. వచ్చిన ప్రతి మూవీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంది. దెయ్యాలంటే భయం ఉన్నా కూడా హర్రర్ మూవీస్ ను మాత్రం చూస్తూనే ఉంటారు. అయితే భయం అందరికి ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం , కొందరికి ఒంటరిగా ఉండడం అంటే భయం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం ఉంటుంది. ఈ క్రమంలో కొందరికి హైట్స్ అంటే విపరీతమైన భయం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో షిల్లో హంటర్, బెక్కి , డ్యాన్ కానర్ ఈ ముగ్గురు కలిసి ఓ పెద్ద పర్వతాన్ని అధిరోహిస్తూ కనిపిస్తారు. వీరు ప్రొఫెషనల్ మౌంటెన్ క్లైంబర్స్ . అయితే అప్పటికి బెక్కి, డ్యాన్ కానర్ కు పెళ్లి అయిపోయి ఉంటుంది. అదే సమయంలో డ్యాన్ ఓ ఎత్తైన పర్వతం నుంచి బ్యాలెన్స్ తప్పి కిందపడి చనిపోతాడు. దీనితో బెక్కి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. మౌంటెన్ క్లైంబింగ్‌కు కూడా దూరంగా ఉంటుంది. తన తల్లిదండ్రులకు కూడా దూరంగానే బ్రతుకుతూ.. ఒంటరిగా ఉంటూ ఉంటుంది. సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ తన ఫ్రెండ్ హంటర్ ఎలా అయినా ఆమెను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటాడు. అందుకోసం మళ్ళీ ఆమెను మౌంటెన్ క్లైంబింగ్‌కు తీసుకుని వెళ్తాడు.

అతను బెక్కిని 2000 అడుగుల ఎత్తు ఉన్న టవర్ ను ఎక్కడానికి తీసుకుని వెళ్తాడు. ఆమె మౌంటెన్ క్లైంబింగ్‌ చేసి దాదాపు సంవత్సరం కావడంతో కాస్త భయపడుతుంది. అయితే హంటర్ ఎలాగూ దైర్యం చెప్పి ఆమెను క్లైంబింగ్‌ చేసేలా చేస్తాడు. వారిద్దరూ ఆ టవర్ ను ఎక్కడం స్టార్ట్ చేస్తారు. సగం వరకు అంతా బాగానే సాగుతుంది. ఇక దిగి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి.. ఆ టవర్ కు ఉన్న నిచ్చెన ఊడి కింద పడి పోతుంది. అక్కడ వారికి సహాయం చేసేవారు కూడా ఎవరు ఉండరు. ఎవరికైనా ఫోన్ చేయడానికి కూడా అక్కడ సిగ్నల్స్ ఉండవు. అసలు వారిద్దరూ అక్కడినుంచి ఎలా బయటపడ్డారు ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “ఫాల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ లో ఈ సినిమా కూడా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా చూసేయచ్చు . ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments