iDreamPost
android-app
ios-app

పెళ్ళికి ఒప్పుకోలేదని బావపై చేతబడి.. OTT లో భయంకరమైన హర్రర్ సస్పెస్ డ్రామా

  • Published Aug 07, 2024 | 4:10 PM Updated Updated Aug 07, 2024 | 4:25 PM

OTT Horror Suspense Thriller: చూసే తీరిక ఉండాలే కానీ ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమాలు ఉన్నాయి.. అయితే హర్రర్ సినిమాలలో కేవలం దెయ్యంతో భయపెట్టేవి ఓ టైప్ అయితే.. క్షుద్రపూజలు , చేతబడులు చేస్తూ భయపెట్టే సినిమాలు మరొక టైప్.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Horror Suspense Thriller: చూసే తీరిక ఉండాలే కానీ ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమాలు ఉన్నాయి.. అయితే హర్రర్ సినిమాలలో కేవలం దెయ్యంతో భయపెట్టేవి ఓ టైప్ అయితే.. క్షుద్రపూజలు , చేతబడులు చేస్తూ భయపెట్టే సినిమాలు మరొక టైప్.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Aug 07, 2024 | 4:10 PMUpdated Aug 07, 2024 | 4:25 PM
పెళ్ళికి ఒప్పుకోలేదని బావపై చేతబడి.. OTT లో భయంకరమైన హర్రర్ సస్పెస్ డ్రామా

హర్రర్ మూవీ లవర్స్ చాలా మంది ఉంటారు. ఎంత భయపడుతున్న సరే ఆయా సినిమాలను చూస్తూనే ఉంటారు. ఉన్న సినిమాలన్నిటిని చూసేశాం అనుకునే సమయానికి ఎదో ఒక కొత్త హర్రర్ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. చూసే తీరిక ఉండాలే కానీ ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమాలు ఉన్నాయి.. అయితే హర్రర్ సినిమాలలో కేవలం దెయ్యంతో భయపెట్టేవి ఓ టైప్ అయితే.. క్షుద్రపూజలు , చేతబడులు చేస్తూ భయపెట్టే సినిమాలు మరొక టైప్. ఈ కాన్సెప్ట్ సినిమాలు ఇంకాస్త ఎక్కువ కిక్ ఇస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే . మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే ఓ మంత్రగాడు ఏవేవో మంత్రాలూ చదువుతూ పూజలు చేస్తూ ఉంటాడు. దాని కోసం చుట్టూ మనుషుల బాడీ పార్ట్స్, జంతువుల బాడీ పార్ట్శ్ కూడా ఉంటాయి. ఈ మంత్రగాడు ఆ బాడీ పార్ట్స్ అన్ని కలిపేసి..దానితో ఓ కొత్త బాడీ తయారు చేసి.. దానితో క్షుద్ర పూజలు చేస్తూ.. చేతబడి చేసిన మనిషి బాడీలోకి ఈ ఆత్మలను పంపుతూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ ఓ అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు యమ్మ.. ఆమె తన బావ ను పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయింది. కానీ ఇంట్లో మాత్రం వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకోకుండా.. వాళ్ళ బావకు వేరే పెళ్లిని చేస్తారు. దీనితో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి.. తనతోనే ఈ పెళ్లి జరగాలని.. తన చెల్లిని తీసుకుని చేతబడి చేసే వ్యక్తి దగ్గరకు వస్తుంది.

ఆ మంత్రగాడు ఇలాంటి పనులకు చేతబడి అవ్వదు. దాని వలన మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు. అయినా సరే ఆమె మొండిగా అక్కడే కూర్చుని ఉంటుందని. సడెన్ గా వాళ్ళ చెల్లి బాడీలో ఇదో ఆత్మ ప్రవేశించి ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తుంది. దీనితో ఆమె అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే స్టోరీని 12 ఏళ్ళ తర్వాత చూపిస్తారు. వాళ్ళ బావకు పెళ్లి అయిపోయి.. ఓ పాప కూడా ఉంటుంది. ఆ పాప బర్త్ డే సందర్బంగా మళ్ళీ వీరిద్దరూ కలుస్తారు. అయితే అతనికి పెళ్ళైన కూడా సైలెంట్ గా యమ్మ ను కలుస్తూనే ఉంటాడు. దీనితో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ వాళ్ళ బావ నీకు నాకు సంబంధం లేదు అని చెప్తాడు. ఇక యమ్మ కు ఏం చేయాలో అర్ధం కాక.. మళ్ళీ అతనిపై చేతబడి చేయాలని అనుకుంటుంది. యమ్మ తన బావ కోసం ఏం చేసింది ? మళ్ళీ ఆ చేతబడి చేసే అతని దగ్గరకు వెళ్లిందా ? చివరికి కథ ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. ఈ సినిమా పేరు “సిజ్జిన్” ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉన్నా కానీ ఇక్కడ మాత్రం అందుబాటులో లేదు. అయితే యూట్యూబ్ లో దీనిని చూడొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş