iDreamPost
android-app
ios-app

జాంబీలతో కుర్రాళ్ల యుద్ధం.. OTTలో ఈ మూవీ కాస్త బో*ల్డ్ గానే ఉంటుంది!

  • Published Jun 06, 2024 | 3:51 PM Updated Updated Jun 06, 2024 | 3:51 PM

OTT Suggestions- Best Zombie Comedy Movie: జాంబీ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్లు కూడా చాలామందే ఉంటారు. అయితే కొన్ని సినిమాలు చాలా సీరియస్ గా ఉంటాయి. కానీ కొన్ని మాత్రం కామెడీతో కూడిన చిత్రాలు ఉంటాయి. అలాంటి లిస్ట్ లోకి ఈ మూవీ వస్తుంది.

OTT Suggestions- Best Zombie Comedy Movie: జాంబీ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్లు కూడా చాలామందే ఉంటారు. అయితే కొన్ని సినిమాలు చాలా సీరియస్ గా ఉంటాయి. కానీ కొన్ని మాత్రం కామెడీతో కూడిన చిత్రాలు ఉంటాయి. అలాంటి లిస్ట్ లోకి ఈ మూవీ వస్తుంది.

  • Published Jun 06, 2024 | 3:51 PMUpdated Jun 06, 2024 | 3:51 PM
జాంబీలతో కుర్రాళ్ల యుద్ధం.. OTTలో ఈ మూవీ కాస్త బో*ల్డ్ గానే ఉంటుంది!

హాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ కాన్సెప్ట్స్ లో జాంబీ మూవీస్ కూడా ఒకటి. ఈ కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి నిజమా? అబద్ధమా అనే చర్చకు వెళ్లకుండా జాంబీల సినిమాలను ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికోసం తెలుగులో కూడా ఒక జాంబీ సినిమా వచ్చింది. అదే జాంబీ రెడ్డి. అయితే ఓటీటీలో ఒక రేంజ్ జాంబీ సినిమా ఒకటి అందుబాటులోనే ఉంది. కాకపోతే ఆ మూవీని చాలా మంది లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు.. కాస్త డార్క్ కామెడీ కూడా ఉంటుంది. ఒక్కోసీన్లో యాక్షన్ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారు. మరి.. ఆ చిత్రం ఏదో చూద్దాం.

జాంబీ సినిమాలు ఇష్టపడే వారికి ఇది అదిరిపోయే మూవీ సజీషన్ అనే చెప్పాలి. ముఖ్యంగా టీనేజ్ కామెడీ, టీనేజ్ రొ*మాన్స్ మూవీస్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక ఊరిలో ఒక టీనేజ్ పిల్లలు చేసే సాహసాలు, వారి కోరికలు, వారికి ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో యాక్షన్ మాత్రమే కాదు.. డార్క్ కామెడీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఎదురుగా ప్రమాదం ఉంటే.. ఆ కుర్రాళ్లు వేసే వేషాలు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అంతేకాకుండా వారి జీవితాలను ప్రమాదంలో పెట్టుకుని మరీ వాళ్లు చేసే పోరాటం ఆకట్టుకుంటుంది.

Jombie

ఈ కుర్రాళ్లు స్కౌట్స్ లో తర్ఫీదు పొందుతారు. అయితే వాళ్లేమో తమకు ఉన్న తీరని కోరికల గురించి ఆలోచిస్తూ.. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతూ దానిని ఎంజాయ్ చేయాలి అని కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఒక నైట్ పబ్ కి కూడా వెళ్తారు. అక్కడి నుంచే వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. కోరికల సంగతి పక్కన పెడితే ప్రాణాలు ఉంటాయో లేదో అనే భయం మొదలవుతుంది. అయితే వీరిని కాపాడేందుకు ఇంకా కొందరు హెల్ప్ చేస్తుంటారు. వారిలో ఒక లేడీ మాత్రం ఈ కుర్రాళ్ల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తుంది. అయితే ఆమె కాస్త క్యూట్ గా ఉండటంతో ఈ కుర్రాళ్ల అమె ప్రేమలో పడిపోతారు.

జాంబీలతో పోరాడుతూనే ఆ యువతిని కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ, ఆ కుర్రాళ్లలో ఒక్కరికే ఆ అదృష్టం దక్కుతుంది. ఈ మూవీలో కొన్ని బో*ల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. జాంబీలతో కూడా అలాంటి సీన్స్ ప్లాన్ చేశారు. ముందే చెప్పాం కదా ఇది ఒక డార్క్ కామెడీ మూవీ అని. అయితే కుర్రాళ్లు కూడా యాక్షన్ ఇరగదీస్తారు. ఈ మూవీ పేరు ‘స్కౌట్స్ గైడ్ టూ ది జాంబీస్ అపోకలిప్స్‘. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి చూడటం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సడెన్ ఏదైనా బో*ల్డ్ సీన్ వస్తే బుక్ అవుతారు. అందుకే కాస్త ప్రైవసీ మెయిన్టైన్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş