iDreamPost
android-app
ios-app

దుల్కర్ కెరీర్లో ఉన్న ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. OTTలో ఉంది చూశారా?

  • Published Jul 06, 2024 | 6:00 AM Updated Updated Jul 06, 2024 | 6:00 AM

OTT Suggestions- Best Love Story Vaayai Moodi Pesavum: మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూసి చాలారోజులు అవుతోంది అని బాధ పడుతున్నారా? అయితే మీకోసం ఒక బెస్ట్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. పైగా ఇది దుల్కర్ కెరీర్లో బెస్ట్ లవ్ స్టోరీ కూడా.

OTT Suggestions- Best Love Story Vaayai Moodi Pesavum: మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూసి చాలారోజులు అవుతోంది అని బాధ పడుతున్నారా? అయితే మీకోసం ఒక బెస్ట్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. పైగా ఇది దుల్కర్ కెరీర్లో బెస్ట్ లవ్ స్టోరీ కూడా.

  • Published Jul 06, 2024 | 6:00 AMUpdated Jul 06, 2024 | 6:00 AM
దుల్కర్ కెరీర్లో ఉన్న ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. OTTలో ఉంది చూశారా?

మీరు ఓటీటీలో లవ్ స్టోరీలు బాగా చూస్తారా? అయితే ఇటీవలి కాలంలో ఒక మంచి లవ్ స్టోరీ రాలేదు కదా? మరి.. ఏం మూవీస్ చూస్తున్నారు అని ఓటీటీ ప్రేక్షకులను అడిగితే కాలక్షేపం కోసం ఏవో యాక్షన్, థ్రిల్లర్స్ చూస్తున్నాం అంటున్నారు. అందుకే వారికోసం ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. నిజానికి ఈ మూవీ వచ్చి కొన్నేళ్లు అవుతోంది. కానీ, ఇప్పటికీ సినిమా చూస్తే మాత్రం వావ్ అంటారు. అంతేకాకుండా.. అందులో హీరోగా చేసింది దుల్కర్ సల్మాన్. దుల్కర్ కెరీర్ లో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఇది. పైగా ఇందులో హీరోయిన్ గా చేసింది నజ్రీయా నజీమ్. ఇంకేం కావాలి అంత మంచి కాంబో ఉన్న తర్వాత.

దుల్కర్ సల్మాన్ కు పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా కల్కిలో కీ రోల్ ప్లే చేసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ కూడా చేశాడు. అలాగే నజ్రీయా నజీమ్ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు తెలుగులో కూడా అభిమానులు చాలామందే ఉన్నారు. సీన్ లో కేవలం కళ్లతో యాక్ట్ చేయగల స్పెషల్ టాలెంట్ ఆమె సొంతం. ఇలాంటి కాంబోలో వచ్చిన ఒక మంచి లవ్ స్టోరీని మీరు ఎలా మిస్ అయ్యారు? నిజానికి ఈ మూవీ వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. కానీ, మీరు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ల యాక్టింగ్, స్టోరీ, కామెడీ, ప్రేమలకు కచ్చితంగా వావ్ అంటారు.

ఈ సినిమాలో నజ్రీయా నజీమ్ ఒక జూనియర్ డాక్టర్ గా చేస్తూ ఉంటుంది. హీరో గారు ఒక సేల్స్ మ్యాన్ గా చేస్తూ ఉంటాడు. అన్ని లవ్ స్టోరీల్లో లాగానే హీరో హీరోయిన్ ని ప్రేమలో పడేయటం పనిగా పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. జూనియర్ డాక్టర్ కు ఆల్రెడీ ప్రియుడు ఉంటాడు. అతను ఆమె జీవితాన్ని బాగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలియక మన హీరో ఆమెను ప్రేమలో పడేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకోసం జూనియర్ డాక్టర్ దగ్గర సూదులు కూడా పొడిపించుకుంటాడు. అలా ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. మరి.. ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? హీరోయిన్ దుల్కర్ సల్మాన్ ని ప్రేమిస్తుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి.. ఈ క్యూట్ లవ్ స్టోరీ తెలియాలి అంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో చూడాల్సిందే. ఈ సినిమా పేరు వాయి ముడు పేసవుం. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş