OTT Suggestions-Best Suspense Thriller: పోలీసే సీరియల్ కిల్లర్ అయితే? OTTలో సూపర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

పోలీసే సీరియల్ కిల్లర్ అయితే? OTTలో సూపర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Best Suspense Thriller : ఒక హత్యను ఎలా చేశారు. ఎవరు చేశారు.. అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా.. పోలీసులు ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ విషయంలో ఈ మూవీ చూస్తే కచ్చితంగా మూవీ లవర్స్ శాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది.

OTT Best Suspense Thriller : ఒక హత్యను ఎలా చేశారు. ఎవరు చేశారు.. అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా.. పోలీసులు ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ విషయంలో ఈ మూవీ చూస్తే కచ్చితంగా మూవీ లవర్స్ శాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది.

మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు దాదాపు ఇప్పుడు మూవీ లవర్స్ అంతా అలవాటు పడి ఉన్నారు. ఇక చూసే వారి ఫోకస్ అంతా కూడా పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ ను ఎలా సాల్వ్ చేశారు. సీరియల్ కిల్లర్ మనుషులను ఏ విధంగా చంపుతున్నాడు అనే దానిపైనే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో.. పై రెండు పాయింట్స్ కూడా మూవీ లవర్స్ కు కచ్చితంగా శాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మీరు చూసారా లేదా ఓసారి చెక్ చేసేయండి .

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో ఓ రౌడీని చూపిస్తారు. అతని దగ్గరే పని చేస్తూ అతనికే ద్రోహం చేయడం వలన ఒక అతనిని బాగా కొడుతూ ఉంటాడు. ఇక ఇంకొక సీన్ లో పానీపూరి అమ్మే అతను తన కొడుకుని తీసుకుని ఓ హాస్పిటల్ కు వెళ్తాడు. అతని కొడుకుకు చాలా పెద్ద జబ్బు ఉంటుంది. కానీ ఇతని దగ్గర మాత్రం అంత డబ్బు ఉండదు. దాని కోసం వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే మరొక సీన్ లో నైట్ టైమ్ ఓ పోలిస్ కార్ రౌండ్స్ వేస్తూ ఉంటుంది. దానిలో ఓ ఎస్సై ఉంటాడు. సడెన్ గా వాళ్ళ కార్ ముందుకు వచ్చి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె అక్కడే ఉండే ఓ ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ ఓ మర్డర్ జరిగి ఉంటుంది. దీనితో ఈ కేసును పోలీసులు టేక్ ఓవర్ చేస్తారు. ఈ క్రమంలో వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అదేంటంటే ఆ సిటీలో ఒకే పద్దతిలో ఎనిమిది హత్యలు జరిగి ఉంటాయి. తెలిసిన వ్యక్తిలా నిందితుడు లోనికి వెళ్లి వాళ్ళని చంపేస్తున్నాడని తెలుస్తుంది.

దీనితో ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలనీ పోలీసులు గట్టిగ డిసైడ్ అవుతారు. వీలైనంత త్వరగా కేసును క్లోజ్ చేయాలనీ పై నుంచి కూడా వారికి ఆర్డర్స్ వస్తాయి. ఈ క్రమంలో పోలీసులు ఓ గ్యాంగ్ మీద అనుమానం వ్యక్తం చేస్తారు. దీనితో ఆ గ్యాంగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి గొడవ చేస్తారు. ఇక మరో వైపు ఆ పానీపూరి అతను తన కొడుకు కోసం డబ్బులు వెతికే పనిలో ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును సాల్వ్ చేసే పనిలో ఉండగానే మరొక రెండు హత్యలు జరుగుతాయి. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు ? పోలీసులు దీనిని ఎలా సాల్వ్ చేశారు ? ఆ పానీ పూరి బండి అతనికి ఈ కేసులకు ఏదైనా సంబంధం ఉందా ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “కేస్ ఆఫ్ కొండన” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments