iDreamPost
android-app
ios-app

కడుపులో బిడ్డతో బిర్యానీ చేసి పెట్టిన మహిళ.. OTTలో కన్నీళ్లు పెట్టించే కథ!

OTT suggestions- Best Thriller OTT: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే ఆనందం వస్తుంది. కొన్ని మూవీస్ చూస్తే కన్నీళ్లొస్తాయి. ఇలాంటి సినిమాని మాత్రం ఓటీటీలో అస్సలు మిస్ కాకూడదు.

OTT suggestions- Best Thriller OTT: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే ఆనందం వస్తుంది. కొన్ని మూవీస్ చూస్తే కన్నీళ్లొస్తాయి. ఇలాంటి సినిమాని మాత్రం ఓటీటీలో అస్సలు మిస్ కాకూడదు.

కడుపులో బిడ్డతో బిర్యానీ చేసి పెట్టిన మహిళ.. OTTలో కన్నీళ్లు పెట్టించే కథ!

మనుషుల జీవితాల్లో కష్టాలు సహజంగానే ఉంటాయి. కానీ, వాటిని దాటితేనే సంతోషం ఉంటుంది. కొందరి జీవితాలు కష్టాలతోనే కడతేరుతూ ఉంటాయి. అలాంటి వారి జీవితాలను మీరు కొన్ని సినిమాల్లో కూడా చూసే ఉంటారు. అలాంటి ఒక కథే ఇది కూడా. ఈ కథలో ఒక మహిళ ఉంటుంది. ఆమె చుట్టూనే ఈ కథ జరుగుతూ ఉంటుంది. ఆ మహిళకు కష్టాలు అనేవి అలవాటు అయిపోతాయి. ఎందుకంటే ఆమె జీవితం మొత్తం ఉన్నది ఆ కష్టాలే కాబట్టి. పుట్టినప్పటి నుంచి చావు వరకు ఆ మహిళ కడుపు నిండా తిన్నది ఉండదు.. కంటి నిండా నిద్రపోయింది ఉండదు. ఆమె.. ఆమె జీవితం.. ఆమె కుటుంబం చుట్టూనే ఈ సినిమా ఉంటుంది. అయితే చిన్న పిల్లలతో మాత్రం ఈ మూవీ చూడొద్దు.

ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు కదీజా. ఆమెకు ఒక తల్లి, తమ్ముడు, భర్త, కొడుకు ఉంటారు. తమ్ముడు చేపల వేటకు వెళ్లి తిరిగిరాడు. తల్లికి అనారోగ్యం ఉంటుంది. తమ్ముడు తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే తమ్మడు ఉగ్రవాదుల్లో చేరాడు అంటూ పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. పోలీసులు వచ్చారు అని ముస్లిం పెద్దలు వీళ్ల కుటుంబాన్ని వెలివేస్తారు. తండ్రి మరణానికి సంబంధించి వచ్చే డబ్బు కూడా రాకుండా చేస్తారు. ఇంక అక్కడ ఉంటే కష్టం అని చెప్పి తమ్ముడి ఫ్రెండ్ తమిళనాడు పంపించేస్తాడు. అక్కడ ఒక మసీదు దగ్గర జీవన సాగిస్తూ ఉంటుంది. అయితే ఆమె చేతిలో చిల్లిగవ్వ ఉండదు.

Biriyani

బతుకుతెరువు కోసం ఖదీజా వ్యభి*చారంలోకి దిగుతుంది. ఆమె ఒళ్లు అమ్ముకుని కాలం గడుపుతూ ఉంటుంది. అయినా ఆమె జీవితాన్ని కష్టాలు వదలవు. తన తమ్ముడు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతాడు. మరోవైపు తాను చేస్తున్న పని వల్ల ఖదీజా గర్భం దాల్చుతుంది. తల్లి కూడా అనారోగ్యంతో మరణిస్తుంది. ఇంక తనకు మిగిలింది తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మాత్రమే. ఆ బిడ్డ కోసం అయినా ఖదీజా బతకాలి అనుకుంటుంది. పోలీసులు విచారణ పేరుతో ఆమెను తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తిస్తారు. అప్పుడు ఖదీజాకు బ్లీడింగ్ అవుతుంది. ఆస్పత్రికి వెళ్తే బిడ్డ చనిపోయింది అని చెప్తారు. ఆ బిడ్డ మృతదేహాన్ని ఆమెకు ఇస్తారు. ఖదీజా ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటుంది.

తన జీవితంలో కష్టాలకు కారణం అయిన వారికి ఇఫ్తార్ విందు ఇవ్వాలి అనుకుంటుంది. అందరినీ పిలుస్తుంది. అందరికీ బిర్యానీ వండి పెడుతుంది. ఆ బిర్యానీలో తన చనిపోయిన బిడ్డను కూడా కలిపి వండుతుంది. వాళ్లందరికీ ఆ బిర్యాని పెడుతుంది. జీవితంలో తాను ఎవరి వల్ల అయితే కష్టాలు పడింది అనుకుందో.. అందరినీ ఆ విందుకు పిలుస్తుంది. ఆ తర్వాత ఖదీజా నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన కని కుశృతి యాక్టింగ్ కు మీకు కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ మూవీకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా పేరు బిర్యానీ. ఈ మూవీ ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లేలో అందుబాటులో ఉంది. అలాగే డైలీ మోషన్ వీడియో సైట్లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీని పిల్లలతో కలిసి మాత్రం చూడొద్దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి