iDreamPost
android-app
ios-app

ప్రేమలో మోసపోయారా? OTTలో ఈ మూవీ మీకు బాగా నచ్చేస్తుంది!

  • Published Jun 19, 2024 | 5:15 PM Updated Updated Jun 19, 2024 | 5:15 PM

OTT Suggestions- Best Love Story Movie: లవ్ స్టోరీలు ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన వారికి ఈ చిత్రం బాగా నచ్చేస్తుంది. తప్పకుండా చూడాలి కూడా.

OTT Suggestions- Best Love Story Movie: లవ్ స్టోరీలు ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన వారికి ఈ చిత్రం బాగా నచ్చేస్తుంది. తప్పకుండా చూడాలి కూడా.

  • Published Jun 19, 2024 | 5:15 PMUpdated Jun 19, 2024 | 5:15 PM
ప్రేమలో మోసపోయారా? OTTలో ఈ మూవీ మీకు బాగా నచ్చేస్తుంది!

ఓటీటీలు వచ్చిన తర్వాత సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ కేటగిరీలు తరహా బాగా డిమాండ్ ఉన్నది మాత్రం లవ్ స్టోరీలకే. ఈ లవ్ స్టోరీలు అలాంటివి ఇలాంటివి కూడా కాదు. అదిరిపోయే కథలు, కథనాలు, ట్విస్టులు, థ్రిల్స్ తో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక వింటేజ్ లవ్ స్టోరిని మీకోసం తీసుకొచ్చాం. ఇందులో కథ మాత్రమే కాదు.. వారి ప్రేమ, కథలో వచ్చే ట్విస్టులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. మీరు ఈ సినిమాతో ప్రేమలో పడిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మీకు ఇది బాగా నచ్చుతుంది కూడా. అది కూడా అలా ఇలా కాదు. మీరు ఈ మూవీకి ఫ్యాన్ అయిపోతారు. అంత కచ్చితంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఆ కథ అలా ఉంటుంది మరి.

ప్రేమకథలు ఇష్టపడే వారికి ఇది మంచి మూవీ అవుతుంది. పైగా ఇది ఇప్పటి కథ కాదు. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చినప్పటి ఒక గ్రామం.. అందులో ఒక అమాయకమైన ఆడపిల్ల కథ. ఆ అమ్మాయిని తెల్లదొర ఎలా ప్రేమించాడు. ఆమెను ఎలా ప్రేమలో పడేశాడు. ఆ తర్వాత ఆమెను ఎలా నయ వంచన చేశాడు.. అనే పాయింట్స్ తో నడుస్తూ ఉంటుంది. ఒక తెల్లదొర మన దేశానికి వస్తాడు. ఎక్కడో కొండల్లో మారుమూల ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. అక్కడకు వచ్చిన ఆ దొర ఊరిలో ఉన్న వారితో మంచిగా ఉంటూ.. అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉంటాడు.

BEfore The Rains

అలాగే అక్కడే ఉన్న మన్యం నుంచి ఒక అమ్మాయి దొర ఉండే ఇంట్లో పని మనిషిగా చేస్తూ ఉంటుంది. అలాగే మన్యంలో ఉండే ఒక యువకుడు ఆ దొరకు డ్రైవర్, బార్డీగార్డ్ గా చేస్తూ ఉంటాడు. ఇంట్లో పనులు చేసే ఆ అమ్మాయిని తన మాయ మాటలతో లోబరుచుకుంటాడు. ప్రేమ ఆశచూపి ఆమెను లొంగదీసుకుంటాడు. ఆమెతో కొన్నిరోజులు గడిపిన తర్వాత.. ఆ దొర అసలు రూపం తెలుస్తుంది. ఆ తెల్లదొరకు గతంలోనే వివాహం జరిగింది.. అతనికి పిల్లలు ఉన్న విషయం తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ డ్రైవర్ మొత్తుకుంటూనే ఉంటాడు. ఎందుకు ఆ దొరకు దగ్గరగా ఉంటున్నావ్ అని. ఆమె అతని మాటలను లెక్కచేయదు. కానీ, చివరకు ఫలితం అనుభవిస్తుంది.

అయితే ఆ దొర మన్యం ప్రజల మీద తిరగబడతాడు. వారిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ యువకుడు కూడా ఆ దొరకు వ్యతిరేకంగా మారతాడు. అతను కచ్చితంగా ఆ దొరను మట్టు పెడతాను అని శపథం చేస్తాడు. అలా ఈ సినిమా మొత్తం ప్రేమ, పగ, ప్రతీకారం, ద్రోహం, త్యాగం అనే పాయింట్స్ మీద ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా పేరు ‘బిఫోర్ ది రైన్స్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş