ఫహద్ ఫాజిల్ కెరీర్ లోనే బెస్ట్ థ్రిల్లర్.. 'సీ యూ సూన్' మూవీ OTTలో ఉంది చూశారా?

ఫహద్ ఫాజిల్ కెరీర్ లోనే బెస్ట్ థ్రిల్లర్.. ‘సీ యూ సూన్’ మూవీ OTTలో ఉంది చూశారా?

OTT Suggestions- Fahad Fazil C U Soon Movie: ఫహద్ ఫాజిల్ కెరీర్లో ఎన్నో అద్భతమైన సినిమాలు చేశాడు. అయితే ఆయన నిర్మించి, నటించిన ఈ చిత్రం మాత్రం కచ్చితంగా స్పెషల్ అనే చెప్పాలి. ఈ సినిమాకి ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బిరుదును కూడా ప్రేక్షకులు ఇచ్చారు.

OTT Suggestions- Fahad Fazil C U Soon Movie: ఫహద్ ఫాజిల్ కెరీర్లో ఎన్నో అద్భతమైన సినిమాలు చేశాడు. అయితే ఆయన నిర్మించి, నటించిన ఈ చిత్రం మాత్రం కచ్చితంగా స్పెషల్ అనే చెప్పాలి. ఈ సినిమాకి ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బిరుదును కూడా ప్రేక్షకులు ఇచ్చారు.

ఫహద్ ఫాజిల్.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న విలక్షణ నటుల్లో ఈయన పేరు కచ్చితంగా ఉంటుంది. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో భన్వర్ లాల్ షెకావత్ గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఫహద్ తన కెరీర్లో చాలానే సినిమాలు చేశాడు. అయితే ఈ థ్రిల్లర్ మాత్రం అతని కెరీర్ లో బాగా గుర్తుపెట్టుకనే మూవీగా మారిపోయింది. ఇలాంటి పాత్రలు చాలానే చేసినా.. ఈ మూవీకి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎన్నో క్రేజీ సినిమాలు, థ్రిల్లర్స్ వచ్చాయి. టాప్ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ మూవీస్ లిస్ట్ తీస్తే.. ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది. ఇందులో క్రేజీ స్టోరీ లైన్ కూడా ఉంది. ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంది. అదేంటంటే.. ఇప్పుడు అన్నీ ఆన్ లైన్ పరిచయాలు, వీడియో కాల్ ప్రేమలు అయిపోయాయి. నేరుగా కలవకపోయినా కూడా ప్రేమించేసుకుంటున్నారు. అలాంటి ఒక పాయింట్ తోనే ఈ మూవీని తెరకెక్కించారు. సినిమా మొత్తం స్క్రీన్ టైమ్, వీడియో కాల్స్ లోనే ఉంటుంది. ఈ మూవీకి ఫహద్ ఫాజిల్ నిర్మాత కూడా. ఇది అద్భుతమైన నరేషన్ కలిగిన మూవీనే కాకుండా.. ఇప్పుడున్న యువతకు మంచి సందేశం కూడా అవుతుంది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. హీరో జిమ్మీ(రోషన్ మ్యాథ్యూ) కూడా అలాంటి ఒక రిలేషన్ లోకి వెళ్తాడు. డేటింగ్ యాప్ లో అను(దర్శన రాజేంద్రన్) అనే యువతితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరు ప్రేమలో పడతారు. కేవలం వీడియో కాల్స్ లో మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. జిమ్మీ తనని తన తల్లికి కూడా పరిచయం చేస్తాడు. అయితే ఆమె పేరు, ముఖం తప్పితే ఎవరికీ ఏం తెలియదు. తన గురించి ఇంకా తెలుసుకోవాలి అని జిమ్మీ తల్లి.. జిమ్మీకి కజిన్ అయిన కెవిన్(ఫహద్ ఫాజిల్)ను సంప్రదిస్తుంది. కెవిన్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ గా చేస్తుంటాడు.

అను కొన్నిరోజుల తర్వాత జిమ్మీకి కాల్ చేసి తన తండ్రి తనని కొట్టాడని చెప్తుంది. జిమ్మీ తనని తన ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్లు అక్కడే ఉంటారు. యూఏఈలో లివిన్ రిలేషన్ నేరం. తర్వాత తండ్రికి ఆమెను అప్పగించాలి అనుకుంటారు. కానీ, అను తాను చనిపోతున్నాను అని వీడియో మెసేజ్ పంపి.. అదృశ్యమవుతుంది. అక్కడి నుంచి కథ వేరే మలుపు తిరుగుతుంది. ఈ మొత్తం అసలు ఎలా జరిగింది? ఈ కేసు నుంచి జిమ్మీ ఎలా తప్పించుకున్నాడు? అసలు అనుకి ఏమైంది? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ‘సీ యూ సూన్’ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments