iDreamPost
android-app
ios-app

HYD మెట్రోలో ప్రేమ.. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా.. OTTలో బెస్ట్ లవ్ స్టోరీ!

  • Published Jul 02, 2024 | 10:10 PM Updated Updated Jul 02, 2024 | 10:10 PM

OTT Suggestions- Best Love Drama 8 AM Metro: మీకు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అని ఉంటే మాత్రం ఈ సినిమా ట్రై చేయండి. కాసేపు నవ్వుతారు, కాసేపు ఏడుస్తారు, ఇంకాసేపు ప్రశ్నల వర్షంలో తడిసిపోతారు.

OTT Suggestions- Best Love Drama 8 AM Metro: మీకు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అని ఉంటే మాత్రం ఈ సినిమా ట్రై చేయండి. కాసేపు నవ్వుతారు, కాసేపు ఏడుస్తారు, ఇంకాసేపు ప్రశ్నల వర్షంలో తడిసిపోతారు.

  • Published Jul 02, 2024 | 10:10 PMUpdated Jul 02, 2024 | 10:10 PM
HYD మెట్రోలో ప్రేమ.. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా.. OTTలో బెస్ట్ లవ్ స్టోరీ!

ఓటీటీల్లో ప్రేమకథలకు కొదవే ఉండదు. ఎక్కడ చూసినా మంచి మంచి లవ్ స్టోరీలు ఉంటూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అలాంటి ఒక బెస్ట్ లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాం. దీనిని బెస్ట్ అనాలి అంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రేమ ఇద్దరు పెళ్లైన వ్యక్తుల మధ్య సాగుతుంది. ఒకరికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. అయితే ఇందులో నెగిటివ్ గురించి పెద్దగా మాట్లాడుకోకపోతే ఒక మంచి ప్రేమకథ అవుతుంది. అలాగే సమాజానికి ఆలోచింపజేసే ఒక బెస్ట్ మెసేజ్ కూడా అవుతుంది. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఈ సినిమాలో చాలానే పాయింట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎంతో టాలెంట్ పెట్టుకుని ఇంట్లో హౌస్ వైఫ్స్ గా మిగిలిపోయినా ఎంతో మందికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా లీడ్ రోల్ ప్లే చేసిన హీరోయిన్ లో చాలా టాలెంట్ ఉంటుంది. ఆమె ఎంతో అద్భుతంగా కవితలు రాయగలదు. కానీ, ఆమె టాలెంట్ కేవలం వంటగదికి మాత్రమే పరిమితమైపోతుంది. తన కుటుంబం, పిల్లల స్కూల్, భర్త ఆఫీస్ ఇదే తన లోకం. ఉదయాన్నే లేవడం, పిల్లలను రెడీ చేయడం, భర్తకు లంచ్ బాక్స్ ఇవ్వడం అందరినీ పంపించడం. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ కాఫీ తాగి.. మళ్లీ తన పనులు స్టార్ట్ చేసుకోవడం. ఇదే తన లోకం.. అదే తాను చేసే డైలీ రొటీన్. గ్యాప్ దొరికినప్పుడు మాత్రం కవితలు రాస్తుంది.

అలాంటి ఒక గృహిణి డెలివరీ సమయంలో తన బంధువుల అమ్మాయికి తోడుగా ఉండేందుకు హైదరాబాద్ వస్తుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అలా రోజూ ఆస్పత్రికి ఇంటికి తిరిగే క్రమంలో ఆ మహిళకు మెట్రోలో ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. మొదట వారి మధ్య మాటలు కలుస్తాయి. వాళ్లు రోజూ ఉదయాన్నే 8 గంటలకు మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వారి మధ్య కొన్ని మాటలు, కొన్ని విషయాల్లో వాదనలు కూడా జరుగుతాయి. కానీ, వారి మధ్య ఒక తెలియని బంధం ఏర్పడుతుంది. ఎలాంటిది అంటే వారికి వేర్వేరు జీవితాలు, కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మర్చిపోతారు. తాము చేస్తోంది తప్పో.. ఒప్పో కూడా తెలియకుండా అయిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి బంధం అసలు ఎటు దారి తీసింది? అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న 8 ఏఎం మెట్రో సినిమా చూడాల్సిందే. ఈ మూవీలో జీ5లో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఫ్రీగా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet