OTT Suggestions- Best Murder Mystery Thriller : OTTలో 'దషోమ్ అబొతార్'లాంటి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మరోటి లేదు!

OTTలో ‘దషోమ్ అబొతార్’లాంటి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మరోటి లేదు!

OTT Murder Mystery Thriller : ఇప్పటివరకు ఎన్నో సీరియల్ కిల్లర్ సినిమాలను , మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను చూసి ఉంటారు. ఇలా పురాణాల ప్రకారం మర్డర్స్ ను చూస్తున్న కిల్లర్ కథను మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Murder Mystery Thriller : ఇప్పటివరకు ఎన్నో సీరియల్ కిల్లర్ సినిమాలను , మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను చూసి ఉంటారు. ఇలా పురాణాల ప్రకారం మర్డర్స్ ను చూస్తున్న కిల్లర్ కథను మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ , మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలలో… ఫోకస్ అంతా కూడా పోలీసులు ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక సీరియల్ కిల్లర్ సైకో అయితే ఒకలా మర్డర్స్ జరుగుతాయి లేదంటే పాత పగల వలన మర్డర్స్ జరుగుతూ ఉంటాయి . అవి కూడా ఒక్కో మూవీలో ఒక్కోలా ఉంటూ ఉంటాయి. ఇలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చూసి ఉంటారు కానీ.. పురాణాల ప్రకారం మర్డర్స్ చేసే సీరియల్ కిల్లర్ కథను మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్టార్టింగ్ లో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఓ పెద్ద బంగాళా గోడ దూకి దానిలోకి వెళ్తాడు. సరిగా అదే సమయంలో ఆ బంగళాలో ఉండే వ్యక్తి బాత్ టబ్ లో ఉంటాడు. ఈ గుర్తుతెలియని వ్యక్తి అతని దగ్గరకు వెళ్లి గన్ చూపించి బెదిరించి.. ఆ బాత్ టబ్ లో కొన్ని డేంజరస్ చేపలను వదులుతాడు. ఆ చేపలు అతనిని ఘోరంగా చంపేస్తాయి. ఆ తరువాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో వైపు ఎంకౌంటర్ స్పెషలిస్ట్ ప్రొబిర్ ఒక రౌడీని తరుముతూ ఉంటాడు. అయితే అప్పటివరకు ఎవరికీ దొరకని ఆ రౌడీ తానూ పోలీసులకు లొంగిపోయి.. అరెస్ట్ చేయమని చెప్తాడు. దీనితో పోలీసులంతా ఆలోచనలో పడతారు. ఆ తర్వాత అక్కడ బోధార్ అనే మరో పోలీస్ ఆఫీసర్ ను చూపిస్తారు. అతను ఒక బార్ కు వెళ్లి అక్కడ ఒక రౌడీ కోసం వెతుకుతూ ఉంటాడు. అదే బార్ లో ప్రొబీర్ కూడా ఉంటాడు . ఇక్కడ వీరిద్దరికి పరిచయం అవుతుంది.

కట్ చేస్తే ప్రొబీర్ మూవీ స్టార్టింగ్ లో జరిగిన మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో చనిపోయిన వ్యక్తి మంచి వాడు కాదని తెలుస్తుంది. అక్కడ కిల్లర్ ఏదైనా క్లూ ఉందేమో అని సెర్చ్ చేస్తాడు. అక్కడ కిల్లర్ బ్రేస్ లెట్ దొరుకుతుంది. అలాగే ఆ కిల్లర్ ఏ రకమైన చేపలతో చంపాడో తెలుసుకుంటాడు. మరో వైపు బోధర్ ఫ్రీ టైమ్ లో ట్యూషన్స్ చెప్తూ ఉంటాడు. మరో వైపు సీరియల్ కిల్లర్ తన రెండో మర్డర్ చేయడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. అదే సమయంలో ఓ వ్యక్తి మసాజ్ సెంటర్ కు వెళ్తాడు. అక్కడే ఉన్న సీరియల్ కిల్లర్ తానూ కొత్త టెక్నీక్ తో మసాజ్ చేస్తానని అని చెప్పి ఓ తాబేలు బొమ్మతో అతన్ని చంపేస్తాడు. అక్కడ కూడా ఒక బ్రేస్ లెట్ పెట్టి వదిలేస్తాడు. దీనితో ప్రొబీర్, బోధర్ ఈ కేసును టెక్ అప్ చేస్తాడు. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు ? విక్టిమ్స్ ను కిల్లర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు ? మర్డర్ చేసి ఎందుకు అక్కడ క్లూ వదిలేస్తున్నాడు ? ఎందుకు మూగజీవాలతో మనుషులను చంపేస్తున్నాడు? పురాణాల ఆధారంగా ఈ మర్డర్స్ చేస్తున్నాడా ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “దషోమ్ అబొతార్”. అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం “హొయ్ చోయ్” అనే ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments