iDreamPost
android-app
ios-app

అద్దెకి బాయ్ ఫ్రెండ్.. OTTలో ఇలాంటి బోల్డ్ మూవీనా? తెలుగులో మొదటిసారి!

OTT Suggestions- Best Romantic Love Story: ఓటీటీలో మీరు మంచి లవ్ స్టోరీ కోసం చూస్తుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. పైగా ఇది ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

OTT Suggestions- Best Romantic Love Story: ఓటీటీలో మీరు మంచి లవ్ స్టోరీ కోసం చూస్తుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. పైగా ఇది ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అద్దెకి బాయ్ ఫ్రెండ్.. OTTలో ఇలాంటి బోల్డ్ మూవీనా? తెలుగులో మొదటిసారి!

మీరు తెలుగులో ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసుంటారు. వాటిలో చాలా విభిన్నమైన కథలు, మలుపులు ఉంటాయి. కానీ, చాలా కొద్ది మూవీస్ లోనే అరే భలే కాన్సెప్ట్ తో వచ్చార్రా? అనిపిస్తుంది. అలాంటి ఒక మూవీ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ నిజంగా మీకు కాస్త కంగారు పుట్టుస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందా అనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రస్తుతం బయట ఇలాంటి కొన్ని విషయాలను చూస్తూ ఉండచ్చు. అది నిజ జీవితంలో కూడా జరిగి ఉండచ్చు. కానీ, ఒక మూవీ రూపంలో మాత్రం మీరు ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ మూవీ చూసుండరు. నిజానికి ఎప్పటి నుంచో ఓటీటీలో ఉన్నా కూడా చాలా తక్కువ మంది మాత్రమే చూశారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న సినిమా పేరు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ గురించి. ఈ మూవీ 2022 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ కాన్సెప్ట్ ని కాసేపు ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ని అద్దెకు తీసుకోవడం జపాన్ లాంటి దేశాల్లో ఉంది గానీ.. ఇండియాలో మాత్రం ఇంకా అంత ట్రెండ్ రాలేదు. కానీ, రేండేళ్ల క్రితమే ఆ కాన్సెప్ట్ తో సినిమా కూడా తీసేశారు. అయితే ఆ మూవీకి తెలుగు ప్రేక్షకులు అంత అటెన్షన్ ఇవ్వలేదు. టైటిల్ చూసి ఏ సర్టిఫికేట్ చిత్రం అనుకుని కంగారు పడకండి. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U సర్టిఫికేషన్ ఇచ్చింది. ఇంటిల్లిపాది చక్కగా కూర్చుని ఈ మూవీని చూసేయచ్చు.

అయితే బోల్డ్ ఎందుకు అన్నారు అనేగా మీ ప్రశ్న? ఏం లేదు.. కాన్సెప్ట్ మాత్రం కాస్త బోల్డ్ గానే ఉంది. వెనుకటి వాళ్లు ఈ పద్ధతికి కాస్త ఇబ్బంది పడచ్చు. అయితే ఇది ఒక మంచి లవ్ స్టోరీ. తనకు పర్ఫెక్ట్ అమ్మాయి కావాలి అని వెతుక్కునే ప్రాసెస్ లో మన హీరో ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ కి తెర లేపుతాడు. తాను చేసుకునే అమ్మాయి కూడా తనలాంటి ఒక ఐడియాలజీ, థింకింగ్ తో ఉండాలి అని అనుకుంటాడు. అన్ని మూవీస్ లో లాగానే ఇందులో కూడా హీరో, హీరోయిన్ ఇద్దరూ భిన్న ధృవ్వాల్లాంటి వాళ్లు. ఒకరికి ఒకరు అంటే పొంతనలేని మైండ్ సెట్స్ తో ఉంటారు. మరి.. వాళ్లు ఎలా కలిశారు. వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? హీరోకి పెళ్లి చేయాలి అనుకున్న ఫ్యామిలీ కోరిక తీరిందా? అనే విషయాలు తెలియాలంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ మూవీ చూడాల్సిందే.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet