iDreamPost
android-app
ios-app

18 ఏళ్లలో దీన్ని కొట్టే మిస్టరీ థ్రిల్లర్ రాలేదు.. OTTలో ఉంది చూశారా?

OTT Suggestions- Best Mystery Thriller: మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఇష్టమున్న వారికి ఇది మస్ట్ వాచ్ మూవీ అనే చెప్పాలి. ఒక్కో సీన్ కి.. ఒక్కో షాట్ కి పిచ్చెక్కిపోతారు. 18 ఏళ్లలో ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ రాలేదు అంటే మీరే అర్థం చేసుకోవాలి.

OTT Suggestions- Best Mystery Thriller: మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఇష్టమున్న వారికి ఇది మస్ట్ వాచ్ మూవీ అనే చెప్పాలి. ఒక్కో సీన్ కి.. ఒక్కో షాట్ కి పిచ్చెక్కిపోతారు. 18 ఏళ్లలో ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ రాలేదు అంటే మీరే అర్థం చేసుకోవాలి.

18 ఏళ్లలో దీన్ని కొట్టే మిస్టరీ థ్రిల్లర్ రాలేదు.. OTTలో ఉంది చూశారా?

మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో? ఎందుకంటే ఆ మూవీస్ చూస్తుంటే మనల్ని మనం మర్చిపోతాం. మరో లోకంలోకి వెళ్లిపోతాం. అంతేకాకుండా తర్వాత ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ మనల్ని సీటు అంచుకు తీసుకొస్తుంది. అందుకే చాలామంది ఆడియన్స్ ఈ మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడతారు. అయితే ఎప్పటినుంచో ఓటీటీలో ఒక సూపర్ క్రేజీ మిస్టరీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, మన ఆడియన్స్ కి ఆ మూవీ గురించి తెలియక లైట్ తీసుకుంటున్నారు. అందుకే మీకోసం వెలికితీసి మరీ ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. గత 18 ఏళ్లల్లో ఈ మూవీని మించిన మిస్టరీ థ్రిల్లర్ రాలేదు అంటేనే అర్థం చేసుకోవాలి ఆ సినిమా స్టామినా ఏంటో?

సాధారణంగా ఓటీటీలు ఎక్కువ అయిన తర్వాత ఏదో ఒక సినిమా చూద్దాంలే టైమ్ పాస్ కావడానికి అనుకునేవాళ్లు ఎక్కువ అయ్యారు. కానీ, ఓటీటీల్లో హిడెన్ జెమ్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఈ మూవీ మొత్తం మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, హత్యలు వంటి పాయింట్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ పనులు ఎవరు చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. అంతేకాకుండా అవి కేవలం హత్యలు మాత్రమే కాదు.. బలిదానాలు. అసలు అదంతా ఎందుకు జరుగుతోంది? అనే విషయాన్ని కనిపెట్టడం పోలీసులకు కూడా అర్థం కాదు.

 

పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఫెయిల్ అయిన తర్వాత ఒక డిటెక్టివ్ హెల్క్ కోరతారు. నిజానికి ఆ డిటెక్టివ్ కి కూడా అంతు చిక్కని రహస్యాలు చాలానే ఉంటాయి. అయితే హత్య జరిగిన ప్రదేశంలో ఇన్విసిబిల్ ఇంక్ తో చాలా రాతలు రాసి ఉంటాయి. అవన్నీ అర్థంకాకుండా ఉంటాయి. వాటిని క్రాక్ చేయడానికి ఈ డిటెక్టివ్ సాయం కోరతారు. కానీ, విచిత్రం ఏంటంటే.. ఈ కేసు టేకప్ చేసిన దగ్గరి నుంచి ఆ డిటెక్టివ్ ప్రాణాలు డేంజర్లో పడిపోతాయి. ఒక పెద్ద గ్యాంగు ఇతని వెనుక పడుతుంది. అసలు ఆ కోడ్ ఏంటి? అది హత్యా? ఆత్మహత్యా? బలిదానమా? అనే పాయింట్ ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ని పెంచేస్తుంది.

ఈ సినిమాలో ఎన్నో చిక్కుముడులు ఉంటాయి. వాటిని విప్పడంలో డిటెక్టివ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. అలాగే ఈ మూవీలో చాలానే ఇంపార్టెంట్ పాత్రలు ఉంటాయి. అసలు అక్కడ జరుగుతోంది? ఎవరు ఇదంతా చేస్తున్నారు? అనే ఉత్సుకత మిమ్మల్ని చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఈ సినిమా పేరు ‘ది డా విన్సీ కోడ్‘. ఈ మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చాలానే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే సబ్ స్క్రిప్షన్ మీద చూడచ్చు. మిగిలిన వాటిల్లో మాత్రం రూ.69కు రెంట్ కి తీసుకుని చూడాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి