iDreamPost
android-app
ios-app

OTTలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నరాలు తెగిపోతాయి.. మస్ట్ వాచ్ మూవీ!

OTT Suggestions- Best Suspense Thriller Helen: ఓటీటీలో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ముఖ్యంగా హీరోయన్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు. మరి.. ఆ మూవీ ఏదంటే?

OTT Suggestions- Best Suspense Thriller Helen: ఓటీటీలో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ముఖ్యంగా హీరోయన్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు. మరి.. ఆ మూవీ ఏదంటే?

OTTలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నరాలు తెగిపోతాయి.. మస్ట్ వాచ్ మూవీ!

ఓటీటీ ఒక్కో థ్రిల్లర్ చూస్తే.. పదే పదే అదే గుర్తొస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అని మనసు ఉవ్విళ్లూరుతుంది. అలాంటి ఒక ఉత్కంఠ భరిత చిత్రమే ఇది కూడా. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా.. కుర్చీ అంచుకు తీసుకొచ్చే మూవీ ఇది. ఒక అమ్మాయి.. అతని కుటుంబం మధ్య జరిగే చిత్రం. ఇది కేవలం ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగానే సాగుతూ ఉంటుంది. ఒక అమ్మాయి జీవితంలో ఆ రాత్రి ఏం జరిగింది అనేదే ఇక్కడ కథ. ఒక్కో సీన్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆసక్తిగా సాగుతుంది.

ఈ మూవీ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన తండ్రి ఒక ఎల్ఐసీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దేందుకు కావాల్సిన డబ్బుని పోగుచేస్తూ ఉంటాడు. అయితే అది అంత తేలికైన విషయం కాదు అని అందరికీ తెలిసిందే. పైగా అతను అంత ఆరోగ్యంగా కూడా ఉండడు. అయితే తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక రెస్టారెంట్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఎలాగైనా విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదిస్తాను అని ఇంట్లో చెప్తూ ఉంటుంది. అయితే ఆమె ఫారెన్ వెళ్లండి వారికి ఇష్టం లేదు. వద్దని వారిస్తూనే ఉంటారు. అయితే ఆమె విదేశాలకు ఒక్కతే వెళ్లాలి అనుకోదు. తాను ప్రేమించి అబ్బాయితో వెళ్లాలి అని చూస్తూ ఉంటుంది. అందుకే ఇంట్లో బాగా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఎలాగైనా వెళ్లిపోవాలి అనుకుంటారు.

Helen

కానీ, వారి జీవితంలో ఊహించని ఘటన జరుగుతుంది. హెలెన్ పని చేసే రెస్టారెంట్లో ఫ్రీజర్ రూమ్ లో చిక్కుకుంటుంది. ఆమె తిరిగి ఇంటికి రాలేదు అని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తూ ఉంటుంది. ఆమె ఏమైందా అని అంతా కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడి నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది. మరోవైపు హెలెన్ ఆ ఫ్రీజర్లో తన ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటుంది. ఆమె ప్రాణాలతో బయటపడిందా? ఆమె అందులో ఎలా చిక్కుకుంది? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న హెలెన్ చిత్రం చూడాల్సిందే. హిందీలో ఈ చిత్రాన్ని జాన్వీ కపూర్ చేసింది. ఆ మూవీ పేరు ‘మిలి’. అది నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. హెలెన్ చ్రితం అమెజాన్ లో మీకు దొరక్కపోతే.. యూట్యూబ్ లో ఫ్రీగానే చూసేయచ్చు. కొన్ని ఛానల్స్ లో ఈ మూవీ ఉంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet