iDreamPost
android-app
ios-app

అతని పేరు తల్చుకుంటే చంపేస్తాడు.. OTTలో వణికించే హారర్ మూవీ!

  • Published Jul 30, 2024 | 6:00 AM Updated Updated Jul 30, 2024 | 6:00 AM

OTT Suggestions- Best Horror Movie Candy Man: హారర్ సినిమాలు చూడటం మీకు ఇష్టమా? అయితే మీకోసమే ఈ మూవీని తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి హారర్ చిత్రం కాదండోయ్.. వెన్నులో వణుకు తెప్పిస్తుంది.

OTT Suggestions- Best Horror Movie Candy Man: హారర్ సినిమాలు చూడటం మీకు ఇష్టమా? అయితే మీకోసమే ఈ మూవీని తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి హారర్ చిత్రం కాదండోయ్.. వెన్నులో వణుకు తెప్పిస్తుంది.

  • Published Jul 30, 2024 | 6:00 AMUpdated Jul 30, 2024 | 6:00 AM
అతని పేరు తల్చుకుంటే చంపేస్తాడు.. OTTలో వణికించే హారర్ మూవీ!

హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందా? మీరు ఎంత భయపెట్టే చిత్రాలు చూస్తారు? హారర్ సినిమాలు చూడటంలో మీరు పీహెచ్ డీ చేసినా కూడా.. మీరు ఈ మూవీ చూడటానికి కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇందులో ఉండే హారర్ ఎలిమెంట్స్ అలా ఉంటాయి. అదేదో పాత దెయ్యాల కథలు చెప్తున్నట్లుగా సినిమా స్టార్ట్ చేసి.. మోడ్రన్ దెయ్యాలతో వణికించేస్తారు. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. చిన్న పిల్లలను ఎత్తుకేళ్లే ఒక బూచోడి గురించి ఈ సినిమాలో కథ ఉంటుంది. అయితే ఆ తర్వాత అది పెద్దోళ్లను ఎత్తుకెళ్లే దెయ్యంలా మారిపోతుంది. మీరు ఈ మూవీని చూడాలి అంటే కాస్త హై వైలెన్స్ కి సిద్ధపడి చూడాల్సి ఉంటుంది.

ఓటీటీలో హారర్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిందో లేదో.. చూసేస్తున్నారు. అందుకే ఓటీటీలో కొత్త హారర్ చిత్రాలు దొరకడం లేదు. అలాంటి వారికోసం ఒక క్రేజీ హారర్ మూవీ తీసుకొచ్చాం. ఇది హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బెస్ట్ హారర్ మూవీ. ఇందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. నిజానికి ఒక సూపర్ హీరో సినిమాలా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఇది ఒక వణికించే చిత్రం అని. ఇందులో ఒక వింటేజ్ బూచోడి గురించి కథలు చెప్తూ ఉంటారు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పిల్లలకు చాక్లెట్లు ఇస్తూ ఉంటాడు. అందరూ అతడిని మంచోడు అనుకుంటారు. కానీ, పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి కాల్చేస్తే గానీ తెలియలేదు అతను పిల్లలను చంపుతున్నాడు అని. అతనికి క్యాండీ మ్యాన్ అని పేరు పెడతారు.

అయితే ఆ తర్వాత అతను ఒక దెయ్యంగా మారాడు అంటారు. ఎవరైతే అద్దంలో చూస్తూ.. అతని పేరును ఐదుసార్లు పలుకుతారో.. వాళ్లకి అతను కనిపిస్తాడు అంటారు. అలాగే కేవలం కనిపించడమే కాదు.. తాను గతంలో ఏం చేశాడో అదే చేస్తాడు. అదే హత్యలు చేయడం. ఆ కథలు విన్న కొందరు దానిని ప్రయత్నించాలి అనుకుంటారు. అద్దంలో చూస్తూ ఏకంగా ఐదుగురు ఒకేసారి క్యాండీ మ్యాన్ అంటూ పిలుస్తారు. అతను రావడమే కాదు.. విచక్షణారహితంగా అందరినీ చంపేస్తాడు. అలాగే మరో యువకుడు కూడా ఇదే పని చేస్తాడు. అతను జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అసలు ఆ క్యాండీ మ్యాన్ ఎందుకు అలా చేస్తున్నాడు? ఇలాంటివి తెలియాలి అంటే మీరు ఈ ‘క్యాండీ మ్యాన్’ అనే మూవీ చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కానీ, ఇండియాలో చూడటం కుదరదు. అయితే మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఫ్రీగా ఈ మూవీ చూడచ్చు. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio