iDreamPost
android-app
ios-app

ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ.. OTTలో క్రేజీ లవ్ స్టోరీ!

OTT Suggestions- Portrait Of A Lady On Fire Movie: ఓటీటీల్లో మీరు కొన్ని ప్రేమకథలు చూసే ఉంటారు. అయితే ఇది మాత్రం రొటీన్ కి భిన్నంగా ఉండే ప్రేమకథ. ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే కథ.

OTT Suggestions- Portrait Of A Lady On Fire Movie: ఓటీటీల్లో మీరు కొన్ని ప్రేమకథలు చూసే ఉంటారు. అయితే ఇది మాత్రం రొటీన్ కి భిన్నంగా ఉండే ప్రేమకథ. ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే కథ.

ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ.. OTTలో క్రేజీ లవ్ స్టోరీ!

ప్రేమ అనేది ఒక వింత అనుభూతి. ఇది ఎప్పుడు, ఎవరి మీద, ఎందుకు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. గతంలో అంటే ప్రేమ అబ్బాయి- అమ్మాయి మధ్య పుడుతుంది అనుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి అందరూ తమ తమ ఇష్టాలను ఓపెన్ గానే వ్యక్త పరుస్తున్నారు. అలాగే అబ్బాయిలు- అబ్బాయిలు.. అమ్మాయిలు- అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి ఒక అదృష్టంలేని జంట గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఇలాంటి ఒక క్రేజీ లవ్ లైన్ తోనే ఈ మూవీ వచ్చింది. అసలు ఆ మూవీలో అంత కొత్తగా ఏం ఉంది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఈ మూవీ ఇద్దరు అమ్మాయిల జీవితాల ఆధారంగా నడుస్తూ ఉంటుంది. మూవీ మొత్తం కూడా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అయితే ఆమె చిత్రపటం నచ్చితేనే పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ, హీరోయిన్ చిత్ర పటం గీయించుకోవడానికి అంగీకరించదు. ఆమె ముఖాన్ని గీయడానికి అస్సలు ఒప్పుకోదు. ఒక చిత్రం అలాగే ముఖం లేకుండా ఉండిపోతుంది. ఆ టాస్కును రెండో హీరోయిన్ తన భుజానికి ఎత్తుకుంటుంది. హీరోయిన్ చిత్రపటాన్ని గీసేందుకు ముందుకు వస్తుంది. ఆమె ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి హీరోయిన్ ఉండే ఐల్యాండ్ కు చేరుకుంటుంది. అయితే తాను చిత్రపటం గీయడానికి వచ్చాను అని చెప్పదు. హీరోయిన్ తో కాస్త చనువుగా, ఆమెతో మంచి ఫ్రెండ్ గా పరిచయం పెంచుకుంటూ వస్తుంది. ఆ తర్వాత ఆమె చిత్ర పటాన్ని గీయడం స్టార్ట్ చేస్తుంది.

అలా హీరోయిన్ కి తెలియకుండా గీయాలి అనేదే తనకు ఇచ్చిన టాస్క్. ఆ టాస్కులో ఎలాగైనా విజయం సాధించాలి అని ఆమె హీరోయిన్ చిత్రపటాన్ని గీయడం స్టార్ట్ చేస్తుంది. అయితే కొన్నాళ్లకు ఆ ఇద్దరు అమ్మాయిల మధ్య కాస్త స్నేహం ముదురుతుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు ఆరాధించడం స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్లిద్దరు హద్దులు కూడా దాటేస్తారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను మరో విధంగా చూపించుకోవడం స్టార్ట్ చేస్తారు. అయితే వారి ప్రేమను పెద్దలు అంగీకరిస్తారా? ఇంతకీ పెళ్లి చిత్ర పటాన్ని ఈమె గీయగలిగిందా? అసలు వారి రిలేషన్ పై వారికి అయినా క్లారిటీ ఉందా? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ “పోట్రెయిట్ ఆఫ్ ఏ లేడీ ఆన్ ఫైర్” చిత్రం చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఈ మూవీని చూసేందుకు క్లిక్ చేయండి.

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş