iDreamPost
android-app
ios-app

ఆ OTTలో బోల్డ్ కంటెంట్ మూవీ.. ఎగబడి చూస్తున్నారు!

OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, కొన్నింటికి మాత్రం ఆడియన్స్ నుంచి తెగ రెస్పాన్స్ వస్తుంది. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. వారం నుంచి తెగ ట్రెండింగ్ అవుతోంది.

OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, కొన్నింటికి మాత్రం ఆడియన్స్ నుంచి తెగ రెస్పాన్స్ వస్తుంది. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. వారం నుంచి తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఆ OTTలో బోల్డ్ కంటెంట్ మూవీ.. ఎగబడి చూస్తున్నారు!

అన్ని జానర్స్ లాగానే బోల్డ్ కంటెంట్ కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో అంటే ఎవరికీ తెలియకుండా థియేటర్లలో.. రోజులో ఒకసారి వేసే ఆటకోసం ఎగబడి చూసేవాళ్లు. ఇప్పుడు ఆ కష్టాలు లేకుండా ఓటీటీల్లో కూడా అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నిజానికి ఏ సర్టిఫికెట్, రొమాన్స్ అంటూ ఓటీటీల్లో క్యాటగిరీలు కూడా ఉంటాయి. అయితే తెలుగులో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఓటీటీలో ఆ బోల్డ్ కంటెంట్ సినిమా వారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఒక్క స్ట్రీమింగ్ మాత్రమే కాదు.. టాప్ 1లో కొనసాగుతోంది. వాళ్లు చేసిన ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే సినిమా స్ట్రీమిగ్ మొదలైనప్పటి నుంచి తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే ఇన్నిసార్లు బోల్డ్ అంటున్నాం అని తీసిపారేయకండి. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం కూడా మంచి సందేశం ఇవ్వడమే. ఒక్కోసారి మంచిని చెప్పడానికి కూడా కాస్త బోల్డ్ మార్గాన్ని ఎంచుకోక తప్పదు. నిజానికి వీళ్లు కొత్తగా చూపించింది ఏం లేదు. ప్రస్తుతం సమాజంలో జరిగినవి, జరుగుతున్నవే ఒక సినిమాగా తీశారు. వాస్తవానికి యధార్థ ఘటనల ఆధారంగా అని పెట్టినా పెద్ద తప్పేం ఉండదు. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, కట్టుకున్న వారిని మోసం చేయడం చూస్తున్నాం. ప్రేమ అంటే కేవలం శారీరక సుఖం అనుకునేవాళ్లు కోకొల్లలు.

భార్య అంటే ఇంటి పని, వంట పని, ఒంటి పని కోసం మాత్రమే ఉంది అనుకునే ప్రబుద్ధులు కూడా చాలా మందే ఉన్నారు. క్షణిక సుఖాల కోసం జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఒక కథకి సినిమా రూపం ఇచ్చి కాస్త ఘటుగా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాకి బోల్డ్ కంటెంట్ అని ట్యాగ్ దక్కింది. ఇంక ఈ సినిమా మరేదో కాదు.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మిక్సప్ అనే సినిమా గురించి. ఆహా ఒరిజినల్స్ గా ఈ సినిమాని ప్రక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

గత వారం నుంచి ఈ సిరీస్ ఆహాలో టాప్ 10లో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. పేరుకి A సర్టిఫికేట్ అయినా కూడా ఈ మూవీ టేకింగ్, మెసేజ్ నేపథ్యంలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పైగా ఇందులో హైలెట్ చేసిన కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. విపరీతమైన శృoగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ తో అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించారు. మరి.. మిక్సప్ సినిమా మీరు గనుక చూస్తే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis