iDreamPost
android-app
ios-app

OTTలో పిచ్చెక్కించే థ్రిల్లర్.. ఒక్కో ట్విస్టుకు మబ్బులిడిపోతాయ్!

  • Published Jun 10, 2024 | 6:06 PM Updated Updated Jun 10, 2024 | 6:06 PM

OTT Suggestions- Best Suspense Crime Drama: మీకు క్రైమ్ థ్రిల్లర్, పోలీస్ డ్రామాలు చూడటం ఇష్టమా? అయితే మీరు ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఇందులో ఉండే సస్పెన్స్, క్రైమ్, ట్విస్టులు మామూలుగా ఉండవు.

OTT Suggestions- Best Suspense Crime Drama: మీకు క్రైమ్ థ్రిల్లర్, పోలీస్ డ్రామాలు చూడటం ఇష్టమా? అయితే మీరు ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఇందులో ఉండే సస్పెన్స్, క్రైమ్, ట్విస్టులు మామూలుగా ఉండవు.

  • Published Jun 10, 2024 | 6:06 PMUpdated Jun 10, 2024 | 6:06 PM
OTTలో పిచ్చెక్కించే థ్రిల్లర్.. ఒక్కో ట్విస్టుకు మబ్బులిడిపోతాయ్!

ఓటీటీల్లో ఒక రెండు జానర్స్ కి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుంది. అది ఒకటి హారర్, రెండు థ్రిల్లర్. ఈ థ్రిల్లర్స్ కూడా ఎలా ఉండాలి అంటే. ఒక్కో సీన్ కి ఆడియన్స్ కి పిచ్చెక్కిపోవాలి. ఒక్కో సీన్ కి వావ్ అంటూ ఉండాలి. కానీ, అలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి. కానీ, ఉన్న కొన్ని మాత్రం ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తాయి. అలాంటి ఒక సినిమానే ఓటీటీ నుంచి తీసుకొచ్చాం. ఈ మూవీని ఓటీటీలో చూస్తే మీరు మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. పైగా ఒక్కో పాత్ర, ఒక్కో సీన్, ఒక్కో ట్విస్టు మీకు గుర్తుండిపోతుంది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాని చూసే ఉంటారు. కానీ, మళ్లీ చూసినా ఎంతో ఫ్రెష్ ఫీల్, థ్రిల్ ని కలిగిస్తూ ఉంటుంది.

సాధారణంగా మీరు ఎన్నో కాప్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. కానీ, ఈ థ్రిల్లర్ మూవీ మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇందులో కావాల్సినన్ని ట్విస్టులు ఉంటాయి. కావాల్సినంత సస్పెన్స్ ఉంటుంది. అంతకు మించిన యాక్షన్, ఎమోషన్, లవ్ అన్నీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ మూవీలో మంచి కామెడీ కూడా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమాని ఒక ఫుల్ మీల్స్ అనచ్చు. ఒక వ్యక్తి ఒక వ్యవస్థకు ఎదురెళ్లి.. తప్పుడు దారిలో వెళ్తుంటే.. అలాంటి వాడిని పట్టుకోవడమే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. నిజానికి ఇది కేవలం పైన కనిపించే పాయింట్ మాత్రమే. కానీ, కథలోకి వెళ్లే కొద్దీ అది మరింత కొత్తగా, మరింత బలంగా మారిపోతుంది.

Anjali CBI

ఈ సినిమా మరేదో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, అథర్వ కలిసి నటించిన అంజలి సీబీఐ. ఈ మూవీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి విషయం, ప్రతి క్యారెక్టర్ ఎంతో ఫేమస్. ముఖ్యంగా విజయ్ సేతుపతి చెప్పే ఆర్ యూ ఓకే బేబే అనే డైలాగ్ అయితే సూపర్ పాపులర్. ఇంక నయనతార కుమార్తెగా చేసిన పాప కూడా ఎంతో ఫేమస్. ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఒక ఇండివిడ్యూవల్ గుర్తింపు, ప్రాధాన్యత ఉంటాయి. అలాగే అనురాగ్ కశ్యప్ చేసిన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని కొత్తగా సజీషన్ గా తీసుకురావడం దేనికంటే.. ఎన్నిసార్లు చూసినా కూడా ఇలాంటి ఒక మంచి థ్రిల్లర్ ని మరోసారి చూడచ్చు.

ఈ సూపర్బ్ ఫిల్మ్ ని మరోసారి మీ ముందుకు కావాలనే తీసుకొచ్చాం. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలోనే కాకుండా.. కొన్ని యూట్యాబ్ ఛానల్స్ లో కూడా ఉంది. మరి.. మీరు గనుక ఇప్పటివరకు ఈ అంజలి సీబీఐ మూవీ చూడకపోతే మాత్రం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అలాగే ఈ మూవీలో ఉండే ట్విస్టులు, క్లైమ్యాక్స్ మాత్రం నెక్ట్స్ లెవల్ థ్రిల్ ని ఇస్తాయి. ఈ అంజలి సీబీఐ మూవీ మీరు చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş