iDreamPost
android-app
ios-app

సరదా సరదాకే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. OTTలో బెస్ట్ హారర్ మూవీ!

  • Published Jul 17, 2024 | 9:22 PM Updated Updated Jul 17, 2024 | 9:22 PM

OTT Suggestions- Best Horror Movie Tarot: హారర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమాని ఒకసారి చూసేయండి. కొందరు ఆకతాయిలు సరదా సరదాకి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ప్రతి సీన్ ఆసక్తిగా సాగుతుంది.

OTT Suggestions- Best Horror Movie Tarot: హారర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమాని ఒకసారి చూసేయండి. కొందరు ఆకతాయిలు సరదా సరదాకి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ప్రతి సీన్ ఆసక్తిగా సాగుతుంది.

  • Published Jul 17, 2024 | 9:22 PMUpdated Jul 17, 2024 | 9:22 PM
సరదా సరదాకే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. OTTలో బెస్ట్ హారర్ మూవీ!

పిల్లల్లో ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఆ కుతూహలం కొంత వరకు ఉంటే బాగానే ఉంటుంది. కానీ, అది హద్దులు దాటితే ప్రాణాల మీదకు కూడా రావచ్చు. అలాంటి ఒక క్రేజీ పాయింట్ మీద హాలీవుడ్ లో అదిరిపోయే సినిమా ఉంది. అది ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది కూడా. పైగా ఈ మూవీలో మన టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు కూడా ఉండటం విశేషం. ఆమె కూడా ఒక క్రేజీ రోల్ అయిపే ప్లే చేసింది. ఇది అలాంటి ఇలాంటి హారర్ చిత్రం కాదండోయ్.. చూస్తుంటే వెన్నులో వణుకు వచ్చేస్తుంది. పిల్లలు ఏదో సరదాగా స్టార్ట్ చేసిన గేమ్.. ఆఖరికి వారు చావుతో రన్నింగ్ రేసు పెట్టుకునే వరకు వస్తుంది.

ఈ సినిమాలో గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ ఉంటారు. వాళ్లంతా హై స్కూల్ లో చదివే పిల్లలు. వాళ్లు మనం చూశాం కదా.. దెయ్యాలతో మాట్లాడే బోర్డ్ గేమ్స్ వంటిది ఒకటి ట్రై చేస్తారు. కాకపోతే ఈసారి కార్డ్స్ తో అనమాట. పేకల మాదిరిగానే కొన్ని మంత్ర శక్తులు ఉన్న కార్డులు ఉంటాయి. ఒక్కో కార్డు ఒక ప్రేతాత్మను సూచిస్తూ ఉంటుంది. ఆ కార్డులతో ఈ పిల్లలు ఆటలు స్టార్ట్ చేస్తారు. వారికి అవి డేంజర్ అని తెలుసు. కానీ, ఒకసారి ట్రై చేయాలి అనుకుంటారు. అలా కార్డుల ద్వారా వారి భవిష్యత్తును తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ఆ తర్వాత అది వాళ్లకు భవిష్యత్తే లేకుండా చేస్తుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతారు. కుర్రతనం కదా.. తెలిసీ తెలియక పెద్ద తప్పు చేసేస్తారు.

ఒక్కొక్కరు ఒక కార్డు తీసుకుంటారు. ఎవరికైతే ఒక కార్డు వస్తుందో దాన్ని బట్టి వారి భవిష్యత్ ఉంటుంది అనుకుంటారు. అయితే ఎవరికి ఏదైతో కార్డు వస్తుందో.. దానిలో ఉండే ప్రేతాత్మ వారి వెంట పడుతూ ఉంటుంది. వారిలో కొందరి ప్రాణాలు కూడా పోతాయి. అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ దెయ్యాల నుంచి తప్పించుకు తిరుగుతూ ఉంటారు. ఇదంతా ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్లు ప్రాణాలతో బయట పడ్డారా? వాళ్లు నిద్రలేపిన అతీత శక్తులను మళ్లీ ఎలా కంట్రోల్ చేయాలి? అసలు అది వారికి సాధ్యం అవుతుందా? అలాంటి ఒక ప్రయత్నం చేశారా? అసలు వారిలో ఎంతమంది బతికి ఉన్నారు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలి అంటే మీరు ఈ ‘టారోట్’ అనే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.119కు రెంట్ బేసిస్లో అందుబాటులో ఉంది. అయితే ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్లో అయితే ఫ్రీగానే చూడచ్చు. ఈ మూవీ కాస్త కంగారు పెట్టేదిలాగానే ఉంటుంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom