iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ మూవీ.. కాంప్రమైజ్ లైవ్ లీడ్ చేస్తున్న వారు తప్పకచూడాలి!

OTT Suggestions- Best Movie Tumse na Ho payega: ఓటీటీలో ఈ మూవీ చూస్తుంటే.. మిమ్మల్ని మీరే చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మన దేశంలో అంతా కాంప్రమైజ్ అయ్యే జీవిస్తున్నారు. అందుకే అందరికీ ఈ మూవీ సింక్ అవుతంది.

OTT Suggestions- Best Movie Tumse na Ho payega: ఓటీటీలో ఈ మూవీ చూస్తుంటే.. మిమ్మల్ని మీరే చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మన దేశంలో అంతా కాంప్రమైజ్ అయ్యే జీవిస్తున్నారు. అందుకే అందరికీ ఈ మూవీ సింక్ అవుతంది.

OTTలో క్రేజీ మూవీ.. కాంప్రమైజ్ లైవ్ లీడ్ చేస్తున్న వారు తప్పకచూడాలి!

మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేంటంటే చదివిన చదువు ఒకటి.. తీసుకున్న ట్రైనింగ్ మరొకటి.. చేసే జాబ్ ఇంకొకటి. అలా చేయడానికి సవాలక్ష కారణాలు ఉండచ్చు. కానీ, మెజారిటీ వాళ్ల సంగతి మాత్రం ఇదే. చాలామంది తమ జీవితాలను కాంప్రమైజ్ అయ్యే జీవిస్తున్నారు. దాదాపు అనే బదులు అందరూ అన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే నచ్చిన జీవితాన్ని లీడ్ చేసే వాళ్లు మన సొసైటిలే చాలా అరుదుగా ఉంటారు. ఏదో ఒక పాయింట్ లో వాళ్లు తల్లిదండ్రులు, పిల్లలు, భార్య/భర్త, ప్రియురాలు/ప్రియుడు, ఆర్థిక సమస్యలు ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు వారి జీవితాలను కాంప్రమైజ్ అయ్యే బతుకుతున్నారు. ఈ మూవీ అలాంటి పాయింట్ తోనే వచ్చింది.

మనం ఎవరినీ ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడగాల్సిన పని లేదు. మీ ఉద్యోగం మీకు నచ్చిందా? అని ఎందుకంటే చక్కగా ఉద్యోగం చేసుకోవాలి అని ఎవరికీ ఉండదు. అందరికీ తమకంటూ సొంతంగా ఒక బిజినెస్ ఉండాలి. ఒక మంచి ఆదాయం ఉండాలి. మన మీద ప్రశ్నించే వాళ్లు ఉండొద్దు అనే కోరికలే ఉంటాయి. ఈ అన్ని కోరికలు మన హీరోకి ఉన్నాయి. అన్నింటికీ మించి జీవితంలో ఏదో సాధించాలి అనే లక్ష్యం ఉంది. కానీ, దానికి తగిన తోడ్పాటు మాత్రం ఉండదు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వతా ఉద్యోగం లేని మగాడిని ఈ సమాజం చేతకాని వాడిలా చూస్తుంది. సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలి అంటే దానికి ముందు కుటుంబాన్ని కన్విన్స్ చేసుకోవడమే పెద్ద సమస్యగా మారుతుంది.

ఈ సినిమాలో హీరో తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా అస్సలు జీవించడు. ఎప్పుడూ తల్లి కోసం జాబ్ చేయడం, జాబ్ చేయకపోతే ఏమనుకుంటారో అని చేయండ, జీతం కోసం మాత్రమే పని చేయడం. ఇష్టం లేకపోయినా కూడా గానుగకు కట్టిన ఎద్దులా తిరుగుతూ ఉంటాడు. ఒకానొక సమయంలో ఉద్యోగం గురించి వాష్ రూమ్ లో నోరు జారి బాస్ కి దొరికిపోతాడు. ఇంకేముందు ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలి అని ఫిక్స్ అవుతాడు. కానీ, అక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది.

అసలు హీరోకి ఉన్న సమస్య ఏంటి? అసలు అతను ఏ వ్యాపారం స్టార్ట్ చేశాడు? అతడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అతని వ్యాపారం మీద ఎందుకు బడా బడా కంపెనీలు కన్నెర్ర చేశాయి? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే వాటిని హీరో ఎదుర్కొన్న తీరు కూడా మెప్పిస్తుంది. కానీ, చాలా సీన్స్ లో ఎవరిని వాళ్లు ఆ పాత్రలో ఊహించుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంది. పైగా ఈ మూవీ ఓటీటీలో మోస్ట్ వాచ్డ్ మూవీగా కూడా ఉంది. ఈ సినిమా పేరు ‘తుమ్ సే నా హోపాయెగా‘. అంటే తెలుగోల ‘నీ వల్ల కాదు’ అని. ఈ మాట మీరు కూడా విన్నారా? అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ చూసేయండి. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.