iDreamPost
android-app
ios-app

ఫ్రెండ్ భార్యతో ప్రేమాయణం.. హద్దులు దాటేసి.. OTTలో డిఫరెంట్ స్టోరీ!

  • Published Jul 25, 2024 | 11:00 PM Updated Updated Jul 25, 2024 | 11:00 PM

OTT Suggestions- Best Watch Alone Movie Disobedience: ఓటీటీలో మీకు చాలానే సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ, ఇలాంటి అరుదైన స్టోరీలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే ఒకసారి చూడాల్సిందే.

OTT Suggestions- Best Watch Alone Movie Disobedience: ఓటీటీలో మీకు చాలానే సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ, ఇలాంటి అరుదైన స్టోరీలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే ఒకసారి చూడాల్సిందే.

  • Published Jul 25, 2024 | 11:00 PMUpdated Jul 25, 2024 | 11:00 PM
ఫ్రెండ్ భార్యతో ప్రేమాయణం.. హద్దులు దాటేసి.. OTTలో డిఫరెంట్ స్టోరీ!

ప్రేమ అనేది ఎంతో మధురమైన భావన. ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఒక్కసారి అయినా ఆ ఫీలింగ్ ని ఎక్స్ పీరియన్స్ చేసుంటారు. అయితే అబ్బాయి- అమ్మాయి మధ్యనే కాదు.. ప్రేమ అనేది అమ్మాయి- అమ్మాయి మధ్య.. అబ్బాయి- అబ్బాయి మధ్య కూడా కలగచ్చు. అది వారి శరీరతత్వం, వారి హార్మోన్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సమాజంలో అలాంటి ప్రేమలు మాత్రమే కాదు.. పెళ్లిళ్లు కూడా చూశాం. అలాంటి ఒక ప్రేమకథ గురించే మనం మాట్లాడుకునేది. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే వారిది కూడా ఒక ప్రేమే అని బలంగా చెప్తారు. అలాంటి డిఫరెంట్ కథ ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఇది చాలా సింపుల్ స్టోరీ. మొత్తం లండన్ లో జరుగుతూ ఉంటుంది. ఒక మత పెద్దకు కుమార్తె ఉంటుంది. ఆమె తన జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవించాలి అనుకుంటుంది. కానీ, అది ఆ ఇంట్లో ఉంటే సాధ్యం కాదు. అందుకే ఇల్లు, అయిన వాళ్లని వదిలి దూరంగా వెళ్లిపోతుంది. తనకు నచ్చిన ఫొటోగ్రఫీ చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత తన తండ్రి చనిపోతాడు. తండ్రిని చూసేందుకు.. ఆయనకు అంత్యక్రియలు చేసేందుకు తిరిగి తన సొంతూరుకు వస్తుంది. అక్కడ అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తన తీరు, ప్రవర్తన వారి కమ్యూనిటీకి తగ్గట్టుగా ఉండదు. పైగా ఆమె తన పేరు కూడా మార్చుకుంటుంది.

తండ్రి మరణంతో ఆమెకు ఏం చేయాలి? ఎక్కడ ఉండాలో తెలియదు. తన బాల్య మిత్రుడు తన తండ్రి స్థానంలో మత పెద్ద అవుతాడు. అతను ఈమెను ఇంటికి ఆహ్వానిస్తాడు. తమతో కలిసి ఉండాల్సిందిగా కోరతాడు. అయితే తను ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్యను పరిచయం చేస్తుంది. అనూహ్యంగా వాళ్లిద్దరూ ప్రేమలో పడిపోతారు. డేవిడ్ భార్యకు అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదు. తనకున్న ఇబ్బంది పోవాలి అంటే.. పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అతను పెళ్లి చేసుకుంటాడు. పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం ఆమెకు అమ్మాయిలు అంటేనే ఇష్టం ఉంటుంది.

ఇలా హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత అది శారీ*రక బంధంగా మారుతుంది. ఎవరికీ తెలియకుండా కొన్నాళ్లు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ ఉంటారు. కానీ, ఒకరోజు అయిన వాళ్ల కంట్లో పడతారు. అప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్లి ప్రేమను అంగీకరిస్తారా? అసలు వాళ్లను మనుషుల్లా చూస్తారా? అనేదే ఇక్కడ పాయింట్. అలాగే కథ సాగుతూ ఉంటుంది. హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త బో*ల్డ్ గా కూడా ఉంటాయి. ఈ మూవీ పేరు “డిస్ ఒబీడియన్స్ (Disobedience)“. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. రూ.69 రెంట్ కట్టి చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş