iDreamPost
android-app
ios-app

హిట్లర్ కు మించిన క్రూరమైన రాణి.. OTTలో ఈ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Best Series The Serpent Queen: ఓటీటీలో ఒక మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సిరీస్ ఒకసారి ట్రై చేయండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇందులో ఉండే రాణిని చూశాక.. మీకు హిట్లరే కాస్త నెమ్మదస్తుడు అనిపించకమానదు.

OTT Suggestions- Best Series The Serpent Queen: ఓటీటీలో ఒక మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సిరీస్ ఒకసారి ట్రై చేయండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇందులో ఉండే రాణిని చూశాక.. మీకు హిట్లరే కాస్త నెమ్మదస్తుడు అనిపించకమానదు.

హిట్లర్ కు మించిన క్రూరమైన రాణి.. OTTలో ఈ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు!

ఓటీటీలు వచ్చిన తర్వాత రోజుకో సినిమా చూసే అలవాటు పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే కొందరు మాత్రం రోజూ సినిమాలు కాకుండా.. ఒక వెబ్ సిరీస్ ని సెలక్ట్ చేసుకుని దానినే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక మంచి వెబ్ సిరీస్ ని ఎంచుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశాక నచ్చకపోతే బాగా నిరాశ చెందాల్సి వస్తుంది. అయితే ముందుగా ఒక వెబ్ సిరీస్ అనుకుంటే దాని ఐఎండీబీ రేటింగ్ చూడాలి. ఆ తరవాత ట్రైలర్ చూడాలి. అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే.. నిరభ్యంతరంగా సిరీస్ స్టార్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ లేకుండా.. మీకోసం ఒక బెస్ట్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం. మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే ఆపలేరు.

ఒక వెబ్ సిరీస్ కథను చెప్పేందుకు చాలానే మార్గాలు ఉంటాయి. అంటే ఆ కథ స్క్రీన్ ప్లే ఎలా రాస్తున్నాం అనే దాని గురించి. అయితే ఈ డైరెక్టర్ మాత్రం ఎంతో అద్భుతంగా ఈ కథ స్క్రీన్ ప్లే రాసుకొచ్చాడు. ఈ సిరీస్ మొత్తాన్ని ఎంగేజింగ్ చేసేది ఆ కథనమే. ప్రెజెంట్ నుంచి పాస్ట్ కు తీసుకెళ్లడం.. ప్రధాన పాత్రతో తన కథను తానే చెప్పుకునేలా చేయడం. ఫలానా 1800ల సంవత్సరంలో ఒక రాజు నన్ను హేళనే చేస్తే.. నేను రెండు ముక్కలు చేశాను అనే తరహాలో కథను నడిపించడం ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఈ రాణి పాత్రను చూస్తుంటే మీకు.. ఆ హిట్లరే కాస్త సౌమ్యంగా ఉండేవాడు కావచ్చు అనే అనుమానం కూడా కలుగుతుంది. రాణి పాత్రను అంత వైలెంట్ గా చూపిస్తారు.

తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అనే ధోరణి కలిగిన యువతి చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్తుంది. ఆ తర్వాత నుంచి జరిగేది చూసి ప్రజలే కాదు.. సామంతులు, మంత్రులు కూడా నోరెళ్లబెట్టేస్తారు. అయితే ఆమె జర్నీని మాత్రం ఎంతో ఇన్ స్పిరేషన్ గా తీసుకోవాలి. సాధారణంగా రాజు కుమార్తె అంటే ఆమెను మరో రాజ్యం కోసం పెళ్లి పేరిట ఎరగా వాడతారు. అలాంటి పరిస్థితుల నుంచి ఆ రాజ్యాన్ని ఆమె గుప్పెట్లోకి తెచ్చుకునే వరకు ఎన్నో ఎత్తులు, మరెన్నో సాహసాలు చేస్తుంది. ఈ గ్యాప్ లో ఆమె తంత్రాలు, మంత్రాలు కూడా నేర్చుకుంటుంది. మొత్తాన్ని రాజ్యాన్ని, రాజ్యంలో ఉండే ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇలా ఆ రాణి తన జర్నీ మొత్తాన్ని తన కొత్త చెలికత్తెకు వివరిస్తూ ఉంటుంది. ఈ సిరీస్ పేరు “ది సర్పెంట్ క్వీన్” ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే లైన్స్ గేట్ సబ్ స్క్రిప్షన్ ఉంటేనే ఈ సిరీస్ ని చూడగలరు. ఈ సిరీస్ ని ఫ్రీగా చూసేందుకు క్లిక్ చేయండి.