iDreamPost
android-app
ios-app

OTTలో బూ*తులేని రొమాంటిక్ సిరీస్! పిల్లలతో కలిసి మాత్రం చూడకండి!

  • Published Apr 25, 2024 | 5:45 PM Updated Updated Apr 25, 2024 | 5:45 PM

OTT Suggestions: ఓటీటీలో అది కూడా తెలుగులో చాలా మంచి వెబ్ సిరీస్లు ఉన్నాయి. కానీ, చాలామందికి అవి ఉన్నాయని తెలియదు అంతే. అలాంటి వారి కోసం ఒక బెస్ట్ రొమాంటింక్, కామెడీ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

OTT Suggestions: ఓటీటీలో అది కూడా తెలుగులో చాలా మంచి వెబ్ సిరీస్లు ఉన్నాయి. కానీ, చాలామందికి అవి ఉన్నాయని తెలియదు అంతే. అలాంటి వారి కోసం ఒక బెస్ట్ రొమాంటింక్, కామెడీ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

  • Published Apr 25, 2024 | 5:45 PMUpdated Apr 25, 2024 | 5:45 PM
OTTలో బూ*తులేని రొమాంటిక్ సిరీస్! పిల్లలతో కలిసి మాత్రం చూడకండి!

ఓటీటీలో చాలా చాలా వెబ్ సిరీస్లు చూశారు కదా? వాటిలో ఒక వెబ్ సిరీస్ చూశాక.. అబ్బో కడుపు చక్కలైంది అని ఎప్పుడైనా అనుకున్నారా? చాలా తక్కువ కేసుల్లో మాత్రమే మీకు ఆ తరహా భావన కలుగుతుంది. కామెడీ ఉండే సినిమాలు అయితే చాలానే చూసుంటారు. కానీ, ఒక వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అల్లాడించే కామెడీని అందించడం మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. కానీ, ఇది ఓన్లీ కామెడీ మాత్రమే కాదు.. ఇందులో రొమాన్స్, రొమాంటిక్ సీన్స్, అడల్ట్ జోక్స్ కూడా చాలానే ఉంటాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ని మీరు చూడకపోతే గనుక.. ఈ వెబ్ సిరీస్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇది వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది.

మీకు తెలుగు ఓటీటీలో చాలా అంటే చాలా ఫ్రెష్, ఫీల్ గుడ్ కంటెంట్ అందుబాటులో ఉంది. కాకపోతే ఓటీటీ ప్రోక్షకులు వెతుక్కోవడం తెలియక కొన్ని కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లను లైట్ తీసుకుంటున్నారు. అందుకే మీకోసం ఒక మంచి బోల్డ్, బెస్ట్ కామెడీ, ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ వెబ్ సిరీస్ పేరు ‘హనీమూన్’ ఇది 2020లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల నుంచి 29 నిమిషాల వరకు ఉంటుంది. కథ మొదలైనప్పటి నుంచి శుభం కార్డు పడే వరకు మీరు కడుపుబ్బా నవ్వుకుంటారు. అలాగే ఒక మంచి వెబ్ సిరీస్ చూశామనే ఫీలింగ్ కి వస్తారు.

ఇది నిజంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కూడా. ఒక వ*ర్జిన్ కుర్రాడు.. ఒక అందమైన అమ్మాయిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటాడు. అయితే తన వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. భార్యను హనీమూన్ కి కూడా తీసుకెళ్తాడు. అయితే అతనికి అనుకోని సమస్య ఎదురవుతుంది. భార్య దగ్గరవ్వాలని చూసినా.. తనపై తనకు ఉన్న అనుమానంతో ఆమెను దగ్గరకు తీసుకోడు. ఎక్కడ తన వల్ల భార్య నిరాశ పడుతుందో అనే కంగారు ఉంటుంది. అతను ఒకానొక సమయంలో తప్పుడు మార్గంలోకి కూడా వెళ్తాడు. కానీ, తిరిగి తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చేస్తాడు.

ఈ మూవీలో ఎలాంటి బూ*తు లేకుండా.. స్వచ్ఛమైన కామెడీతో తీసిన మూవీ. అయితే కుటుంబం మొత్తం కలిసి చూడటం కంటే.. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చూడటం కాస్త బెటర్ అనే చెప్పాలి. అయితే ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు మంచి మెసేజ్ కూడా అవుతుంది. చాలా మంది ఫస్ట్ నై*ట్ విషయంలో కాస్త కంగారుగా ఉంటారు. కొందరు మిత్రులు, బంధువులు ఏవేవో చెప్పారని మిస్ గైడ్ అవుతారు. అలాంటి వాళ్లు కూడా ఒకసారి ఈ మూవీ చూడచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ కి ఈ మూవీని ప్లాన్ చేసేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom