iDreamPost
android-app
ios-app

ఒక తప్పుడు నిర్ణయం.. ఇద్దరమ్మాయిల జీవితం.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

  • Published Jun 07, 2024 | 7:56 PM Updated Updated Jun 07, 2024 | 7:56 PM

OTT Suggestions- Best Thriller Love Story: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ సినిమాలు చూసేస్తున్నారు. కానీ, లవ్ స్టోరీలు అంటే మాత్రం పడి చచ్చిపోతారు. అలాంటి వారికి ఒక బెస్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి తీసుకొచ్చాం. ఇది మంచి థ్రిల్లర్ కూడా.

OTT Suggestions- Best Thriller Love Story: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ సినిమాలు చూసేస్తున్నారు. కానీ, లవ్ స్టోరీలు అంటే మాత్రం పడి చచ్చిపోతారు. అలాంటి వారికి ఒక బెస్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి తీసుకొచ్చాం. ఇది మంచి థ్రిల్లర్ కూడా.

  • Published Jun 07, 2024 | 7:56 PMUpdated Jun 07, 2024 | 7:56 PM
ఒక తప్పుడు నిర్ణయం.. ఇద్దరమ్మాయిల జీవితం.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

మీకు లవ్ స్టోరీ అంటే ఇష్టమా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే? ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ ట్విస్టులు, ఛేజింగ్లు అంటే ఇష్టమా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ ట్విస్టులు, ఛేజింగ్లు, యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇష్టమా? అయితే మీకోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఇది తెలుగు సినిమానే. అయితే చాలా మందికి ఈ మూవీ గురించి తెలియలేదు. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటూ ఉంటారు. మరో అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తూ వన్ సైడ్ లవర్ గా ఉంటుంది. ఇలా ఈ ముక్కోణపు ప్రేమకథ పెళ్లి దాకా వస్తుంది. మరి ఆ పెళ్లి జరిగిందా? అసలు ఏంటి ఈ లవ్ స్టోరీ చూద్దాం.

సాధారణంగా లవ్ స్టోరీలు అంటే మంచి సాంగ్స్, మంచి కాన్ ఫ్లిక్ట్, ఒక మంచి విలన్ ఉంటారు. అలా అలా కథ సాగిపోతూ ఉంటుంది. మధ్యలో కామెడీ, రొమా*న్స్ హైలెట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రేమకథ కూడా సాధారణ లవ్ స్టోరీల్లాగే ఉంటుంది. కానీ, వాటికి అదనంగా ట్రయాంగిల్ సీక్వెన్స్, యాక్షన్, ట్విస్టులు, అదిరిపోయే టర్నింగ్ పాయింట్లు ఈ సినిమాలో ఉంటాయి. పైగా ఈ సినిమాలో యాక్ట్ చేసింది టాలీవుడ్ యంగ్ హీరోనే. అతను ఇప్పటికే తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించేశాడు. ఈ మూవీలో కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు. అతని యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతారు.

ఇంక ఈ సినిమాలో ఒక పెళ్లి గురించి నలుగురు ఎదురుచూస్తూ ఉంటారు. హీరోని పెళ్లి చేసుకోవాలి అని వన్ సైడ్ లవర్ ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్లిద్దరికీ పెద్దలు పెళ్లి కూడా కుదురుస్తారు. ఆ పెళ్లి ఎలాగైనా తప్పించుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలి అని హీరో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంక వన్ సైడ్ లవర్ ని పెళ్లాడాలి అని మన విలన్ బ్రో తెగ ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా ఒక పెళ్లికోసం చాలామంది వారి వారి ప్రయత్నాలు చేస్తూ పోతుంటారు. అయితే హీరో మాత్రం తాను ప్రేమించిన పిల్లను చేసుకోవాలా? తనని ప్రేమించే పిల్లను పెళ్లి చేసుకోవాలా అని మల్లగుల్లాలు పడుతూ ఉంటాడు.

ఈ సినిమాలో అదనపు అట్రాక్షన్ ఇంకొకటి ఉంది. అదేంటంటే.. కమెడియన్ సత్య, హర్షా చెముడు కామెడీ అద్భుతంగా ఉంటుంది. పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకునే హీరోని ఆపేందుకు సత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. హర్షా చెముడు మాత్రం హీరోని తప్పించేసి సిటీ పంపేయాలని చూస్తూ ఉంటాడు. ఇలా వారి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సీరియస్ సిట్చువేషన్స్ లో సత్య చేసే కామెడీ మెప్పిస్తుంది. ఇలా ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ పేరు ‘తెల్లవారితే గురువారం’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మీరు ఈ సినిమా చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio