iDreamPost
android-app
ios-app

ఆ అపార్టుమెంటులో అడుగుపెడితే చావే.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

OTT Suggestions- Best Thriller Sliver: ఓటీటీలోకి ఒక క్రేజీ మూవీ వచ్చింది. ఈ మూవీలో అలాంటి ఇలాంటి ట్విస్టులు ఉండవు. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు. మరి.. ఆ మూవీ ఏది.. ఏ ఓటీటీలో ఉందో చూడండి.

OTT Suggestions- Best Thriller Sliver: ఓటీటీలోకి ఒక క్రేజీ మూవీ వచ్చింది. ఈ మూవీలో అలాంటి ఇలాంటి ట్విస్టులు ఉండవు. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు. మరి.. ఆ మూవీ ఏది.. ఏ ఓటీటీలో ఉందో చూడండి.

ఆ అపార్టుమెంటులో అడుగుపెడితే చావే.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

ఓటీటీలో అన్ని తరహా జానర్స్ ని చూస్తూ ఉంటారు. ఎక్కువ మంది లవ్ స్టోరీలు, కామెడీ డ్రామాలు చూస్తూ ఉంటారు. కొందరు మాత్రం హారర్, థ్రిల్లర్స్ చూస్తారు. ఈ రెండో కేటగిరీ కోసం ఒక క్రేజీ సినిమాని తీసుకొచ్చాం. ఈ మూవీలో అలాంటి ఇలాంటి ట్విస్టులు ఉండవు. మీకు బిగ్ బాస్ షో గురించి తెలిసే ఉంటుంది. ఒక ఇంట్లో 100 కెమెరాలు పెట్టి అందరినీ అక్కడ వదిలేస్తారు. వాళ్లు చేసే ప్రతి పనిని చూస్తూ ఉంటారు. అయితే అలాంటి కాన్సెప్ట్ తో ఎప్పుడో హాలీవుడ్ లో ఒక సినిమా వచ్చింది. ఆ మూవీలో కూడా ఒక అపార్టుమెంట్ లో నిండా కెమెరాలే ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరు చేసే పని రికార్డు అవుతూ ఉంటుంది. దానిని ఒకరు గమనిస్తూ ఉంటారు.

బిగ్ బాస్ అనేది చాలా సక్సెస్ ఫుల్ కాన్సెప్ట్ అలాంటి కాన్సెప్ట్ తో ఎప్పుడో సినిమా వచ్చింది. కాకపోతే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఒక పెద్ద అపార్టుమెంట్ ఉంటుంది. అందులో కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి. వాటిలో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అయితే అందులో ఉండే ఒక ఫ్లాట్ లో మాత్రం ఎవరైనా దిగాలి అంటే భయపడాల్సిందే ఎందుకంటే గడిచిన రెండేళ్లలో ఆ అపార్టుమెంట్ లో ఇద్దరు యువతులు చనిపోతారు. అయితే హీరోయిన్ కు ఆ విషయం తెలియదు. ఆమె మాత్రం అక్కడికి వెళ్లిపోతుంది. ఆమె ఫాల్ట్ కిటికీ నుంచి బయటకు చూస్తే అద్భుతమైన వ్యూ ఉంటుంది. అక్కడి నుంచి నగరాన్ని చూస్తూ ఆస్వాదించవచ్చు.

అయితే ఆ అపార్టుమెంట్ బయట వ్యూ కంటే.. లోపల వ్యూనే ఇంకా బాగుటుంది అని అంటారు. అయితే అది నేరుగా చూసేది కాదు.. అంటే కెమెరాల నుంచి ఆ వ్యక్తి అందరినీ చూస్తూ ఉండేది. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాడు. ఈ యువతి వచ్చిన తర్వాత ఫోకస్ మొత్తం ఆమె మీదే పెడతాడు. ఆమె ఏం చేస్తోంది? ఎవరిని కలుస్తోంది? ఇలా ప్రతి విషయాన్ని చూస్తాడు. ఆమె పడుకున్నా, తిన్నా, బాత్ చేసినా ఇలా ఏ ఒక్కటి వదలడు. ఇలా కొన్నాళ్లు ఫాలో చేసిన తర్వాత ఆమెను నేరుగా కలుస్తాడు.

ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? అతను ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడు. గతంలో చనిపోయిన ఇద్దరు అమ్మాయిలను కూడా అతనే చంపాడా? అసలు అతనికి ఏం కావాలి? ఇదే పాయింట్ మీద ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా పేరు స్లివర్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే ఈ మూవీని సోలోగా చూస్తే బెటరు. అంతేకాకుండా ఈ మూవీ రెంట్ ఆన్ వ్యూ బేసిస్ లోనే అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetovis girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis