Tirupathi Rao
OTT Suggestions- Best Watch Alone Movie Mea Culpa: ఓటీటీలో అదిరిపోయే థ్రిల్లర్స్ చాలానే ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. అలాంటి ఒక క్రేజీ థ్రిల్లర్ మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ చూస్తే మీరు కచ్చితంగా వావ్ అనాల్సిందే. అయితే కాస్త బో*ల్డ్ గా ఉంటుంది.
OTT Suggestions- Best Watch Alone Movie Mea Culpa: ఓటీటీలో అదిరిపోయే థ్రిల్లర్స్ చాలానే ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. అలాంటి ఒక క్రేజీ థ్రిల్లర్ మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ చూస్తే మీరు కచ్చితంగా వావ్ అనాల్సిందే. అయితే కాస్త బో*ల్డ్ గా ఉంటుంది.
Tirupathi Rao
ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్స్ కోసం చూస్తుంటే మాత్రం.. మీరు ఈ సినిమా ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది గూస్ బంప్స్ కి మించి తెస్తుంది. అంతేకాకుండా.. ఇందులో ఒక విచిత్రమైన ప్రేమ కథ ఉంటుంది. ఇందులో ఒకరు గుడ్డిగా నమ్మితే ఇంకొకరు మాత్రం మోసం చేస్తారు. ఇది రియల్ లైఫ్ కి కాస్త దగ్గరగా ఉండే థ్రిల్లర్ మూవీ అనమాట. దీనిని మూవీ అనే బదులు ఒక కన్నింగ్ గేమ్ అనచ్చు. ఎందుకంటే ఇది అలాగే ఉంటుంది. చూడటానికి మనం రోజూ చూసే క్రైమ్ స్టోరీస్ లాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రేమ అనే ముసుగులో ఒక వ్యక్తి చేసే అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. అంతేకాకుండా కాస్త బో*ల్డ్ వేలో చూపిస్తారు.
ఈ సినిమా మొత్తం ఒక లేడీ లాయర్ లైఫ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె ఎంతో సక్సెస్ ఫుల్ లాయర్. ఆమె కేసు తీసుకుంటే కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఆమె దగ్గరకు ఒక హత్యానేరం ఆరోపించబడిన వ్యక్తి కేసు వస్తుంది. అతను ఒక మంచి పెయింటర్. ఒక పెద్ద సెలబ్రిటీ కూడా. ఆమెను తన లాయర్ గా ఎంచుకుంటాడు. తన భార్యను హత్య చేశాడు అనేది అతనిపై ఉన్న అభియోగం. అతను మాత్రం తనకు ఏ పాపం తెలియదు అని ఆ లాయర్ ముందు నటిస్తాడు. ఆమె అతడిని బాగా నమ్మేస్తుంది. అతడికి బెయిల్ తీసుకురావడంలో కీలకంగా కూడా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత అతనితో రిలేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఆమె అలాంటి ఇలాంటి రిలేషన్ కాదు.. ఏకంగా పడ*క పంచుకునే వరకు వెళ్లిపోతుంది.
అయితే ఆ తర్వాత చిన్నగా ఆమెకు అతని అసలు క్యారెక్టర్ తెలియడం స్టార్ట్ అవుతుంది. అతను నమ్మింది ఒక నరరూప రాక్షసుడిని అని అనుమానం మొదలవుతుంది. ఆమె ఎంత ప్రయత్నించినా అతనికి దూరంగా వెళ్లే పరిస్థితి ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ, ఆమె అప్పటికీ ఏదో ఒక మూల అతనిపై నమ్మకంతో ఉంటుంది. కానీ, అతను మాత్రం అంత మంచి వ్యక్తి కాదు. చివరకు ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? అసలు అతను నిజంగానే హత్య చేశాడా? అతని భార్య ఏదైనా అతడిని ట్రాప్ చేసిందా? ఇలాంటి చాలానే ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే మీరు ఈ ‘మియా కుల్పా’ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.