iDreamPost
android-app
ios-app

అతనికి కోపం వస్తే విధ్వంసమే.. బెస్ట్ కొరియన్ సూపర్ హీరో మూవీ!

OTT Suggestions Best Korean Drama Psychokinesis: కొరియన్ సినిమాలు అంటే ఇష్టమా? అయితే ఈ కొరియన్ డ్రామా మీరు కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇది కొరియన్ సినిమాల నుంచి వచ్చిన బెస్ట్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి.

OTT Suggestions Best Korean Drama Psychokinesis: కొరియన్ సినిమాలు అంటే ఇష్టమా? అయితే ఈ కొరియన్ డ్రామా మీరు కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇది కొరియన్ సినిమాల నుంచి వచ్చిన బెస్ట్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి.

అతనికి కోపం వస్తే విధ్వంసమే.. బెస్ట్ కొరియన్ సూపర్ హీరో మూవీ!

కొరియన్ సినిమాలు అనగానే కచ్చితంగా అంతా ఏ లవ్ స్టోరీనో.. లేదా ఏదైనా యాక్షన్ థ్రిల్లరో అనుకుంటారు. కానీ, కొరియన్ మూవీస్ లో సూపర్ హీరో ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందులోనూ మ్యాజికల్ పవర్స్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, కొరియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక బెస్ట్ సూపర్ హీరో సైఫై ఫిల్మ్ ఒకటి ఉందని మీకు తెలుసా? మీకు తెలియకపోయినా పర్వాలేదు. ఈ సినిమా గురించి తెలుసుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం కష్టం. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ సినిమా కథ ఏంటి? అనే విషయాలు చూద్దాం.

కొరియన్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ సినిమాలు, సిరీస్లు చూస్తూనే ఉన్నారు. అందుకే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అన్నీ కొరియన్ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేయిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ఒక సూపర్ పవర్స్ ఉన్న కామన్ మ్యాన్ గురించి. అతనికి ఆ శక్తులు ఎలా వచ్చాయో కూడా ఎవరికీ తెలీదు. ముఖ్యంగా అతనికి కూడా తెలీదు. కానీ, అతనికి మాత్రం కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి. మార్వెల్ యూనివర్స్ లో ఉండే స్కార్లెట్ విచ్ తరహాలో ఇతను కూడా వస్తువులను గాల్లోకి ఎత్తి పడేయ గలడు. కార్లు, వస్తువులు ఏదైనా ఎత్తి పడేస్తాడు.

అతనికి కోపం వస్తే జైలు గోడలు కూడా ముక్కలైపోవాల్సిందే. అయితే తనకు ఉన్న సూపర్ పవర్స్ గురించి తనకు కావాల్సిన వాళ్లు కూడా నమ్మరు. అందుకని పబ్లిక్ లో తనకు ఉన్న శక్తులను చూపిస్తాడు. ఇంకేముంది.. పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేస్తారు. అయితే అక్కడి నుంచి తప్పించుకుంటాడు కూడా. కానీ, అతనికి కొత్త కష్టాలు వస్తాయి. ఇలా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా సాగుతూ ఉంటుంది. అయితే ఇందులో యాక్షన్ మాత్రమే కాదు.. ఎమోషన్, కామెడీ కూడా సమపాళ్లలోనే ఉంటాయి. ఈ మూవీ ఎప్పుడో ఓటీటీలోకి వచ్చింది. కానీ, చాలామందికి ఈ సినిమా గురించి తెలియదు అంతే. ఈ సినిమా పేరు ‘సైకోకినెసిస్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చూసిన తర్వాత మాత్రం వావ్ అంటారు. మరి.. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.