iDreamPost
android-app
ios-app

మాజీ ప్రియుడి కోసం హంతకురాలిగా.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller You Get Me Movie: ఓటీటీలో ఒక మంచి థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది అదిరిపోయే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట.

OTT Suggestions- Best Thriller You Get Me Movie: ఓటీటీలో ఒక మంచి థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది అదిరిపోయే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట.

మాజీ ప్రియుడి కోసం హంతకురాలిగా.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య అనే చెప్పాలి. ఎలా పుడుతుందో? ఎందుకు పుడుతుందో? ఎవరిపై పుడుతుందో? ఎన్నిసార్లు పుడుతుందో చెప్పే పరిస్థితి ఉండదు. అబ్బాయి- అమ్మాయి మధ్య ప్రేమ ఎంత సహజంగా జరుగుతుందో అలాగే బ్రేకప్ కూడా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పాయింట్ మీదే ఈ మూవీ వచ్చింది. అయితే లెట్స్ బ్రేకప్ అనగానే అందరూ దానిని స్పోర్టివ్ గా తీసుకుని లైఫ్ లో ముందుకు వెళ్లిపోరు. కొందరు అడ్డం తిరిగి అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్లు కూడా ఉంటారు ఈ సినిమాలో హీరోయిన్ లాగా. ఇది సరిగ్గా అలాంటి పాయింట్ మీదే ముందుకెళ్తుంది. మరి.. ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఈ మూవీ ఒక అందమైన ప్రేమ కథలాగా స్టార్ట్ అవుతుంది. ఒక అందమైన అమ్మాయి.. ఆమెంటే పడి చచ్చిపోయే అబ్బాయి. వారి ప్రేమ ఎంతో క్యూట్ గా ఉటుంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ప్రేమ పక్షుల్లా తిరిగేస్తూ ఉంటారు. అయితే వారి ప్రేమ కొన్ని రోజులకు తగ్గిపోతుంది. విరహం కాస్తా.. విరక్తిగా మారుతుంది. ఆ అమ్మాయి ప్రవర్తనతో హీరో విసిగిపోతాడు. అందుకే తాను తన జీవితాన్ని చూసుకోవాలి అని భావిస్తాడు. ఆమెకు దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేసి.. ఆ సిటీ వదిలి వెళ్లిపోతాడు. అయితే ఆమె కొన్ని రోజలు హీరోకి దూరంగానే ఉంటుంది. కానీ, ఒక్కసారిగా ఆమె తిరిగి అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.

ఆమె తన మాజీ ప్రియురాలు అని ఎవరికీ చెప్పడు. అలాగే అతను మనరో అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మాజీ ప్రియురాలు.. ప్రస్తుతం ఉన్న గర్ల్ ఫ్రెండ్ తోనే రూమ్ షేర్ చేసుకుంటుంది. అబ్బాయికి మాత్రం చుక్కలు చూపిస్తుంది. తిరిగి ఇద్దరూ శారీ*రక బంధాన్ని ఏర్పరచుకోవాలి అని డిమాండ్ చేస్తుంది. కానీ, ఆ కుర్రాడు అమెను దురం పెడుతూ వస్తాడు. ఇంక ఆ యువతి హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఫిక్స్ అవుతుంది. అందుకు తాను ఒక హత్య చేసి అది హీరో మీదకు నెట్టేస్తుంది. అలాగే హీరో ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ ని కూడా చంపేస్తానంటూ హెచ్చరించింది. ఇద్దరూ ఒకే రూమ్ కాబట్టి..ఆమెను చంపాలి అనుకుంటే ఆపడానికి కూడా ఎవరూ ఉండరు. ఈ సినిమా పేరు ‘యూ గెట్ మీ’. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. కాబట్టి సోలోగా చూసే ప్రయత్నం చేయండి. మరి.. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి