iDreamPost
android-app
ios-app

దెయ్యాలతో సైడ్ బిజినెస్.. OTTలో ఈ హారర్ కామెడీకి పొట్ట చెక్కలవుతుంది!

  • Published Jun 10, 2024 | 3:55 PM Updated Updated Jun 10, 2024 | 3:55 PM

OTT Suggestions- Ktrina Kaif Best Horror Comedy Thriller: ఓటీటీలో ఈ హారర్ కామెడీ మాత్రం చాలా స్పషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో కత్రినా కైఫ్ ఉండటమే కాకుండా.. కామెడీకి పొట్ట చెక్కలవుతుంది కూడా. ఏంటి ఇంకా ఈ మూవీ చూడలేదా?

OTT Suggestions- Ktrina Kaif Best Horror Comedy Thriller: ఓటీటీలో ఈ హారర్ కామెడీ మాత్రం చాలా స్పషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో కత్రినా కైఫ్ ఉండటమే కాకుండా.. కామెడీకి పొట్ట చెక్కలవుతుంది కూడా. ఏంటి ఇంకా ఈ మూవీ చూడలేదా?

  • Published Jun 10, 2024 | 3:55 PMUpdated Jun 10, 2024 | 3:55 PM
దెయ్యాలతో సైడ్ బిజినెస్.. OTTలో ఈ హారర్ కామెడీకి పొట్ట చెక్కలవుతుంది!

అన్ని దెయ్యాలు భయ పెట్టవు. కొన్ని దెయ్యాలు నవ్విస్తాయి.. మరికొన్ని దెయ్యాలు ఆట పట్టిస్తాయి. ఇంకొన్ని దెయ్యాలు విసిగిస్తాయి. కానీ, ఇలాంటి దెయ్యాలను అన్నింటిని ఒకే దగ్గర చూడటం అంటే కుదరకపోవచ్చు. కానీ, ఒక సినిమాలో ఇలాంటి అన్ని దెయ్యాలను ఒకే దగ్గర చూడచ్చు. అలాంటి ఒక స్కేరీ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ డ్రామా ఒకటి ఓటీటీలో అందుబాటులోనే ఉంది. మీరు ఇప్పటివరకు అలాంటి ఒక సినిమా చూడకపోతే మాత్రం కచ్చితంగా చూసేయచ్చు. అసలు ఈ మూవీ ఏంటి? ఆ మూవీలో ఉన్న కథ ఏంటి? అసలు ఆ హారర్ థ్రిల్లర్ ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

తెలుగులో కూడా మీరు చాలానే హారర్ కామెడీ చిత్రాలను చూసే ఉంటారు. కానీ, మూవీ మాత్రం కచ్చితంగా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ కత్రినా కైఫ్ దెయ్యంగా చేసింది. ఆమె నవ్విస్తుంది.. భయపెడుతుంది.. ఆలోచింపజేస్తుంది కూడా. అంతేకాకుండా ఒక మహత్కార్యం కోసం ఇద్దరు మనుషులతో కలిసి పని చేస్తుంది. ఆమెకు ఒక పెద్ద మిషన్ కూడా ఉంటుంది. ఆ మిషన్ కోసం దెయ్యాలను చూడగల ఇద్దరు కుర్రాళ్లను సహాయం కోరుతుంది. వారితో కలిసి ఒక పెద్ద మిషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ మిషన్ కోసం వారికి ఉన్న శక్తులను వాడుకుంటుంది. అయితే ఆమె అలా ఎందుకు చేస్తోంది అనేది ఇక్కడ పాయింట్. అంటే ఆత్మలకు మోక్షం కల్పించడం ఆమె లక్ష్యం.

Phone Booth

తీరని కోరికలు, ప్రతీకారం, పగలు ఉన్న ఆత్మలు ఈ లోకాన్ని వీడకుండా ఇక్కడి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి ఆత్మలకు మోక్షం కల్పించడం కోసం కత్రినా కైఫ్ ఒక మిషన్ స్టార్ట్ చేస్తుంది. దానికోసం ఇద్దరు కుర్రాళ్లను హెల్ప్ అడుగుతుంది. ఎందుకంటే వారికి ఆత్మలు కనిపిస్తాయి. వీళ్లు ముగ్గురూ కలిసి దెయ్యాలను వదిలించే ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తారు. దాంతో వారికి పెద్దఎత్తున డబ్బులు కూడా వస్తాయి. ఈ పాయింట్ మీద ఇప్పటికే చాలానే సినిమాలు వచ్చాయి. సూర్య రాక్షసుడు, కార్తీ కాష్మోరా, బాలీవుడ్ లో బూత్ పోలీస్.. ఇలాంటి సినిమాలు చాలానే చూశాం.

ఈ మూవీ మాత్రం కాస్త స్పెషల్ గా ఉంది. ఎందుకంటే ఇందులో కామెడీ కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే కత్రీనా కైఫ్ ని ఇలాంటి రోల్ లో ఎప్పుడూ చూసి ఉండరు. అలాగే కత్రీనా కైఫ్ కు ఒక మిషన్ కూడా ఉంటుంది. అందుకే ఆత్మలకు మోక్షం కల్పిస్తూ ఉంటుంది. ఈ సినిమా పేరు ‘ఫోన్ బూత్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఫన్, ఫ్రస్ట్రేషన్, హారర్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ కాస్త గట్టిగానే ఉంటాయి. ఇంక కత్రినా కైఫ్ మ్యాజిక్ కూడా ఉంటుంది. మరి.. ఇప్పటికే మీరు ఈ సినిమా చూసి ఉంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss