iDreamPost
android-app
ios-app

OTT లో దీనిని మించిన యానిమేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ లేదు.. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్

  • Published Aug 03, 2024 | 6:00 AM Updated Updated Aug 03, 2024 | 6:00 AM

OTT Best Animated Movie : యాక్షన్ డ్రామాస్ , హీరో విలన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో చూసి చూసి బోర్ కొట్టేసి.. డిఫరెంట్ గా వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం యానిమేటెడ్ ఫిల్మ్స్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్.

OTT Best Animated Movie : యాక్షన్ డ్రామాస్ , హీరో విలన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో చూసి చూసి బోర్ కొట్టేసి.. డిఫరెంట్ గా వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం యానిమేటెడ్ ఫిల్మ్స్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్.

  • Published Aug 03, 2024 | 6:00 AMUpdated Aug 03, 2024 | 6:00 AM
OTT లో దీనిని మించిన యానిమేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ లేదు.. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్

కార్టూన్ , యానిమేటెడ్ ఫిల్మ్స్ ను కేవలం చిన్న పిల్లలు మాత్రమే చూస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి యానిమేటెడ్ చిత్రాలకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్ కల్కి సినిమా నుంచి వచ్చిన యానిమేటెడ్ సిరీస్ బుజ్జి&భైరవ నే ఉదాహరణ. యాక్షన్ డ్రామాస్ , హీరో విలన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో చూసి చూసి బోర్ కొట్టేసి.. డిఫరెంట్ గా వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం యానిమేటెడ్ ఫిల్మ్స్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. వెయ్యి సంవత్సరాల క్రితం భూమి , స్వర్గం కలిసి మంచి చెడులను కలిపే ఓ పవర్ ఫుల్ బాల్ ను క్రియేట్ చేస్తాయి. ఆ బాల్ కు ప్రాణం రాగానే తన చుట్టూ ఉండే ఎనర్జీని లాగేసుకుని.. ఇంకా పవర్ ఫుల్ గా మారుతుంది. దీని వలన భూమి అంత నాశనం అవుతుంది. అందుకే దేవుడు తన ఇద్దరు శిష్యులైన పిగ్గెట్ , సెన్ ను దానిని ఆపడానికి పంపిస్తాడు. కానీ ఆ బాల్ ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్న కారణంగా దానిని ఆపలేకపోతారు. దీనితో చివరికి దేవుడే ఓ పవర్ ఫుల్ ఛాంబర్ ను క్రియేట్ చేసి ఆ బాల్ నుంచి మంచి చెడులను సెపరేట్ చేస్తాడు. చెడు బాల్ ను నాశనం చేయడానికి.. మూడు సంవత్సరాల తర్వాత ఈ చెడు బాల్ పైన ఆకాశం నుంచి వచ్చే ఒక లైట్ పవర్ పడి.. ఆ పవర్ తట్టుకోలేక అది పూర్తిగా నాశనం అయిపోతుందనే శాపం పెడతాడు. ఈ క్రమంలో ఆ రెండు బాల్స్ ను మూడు సంవత్సరాల పాటు కలవనివ్వకుండా చూసుకోమని తన శిష్యులలో ఒకడైన పిగ్గెట్ కు ఇస్తాడు.

దీనితో సెన్ కు కోపం వస్తుంది.. దీనితో సెన్ ప్రపంచాన్ని పాలించాలని అందరి కంటే తానే ఎక్కువ శక్తివంతుడుగా ఉండాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం పిగ్గెట్ నుంచి మంచి బాల్ ను దొంగలించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో చెడు బాల్ అయినా డీమన్ బాల్ కూడా బయటపడుతుంది. ఆ డీమన్ బాల్ వెళ్లి.. ఓ రాజ్యంలోని రాణి గర్భాన పుడతాడు. దీనితో అతను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడనే భయంతో వెంటనే పిగ్గెట్.. డీమన్ ను చంపడానికి వెళ్తాడు. అక్కడ తన తల్లి వచ్చి అతనిని కాపాడుతుంది. ఆ రాజు రాణి తమ కొడుకుని వారితోనే ఉంచుకోవాలని అనుకుంటారు. కానీ మిగిలిన వాళ్లేమో ఆ పిల్లాడిని చంపేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనితో రాజు వెళ్లి దేవుడిని కలుస్తారు. సేన్ దగ్గర ఉన్న మరొక మంచి బాల్ నుంచి డ్రాగన్ కడుపునా.. మంచి అబ్బాయిల పుడతాడు. ఆ డీమన్ కుర్రాడి పేరు నిజా.. అతను పెరిగే కొద్దీ రాక్షసుడిలా బెహేవ్ చేస్తూ ఉంటాడు. మరో వైపు డ్రాగన్ కు పుట్టిన పిల్లాడు అలెక్స్. మరి వీరిద్దరి మధ్య గెలిచేది ఎవరు ? దేవుడు పెట్టిన శాపం వలన నిజా మూడేళ్ళ తర్వాత చనిపోతాడా లేదా ? అలెక్స్, లీసా ఫ్రెండ్స్ అవుతారా? తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “నిజా” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

అయితే ఈ సినిమా రెండు పార్ట్శ్ గా అందుబాటులో ఉంది.. నిజా అనేది మొదటి పార్ట్ అయితే.. “నిజా రీబోర్న్” అనేది రెండవ పార్ట్. యానిమేటెడ్ మూవీస్ ఇష్టపడే వారు ఈ రెండు సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ప్రస్తుతం నిజా అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. “నిజా రీబోర్న్” మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు సినిమాలను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.