iDreamPost
android-app
ios-app

సీనుకో ట్విస్ట్.. నిమిషానికో మలుపు.. OTTలో పెచ్చెక్కించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Investigative Suspense Thriller: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని మాత్రం చూసుండరు. ఇది ఓటీటీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని మీరో ఒప్పుకుంటారు.

OTT Suggestions- Best Investigative Suspense Thriller: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని మాత్రం చూసుండరు. ఇది ఓటీటీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని మీరో ఒప్పుకుంటారు.

సీనుకో ట్విస్ట్.. నిమిషానికో మలుపు.. OTTలో పెచ్చెక్కించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్!

సినిమా అంటే చాలామందికి కామెడీ, యాక్షన్ ఉంటే సరిపోతుంది. ఇంకొంత మంది మాత్రం కాస్త హారర్ చిత్రాలు కోరుకుంటారు. కానీ, చాలామంది ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు అంటే పడి చచ్చిపోతారు. అయితే చాలాసార్లు కొన్ని సినిమాలు మంచివే వచ్చినా కూడా స్టార్ కాస్ట్ లేనందు వల్ల మరుగున పడిపోతూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఒక చిత్రాన్ని ఇప్పుడు మీకోసం ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఇది ఒక బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అవును ఇంత హైప్ ఇయ్యాల్సిన అవసరం ఏంటి అని విసుక్కోకండి. మూవీ చూశాక మీరే అంటారు వావ్ అని.

సాధారణంగా సినిమాకి ఆడియన్ ఎంగేజ్ కావాలి అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. కానీ, ఈ మూవీలో అన్నీ అలాంటి పాయింట్సే ఉన్నాయి. ఒక్కో సీన్ కి అయితే వచ్చే ట్విస్టులకు నోరెళ్లబెట్టేస్తారు. సినిమా అంతా అర్థమయ్యినట్లే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చినట్లు ఉంటుంది. కానీ, మీరు ఊహించని విధంగా ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అప్పుడు చూసే వాళ్లు కచ్చితంగా అవాక్కవ్వాల్సిందే. అలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమా ఓటీటీలోకి వచ్చి దాదాపుగా మూడేళ్లు అవుతోంది. కానీ, ఆ మూవీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే మీకోసం సజీషన్ గా తీసుకొచ్చాం.

అసలు కథ ఏంటంటే.. హీరో- హీరోయిన్ కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ల కారుకు యాక్సిడెంట్ అవుతంది. ఆ కారులో ఉన్న హీరోకి గాయాలు కాగా.. అతని భార్య మాత్రం మిస్ అవుతుంది. అయితే ఆ ప్రమాదం తర్వాత అసలు అతనికి ఏమీ గుర్తుండదు. ప్రమాదం జరిగిందని అతను ఒక ప్రాంతాన్ని చెబితే.. అందరూ అక్కడ కాదు జరిగింది అంటారు. అతనికి గుర్తున్న విషయాలు అన్నీ అబద్ధం అని చెప్తారు. అసలు అతనికి ఏమీ అర్థం కాదు. ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఇలా అనేక ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు. అయితే అసలు విషయాన్ని కనిపెట్టాడా? తప్పిపోయిన భార్య బతికే ఉందా? ఆమె చనిపోతే ఎవరు చంపారు?

ఈ మూవీ పేరు.. మిస్సింగ్. ఇది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నిజానికి 2021లోనే విడుదలైంది. కాకపోతే ఫిమిలియర్ ఫేసెస్ కనిపించకపోవడం వల్ల చాలా మంది లైట్ తీసుకున్నారు. హర్షా నర్రా- నిక్కీషా లీడ్ రోల్స్ ప్లే చేశారు. మిషా నారంగ్, ఛత్రపతి శేఖర్, సూర్య కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో వచ్చే ట్విస్టులకు కచ్చితంగా మెస్మరైజ్ అయిపోతారు. ఆ కేసును సాల్వ్ చేసేందుకు వచ్చిన పోలీసులు కూడా ఆ కేసును ఛేదించలేక అల్లాడిపోతారు. మరి.. ఆ కేసు ఎలా సాల్వ్ అయ్యింది? ఆ మిస్సింగ్ పర్సన్ దొరికిందా అనేదే కథ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి