చిన్న సాయానికి.. భర్తను కాదని పరాయి వాడితో.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Watch Alone Movie Unfaithful: ఓటీటీల్లో ఉన్న సినిమాల్లో ఇలాంటివి కాస్త అరుదుగా తగులుతూ ఉంటాయి. చూస్తుంటే ఒక తెలుగు సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. ఒక్కో ట్విస్టుకు బుర్ర కూడా పాడవుతుంది.

OTT Suggestions- Best Watch Alone Movie Unfaithful: ఓటీటీల్లో ఉన్న సినిమాల్లో ఇలాంటివి కాస్త అరుదుగా తగులుతూ ఉంటాయి. చూస్తుంటే ఒక తెలుగు సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. ఒక్కో ట్విస్టుకు బుర్ర కూడా పాడవుతుంది.

ఓటీటీల్లో కొన్ని సినిమాలను చూస్తే వావ్ అనాలి అనిపిస్తుంది. కానీ, ఆ ఫీలింగ్ అంత ఈజీగా వచ్చేది కాదు. సినిమా ఒక రేంజ్ లో ఉంటేనే ప్రేక్షకుడికి అలాంటి ఒక భావన కలుగుతుంది. మీకు అలాంటి ఒక ఫీలింగ్ కలిగే చిత్రాన్ని మీకోసం సజీషన్ గా తీసుకొచ్చాం. మీరు హాలీవుడ్ అనగానే కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ డ్రామా, లవ్, ఎమోషన్ అంతగా ఉండదు అనే అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఈ మూవీ చూశాక మీక ఆ ఫీలింగ్ మారిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఒక మంచి లవ్ స్టోరీనే కాకుండా.. అదిరిపోయే థ్రిల్లర్ కూడా. ఇందులో ఉండే ఒక్కో ట్విస్టుకి మతి గిర్రున తిరుగుతుంది.

ఈ సినిమా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట ఇలాంటి బాగోతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సాయం చేశారులే అని అందరినీ మంచి వాళ్లు అనుకోవడానికి లేదు. ముల్లు తీసుకోవడానికి ఉపయోగపడింది కదా.. అని పిన్నీసు స్వభావాన్ని మర్చిపోకూడడు. అది కూడా గుచ్చి బాధ పెడుతుంది. అలాంటి కథే ఇది కూడా. ఒక పెళ్లైన మహిళ ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉంటాడు. భర్తతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితం. ఒకరోజు రోడ్డు మీద పెద్ద గాలి వస్తే.. ఓ కుర్రాడు తన అపార్టుమెంట్ లోకి ఆహ్వానించి సాయం చేస్తాడు. అతనికి మళ్లీ థ్యాంక్స్ చెప్పడానికి అక్కడికి వెళ్తుంది. అది కాస్తా ఫ్రెండ్ షిప్ గా మారుతుంది. హాలీవుడ్ లో ఫ్రెండ్ షిప్ అంటే కాస్త ఘాటుగానే ఉంటుంది.

ఆమె తనకు పెళ్లైంది అనే విషయాన్ని కూడా మర్చిపోతుంది. ఆ యువకుడితో హద్దులు కాస్తా దాటేస్తుంది. అయితే ఒకసారి చేస్తే పొరపాటు అవుతుంది. కానీ, అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తుంది. అది తప్పు అంటే ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెపై భర్తకు అనుమానం వస్తుంది. ఆమెను నిలదీయడానికి ముందు అసలు ఆమె ఏం చేస్తోందో తెలుసుకోవాలి అనుకుంటాడు. అందుకు ఒక డిటెక్టివ్ ని పురమాయిస్తాడు. ఆ డిటెక్టివ్ మొదట తన భార్య అలా చేస్తుంది అనుకోడు.

కానీ, డిటెక్టివ్ కూడా విస్తుపోయేలా ఆ మహిళ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. పబ్లిక్ ప్లేస్ లోనే కొత్తగా పెళ్లైన జంటలా రెచ్చిపోతుంటారు. అయితే అది తెలుసుకున్న ఆ భర్త ఏం చేశాడు? వారి సంబంధాన్ని ఎలా చూశాడు? నా కర్మ అనుకుని వదిలేశాడా? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం తెలియాలి అంటే మీరు ఈ “అన్ ఫెయిత్ ఫుల్” అనే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కాకపోతే రూ.119కి రెంట్ కి తీసుకోవాలి. అయితే ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఫ్రీగానే చూసేయచ్చు. ఫ్రీగా ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments