iDreamPost
android-app
ios-app

చీట్ చేసిన భార్యపై పుస్తకం రాసిన భర్త.. OTTలో రేర్ థ్రిల్లర్!

  • Published Jun 19, 2024 | 6:10 PM Updated Updated Jun 19, 2024 | 6:10 PM

OTT Suggestions- Best Love Story On Netflix: మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే మీకు ఈ మూవీ సెట్ కాదు. ఎందుకంటే ఇందులో భర్తను మోసం చేసే భార్య ఉంటుంది. అలాగే ఆమెకు బుద్ధి చెప్పే భర్త ఉంటాడు. కథ మాత్రం వావ్ అనిపిస్తుంది.

OTT Suggestions- Best Love Story On Netflix: మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే మీకు ఈ మూవీ సెట్ కాదు. ఎందుకంటే ఇందులో భర్తను మోసం చేసే భార్య ఉంటుంది. అలాగే ఆమెకు బుద్ధి చెప్పే భర్త ఉంటాడు. కథ మాత్రం వావ్ అనిపిస్తుంది.

  • Published Jun 19, 2024 | 6:10 PMUpdated Jun 19, 2024 | 6:10 PM
చీట్ చేసిన భార్యపై పుస్తకం రాసిన భర్త.. OTTలో రేర్ థ్రిల్లర్!

ప్రస్తుతం సమాజంలో మనం బాగా వింటున్న మాట చీటింగ్. భర్తను భార్య, భార్యను భర్త మోసం చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రేమ అనే ఒక బంధంలో ఉన్నా కూడా ఎంతోమంది మోసాలకు గురవుతున్నారు.. ఇంకొంత మంది చిన్న చిన్న అవసరాల కోసం ప్రేమను అడ్డుగా పెట్టుకుని మోసం చేస్తున్నారు. అయితే అలాంటి ఒక పాయింట్ మీద వచ్చిందే ఈ సినిమా. అయితే మొత్తంగా అదే పాయింట్ మీద ఉంటుందా? అలా కాదు. తాను మోసం చేసిన మాజీ భర్త తిరిగి తన మీద ప్రతీకారం తీర్చుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో చూపిస్తారు. అలాగే తాను పడిన కష్టాలను ఒక పుస్తకంగా రాసి ఆమెకే అంకితం ఇవ్వడం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

సాధారణంగా ఈ రోజుల్లో సక్రమం కాని సంబంధాల గురించి వింటూనే ఉన్నాం. అలాంటి సంబంధాల వల్ల కాపురాలు, కుటుంబాలే కాదు.. సమాజం కూడా చెడిపోతోంది. ఇలాంటి సంబంధాల గురించి హాలీవుడ్ లో ఎప్పుడో సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక భర్తను ఒక భార్య చీట్ చేస్తుంది. ఆ విషయం తెలియక ఆమె మీద ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. తన భర్త ఎప్పటికీ తాను చేసే మోసాన్ని గుర్తించలేదు అనుకుంటుంది. కానీ, అలాంటి విషయాలు ఎక్కువరోజులు దాగవు కదా.. తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆమెను వదిలేస్తాడు. కానీ, ఆమె మాత్రం తాను చేసిన ద్రోహం నుంచి తప్పించుకోలేకుండా చేస్తాడు.

జీవితాంతం తాను చేసిన ఆ తప్పు గురించి కుమిలిపోయేలా చేస్తాడు. అతను ఒక పుస్తకం రాసి తన మాజీ భార్యకు అంకితం ఇస్తాడు. ఆ పుస్తకంలో అంతా బాధ, దుఃఖం, ఆవేదన ఉంటాయి. మానసికంగా అతను పడిన నరకయాతనను ఆమె అనుభవించేలా ఆ పుస్తకాన్ని రాస్తాడు. ఆ పుస్తకం దెబ్బకు ఆ మహిళ మానసికంగా ఎంతో కుంగి పోతుంది. తన భర్త మొదటి నుంచి మోసం, ద్రోహం చాలా డేంజర్ అని చెప్తూనే ఉంటాడు. కానీ, ఆమె మాత్రం తన భర్త చెప్పే మాటలను లెక్కచేయకుండా యధేచ్ఛగా మోసం చేస్తుంది. చివరకు అనుభవిస్తుంది. అది మాత్రమే కాకుండా.. ఈ మూవీలో చాలానే ట్విస్టులు ఉంటాయి. అలాగే మంచి సస్పెన్స్ స్టోరీ కూడా ఉంటుంది.

తన మాజీ భర్త రాసిన స్టోరీ చూశాక మీకు చీటింగ్ చేసే వ్యక్తులు అంటే విరక్తి పుడుతుంది. అలాగే అలాంటి ఆలోచనలు ఉన్న వారికి బతుకు మీద భయం పట్టుకుంటుంది. పార్టనర్ కి ద్రోహం తలపెట్టాలి అనే ఆలోచన కూడా రాదు. బయట ఉన్న ఎంతో మంది చీటింగ్ భర్తలు, చీటింగ్ భార్యలకు ఈ మూవీని కచ్చితంగా అంకితం ఇవ్వచ్చు. ఈ మూవీ పేరు ‘నాక్టుర్నల్ యానిమల్స్’. ఈ సినిమా పేరుకు అర్థం అర్ధరాత్రి తిరిగే జంతువులు అని. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో మాత్రం రెంట్ కి తీసుకోవాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş