iDreamPost
android-app
ios-app

కొరియన్ సిరీస్లు ఇష్టమా? బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీ.. తెలుగులోనే!

  • Published Jun 12, 2024 | 7:49 PM Updated Updated Jun 12, 2024 | 7:49 PM

OTT Suggestions- Best Korean Drama Love Story: ఓటీటీలు వచ్చాక కే డ్రామాలకు డిమాండ్ పెరిగింది. అదే కొరియన్ సిరీస్లు. అందుకే మీకోసం ఒక బెస్ట్ కొరియన్ డ్రామా సిరీస్ తీసుకొచ్చాం. దీనిని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే సుమీ.

OTT Suggestions- Best Korean Drama Love Story: ఓటీటీలు వచ్చాక కే డ్రామాలకు డిమాండ్ పెరిగింది. అదే కొరియన్ సిరీస్లు. అందుకే మీకోసం ఒక బెస్ట్ కొరియన్ డ్రామా సిరీస్ తీసుకొచ్చాం. దీనిని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే సుమీ.

  • Published Jun 12, 2024 | 7:49 PMUpdated Jun 12, 2024 | 7:49 PM
కొరియన్ సిరీస్లు ఇష్టమా? బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీ.. తెలుగులోనే!

ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ సిరీస్లు చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు కొరియా సిరీస్లు చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇండియాలో ఉన్న సగం మంది అమ్మాయిలు ఈ కొరియన్ సిరీస్లు చూడటం మాత్రమే కాదు.. కొరియన్ లో కూడా మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ల అడిక్షన్ ఆ రేంజ్ లో ఉంటోంది. అలాంటి హార్డ్ కోర్ కొరియా సిరీస్ ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. అది కూడా ఆ సిరీస్ తెలుగులోనే ఉంది. మీరు సబ్ టైటిల్స్ వేసుకుని మరీ చూడాల్సిన అవసరం లేదు.చక్కగా తెలుగులో ఈ సిరీస్ ని ఎంజాయ్ చేయచ్చు.

కొరియా సిరీస్లకు బాగా డిమాండ్ పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి అందులో యాక్ట్ చేసే యాక్టర్స్ అని చెప్పాలి. రెండోది మాత్రం వాళ్ల స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ బాగా గ్రిప్పింగ్గా ఉంటాయి. అంటే ఆడియన్ బాగా ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం కష్టం. అయితే ఒక్క లవ్ స్టోరీలు మాత్రమే కాదు.. యాక్షన్, డ్రామా అన్నింటినీ వాళ్లు బాగా తెరకెక్కించగలరు. అందుకే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొరియన్ సినిమాలు, డ్రామాలకు బాగా డిమాండ్ పెరిగింది. అలాంటి కోవకు చెందిందే ఈ సిరీస్ కూడా. ఈ సిరీస్ మీకు నచ్చడానికి లవ్ స్టోరీ ఒకటే కాదు.. ఇది ఒక పిరియాడికల్ డ్రామా తీసుకొచ్చారు. ఈ సిరీస్ ని కేవలం లవ్ స్టోరీ అనలేం. ఇందులో మంచి యాక్షన్ ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి.

మొత్తానికి ఇది ఒక మంచి ఫుల్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ అని చెప్పచ్చు. ఈ సిరీస్ ని మీరు కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ సిరీస్ లో ఏకంగా 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ గంట వరకు ఉంటుంది. అంటే ఈ సిరీస్ మొత్తం 20 గంటలు ఉంటుంది. పైగా ఒకసారి స్టార్ట్ చేస్తే దీనిని ఆపడం కష్టంగా ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం ఒక గ్రామంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక సైనిక పాఠశాల ఉంటుంది. రాజ కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాణి ఒక ఎలైట్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంది. అందులో ర్యాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ ర్యాంకింగ్ సిస్టమ్ ముసుగులోనే అసలు పోటీ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎత్తులు, పైఎత్తులు, ప్రణాళికలు అన్నీ ఆసక్తి రేపుతాయి. అలాగే ఇందులో ఉండే లవ్ స్టోరీ కూడా అందరినీ ఆలరిస్తుంది. ఈ సిరీస్ పేరు హారాంగ్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş