iDreamPost
android-app
ios-app

OTTలో హారర్ మూవీ లవర్స్ ని కూడా వణికించే మూవీ.. ఒంటరిగా చూడొద్దు!

OTT Suggestions- Best Horror Movie Terrified: ఓటీటీలో రొటీన్ హారర్ చిత్రాలు చూసి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక మంచి క్రేజీ హారర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. దీనిని ఒంటరిగా మాత్రం అస్సలు చూడొద్దు.

OTT Suggestions- Best Horror Movie Terrified: ఓటీటీలో రొటీన్ హారర్ చిత్రాలు చూసి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక మంచి క్రేజీ హారర్ చిత్రాన్ని తీసుకొచ్చాం. దీనిని ఒంటరిగా మాత్రం అస్సలు చూడొద్దు.

OTTలో హారర్ మూవీ లవర్స్ ని కూడా వణికించే మూవీ.. ఒంటరిగా చూడొద్దు!

ఎప్పుడూ చెప్పే డైలాగే.. హారర్ సినిమాలు చూడటం ఒక బ్యాడ్ హ్యాబిట్. దానిని మానమని చెప్పినా మానడం మాత్రం చాలా కష్టం. ఒక వారంలో కనీసం ఒక మంచి హారర్ చిత్రం చూడాలి అనేది కొందరి టార్గెట్. అలాంటి వారి కోసం ది బెస్ట్ హారర్ చిత్రం సజీషన్ గా తీసుకొచ్చాం. కానీ, ఈ మూవీని చూడాలి అంటే కచ్చితంగా గుండె ధైర్యం ఉండాలి. అలాగే ఈ సినిమాని ఒంటరిగా మాత్రం చూడొద్దు. రాత్రిపూట చూడకపోవడం కూడా మరింత మంచిది. ఇంత ఎలివేషన్స్ ఇచ్చి సినిమాలో ఏమీ ఉండకపోతేనా.. అని అనుకోవద్దు. ఇది కచ్చితంగా ప్యాంటులు తడిపేసే కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ చిత్రం. సినిమా చూసిన తర్వాత కచ్చితంగా ఆ మాట మీరు ఒప్పుకుంటారు.

హారర్ సినిమాలో కావాల్సింది మొదట ఆడియన్స్ ని భయపెట్టే ఎలిమెంట్స్. ఈ సినిమాలో అవి టన్నుల కొద్దీ ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా వణికిస్తూనే ఉంటుంది. ఇది తెలుగు చిత్రం కాదు.. ఇంగ్లీష్ చిత్రం కాదు అందుకే అంత బాగా భయపెడుతుంది. ఇందులో ఉండే హారర్ సీన్స్, ముఖ్యంగా చాలా సైలెంట్ గా వచ్చే వణికించే సన్నివేశాలు గుండెను ఒక అంగుళం కిందకు జార్చేస్తాయి. మధ్యలో కాస్త సినిమా ల్యాగ్ ఉందేమో అనే భావన కలుగుతుంది. కానీ, హారర్ సీన్స్ మధ్య ఆ మాత్రం ఉంటేనే గుండె కాస్త కుదుటపడటానికి బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమాకి హారరే ప్రాణం.. హారరే సర్వం కూడా.

ఈ సినిమా కథ చాలా సింపుల్. ఒక ఊరిలో ఒక కాలనీ ఉంటుంది. అక్కడ అంతా అసహజంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు అన్నీ సంభవిస్తాయి. అక్కడ ఎవరూ ఉండరు కూడా. అలాంటి ప్రాంతాన్ని పరిశీలించేందుకు.. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు పారానార్మల్ యాక్టివిటీస్ ట్రాక్ చేసే ఒక టీమ్ ఆ కాలనీకి వెళ్తుంది. అక్కడున్న ఇళ్లన్నీ పరిశీలిస్తుంది. అయితే వారికి కూడా ఆ దెయ్యాలు కనిపిస్తాయి. వాటిని కట్టడి చేయలేకపోవడమే కాకుండా.. వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పారానార్మల్ టీమ్ కూడా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అసలు ఆ దెయ్యాల కథ ఏంటి? అలా ఎందుకు చంపుతున్నాయి? వాటిని కట్టడి చేయడం ఎలా? అసలు ఆ కాలనీకి ఏం జరిగింది? అనే విషాలు తెలియాలి అంటే మీరు ఈ ‘టెర్రిఫైడ్‘ అనే సినిమా చూడాల్సిందే. అయితే ఇది ఓటీటీలో ఇండియాలో అందుబాటులో లేదు. కానీ, మీరు యూట్యూబ్ లో ATERRADOS అని గానీ.. Terrified అని గానీ సెర్చ్ చేస్తే ఫుల్ మూవీ దొరుకుంది. మరి.. పొరపాటున ఇప్పటికే ఈ సూపర్ హారర్ చిత్రం చూసుంటే మాత్రం మీకు ఎంత భయమేసిందో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş